E-Paper
Advertisement

Dolby Soundbars: మ్యూజిక్ లవర్స్ స్పెషల్.. దేశంలో టాప్ – 4 సౌండ్ బార్స్.. Dolby Atmos, 3D సౌండ్!

Dolby Soundbars: మ్యూజిక్ లవర్స్ స్పెషల్.. దేశంలో టాప్ – 4 సౌండ్ బార్స్.. Dolby Atmos, 3D సౌండ్!
Advertisement

Dolby Soundbars: మ్యూజిక్ లవర్స్ అమితంగా ఇష్టపడే ఎలక్ట్రానిక్ పరికరాల్లో సౌండ్ బార్స్ ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా Dolby Atmos టెక్నాలజీతో రూపొందిన వాటిన పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. అయితే రూ.50,000 లోపు బడ్జెట్ లో Dolby, 3D సరౌండ్ సౌండ్ ను అందించే అత్యుత్తమ టాప్ – 4 సౌండ్ బార్స్ ను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Samsung HW-Q800C/XL

శాంసంగ్ క్యూ-సిరీస్‌లోని ఈ సౌండ్‌బార్.. డాల్బీ అట్మోస్ ప్రియులకు ఒక బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇందులో 5.1.2 సౌండ్ క్వాలిటీ కలిగిన రెండు అప్-ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఇవి శబ్దాన్ని పైకప్పుకు తగిలి కిందకు పంపి 3D ఎఫెక్ట్‌ను అందిస్తాయి. 360W పవర్ అవుట్‌పుట్, 8 అంగుళాల వైర్‌లెస్ సబ్‌వూఫర్. స్పేస్‌ఫిట్ సౌండ్ (మీ గది ఆకృతిని బట్టి సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తుంది) వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇది రూ.45,000 – 49,990 మధ్య సేల్ అవుతోంది.

Sony BRAVIA Theatre System 6 (HT-S60)

Advertisement

సోనీ బ్రాండ్ నుండి వస్తున్న ఈ సౌండ్ బార్.. సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది. ఇది 5.1 ఛానల్ రియల్ సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 1000W పవర్ఫుల్ అవుట్‌పుట్ కలిగిన వైర్డ్ రియర్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి శబ్దాన్ని స్పష్టంగా వినిపిస్తాయి. దీనిలోని వర్టికల్ సరౌండ్ ఇంజిన్ టెక్నాలజీ.. అద్భుతమైన డాల్బీ అట్మోస్ అనుభవాన్ని అందిస్తుంది. దీని ధర సుమారు రూ.49,990.

JBL Bar 500 Pro

JBL బ్రాండ్.. తన పంచీ బేస్‌ మ్యూజిక్ కు చాలా పాపులర్. JBL Bar 500 Pro సౌండ్ బార్.. వైర్‌లెస్ మల్టీబీమ్ టెక్నాలజీని కలిగి ఉంది. 5.1 ఛానల్ తో వర్క్ చేస్తుంది. 590W అవుట్‌పుట్, 10 అంగుళాల భారీ వైర్‌లెస్ సబ్‌వూఫర్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. దీనిలోని ‘MultiBeam’ టెక్నాలజీ.. గది అంతటా శబ్దాన్ని ప్రతిధ్వనించేలా చేసి 3D ఎఫెక్ట్ అందిస్తుంది. అదనపు రియర్ స్పీకర్లు అవసరం లేకుండానే మంచి సరౌండ్ సౌండ్ ను పొందవచ్చు. ఇది మార్కెట్ లో రూ.44,999కు సేల్ అవుతోంది.

Advertisement

Also Read: Optoma Projector: వరల్డ్‌లో ఫస్ట్ టైమ్.. డాల్బీ విజన్, ఐమాక్స్ అనుభవం.. క్రేజీ ప్రొజెక్టర్ భయ్యా!

Zebronics Juke Bar 10000

బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న సౌండ్ బార్ ను కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది 5.2.2 ఛానల్ తో వర్క్ చేస్తుంది. 1100W భారీ అవుట్‌పుట్, డ్యూయల్ వైర్‌లెస్ సబ్‌వూఫర్లు, వైర్‌లెస్ శాటిలైట్ స్పీకర్లు దీనిలో ఉంటాయి. అతి తక్కువ బడ్జెట్ లో రియల్ డాల్బీ అట్మోస్, వైర్‌లెస్ రియర్ స్పీకర్లను కోరుకునే వారుకు దీనిని ట్రై చేయవచ్చు. మార్కెట్ లో రూ.35,000-42,000 మధ్య ఇది అందుబాటులో ఉంది.

ముఖ్యగమనిక: డాల్బీ అట్మోస్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మీ టీవీకి HDMI eARC పోర్ట్ ఉండాలి. గది చిన్నది అయితే JBL లేదా Samsung మోడల్స్ బాగుంటాయి. అదే పెద్ద హాల్ అయితే Sony లేదా Zebronics వంటి రియర్ స్పీకర్లు ఉన్న మోడల్స్ ఎంచుకోవడం ఉత్తమం.

Also Read: Satellite Smartwatch: శాటిలైట్‌ స్మార్ట్ వాచ్.. భూమ్మిద ఎక్కడ అపాయంలో ఉన్నా.. ఇట్టే పసిగట్టి కాపాడేస్తది!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×