E-Paper
Advertisement

Optoma Projector: వరల్డ్‌లో ఫస్ట్ టైమ్.. డాల్బీ విజన్, ఐమాక్స్ అనుభవం.. క్రేజీ ప్రొజెక్టర్ భయ్యా!

Optoma Projector: వరల్డ్‌లో ఫస్ట్ టైమ్.. డాల్బీ విజన్, ఐమాక్స్ అనుభవం.. క్రేజీ ప్రొజెక్టర్ భయ్యా!
Advertisement

Optoma Projector: హోమ్ థియేటర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆప్టోమా (Optoma).. ప్రపంచంలోనే మొట్టమొదటి Triple-Laser 4K Projector (UHR90DV) ను భారతదేశంలో విడుదల చేసింది. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ, మెరుగైన కాంతి, ప్రొఫెషనల్ గ్రేడ్ రంగులతో.. ఇది థియేటర్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఈ ట్రిపుల్ లేజర్ 4K ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏంటీ? దీనిలోని ప్రధాన ఫీచర్లు? ధర ఎంత? వంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ ఫస్ట్ డ్యూయల్ సర్టిఫికేషన్

డాల్బీ విజన్ (Dolby Vision), ఐమాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ (IMAX Enhanced) సర్టిఫికేషన్లు రెండూ కలిగిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొజెక్టర్ గా ఇది గుర్తింపు పొందింది. దీనివల్ల సినిమాలో రంగులు, కాంతి అత్యంత స్పష్టంగా కనిపిస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐమ్యాక్స్ వంటి క్వాలిటీ థియేటర్లలో సినిమాను స్పష్టంగా చూసిన ఫీలింగ్ కలుగుతుందని అన్నారు.

ట్రిపుల్ లేజర్ టెక్నాలజీ

Advertisement

ఈ ప్రొజెక్టర్ లో ట్రిపుల్ లేజర్ టెక్నాలజీని వినియోగించారు. దీనిలో విడివిడిగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం (RGB) లేజర్ కిరణాలను ఉపయోగించారు. దీనివల్ల 96% BT.2020 కలర్ గామట్‌తో.. సినిమా థియేటర్ స్థాయిలో రంగులను చూడవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

అత్యధిక కాంతి

ఈ ప్రొజెక్టర్.. 5,000 ISO Lumens బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీని వల్ల గదిలో వెలుతురు ఉన్నప్పటికీ బొమ్మ చాలా స్పష్టంగా కనిపించనుంది. పగటి సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొజెక్టర్ ద్వారా సినిమా చూసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

దీర్ఘకాలిక మన్నిక

Advertisement

ఈ ప్రొజెక్టర్ లోని లేజర్ లైట్ దాదాపు 30,000 గంటల పాటు పనిచేస్తుంది. అంటే రోజుకు ఒక సినిమా చూసినా సుమారు 30 ఏళ్ల పాటు ఇది మన్నికగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

స్క్రీన్‌కు తగ్గట్లు అడ్జస్ట్‌మెంట్

ఇందులో మోటరైజ్డ్ జూమ్, ఫోకస్, లెన్స్ షిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల ప్రొజెక్టర్‌ను ఎక్కడ ఉంచినా స్క్రీన్‌కు తగ్గట్టుగా సెట్ చేయడం చాలా సులభం.

Also Read: Philips OneChef: ఫిలిప్స్ సంచలనం.. అధునాతన కుక్కర్ వచ్చేసిందోచ్.. 33 స్టైల్స్‌లో వండుకోవచ్చు!

ధర ఎంతంటే?

ఈ అత్యాధునిక ప్రొజెక్టర్ ధరను రూ.15,90,000గా ఆప్టోమా నిర్ణయించింది. ఇది ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ ఆడియో-విజువల్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. సినిమా ప్రియుల కోసం ముఖ్యంగా ఇంట్లోనే పెద్ద స్క్రీన్‌పై థియేటర్ అనుభూతిని పొందాలనుకునే వారి కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుందని ఆప్టోమా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్య గమనిక: ప్రొజెక్టర్ కు సంబంధించి ఆప్టోమా కంపెనీ ఇచ్చిన వివరాల ఆధారంగానే ఈ కథనం రాయడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: Ugadi Pachadi Benefits: ఒక స్పూన్ ఉగాది పచ్చడి.. మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×