E-Paper
Advertisement

Satellite Smartwatch: శాటిలైట్‌ స్మార్ట్ వాచ్.. భూమ్మిద ఎక్కడ అపాయంలో ఉన్నా.. ఇట్టే పసిగట్టి కాపాడేస్తది!

Satellite Smartwatch: శాటిలైట్‌ స్మార్ట్ వాచ్.. భూమ్మిద ఎక్కడ అపాయంలో ఉన్నా.. ఇట్టే పసిగట్టి కాపాడేస్తది!
Advertisement

Satellite Smartwatch: ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో స్మార్ట్ పరికరాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ స్మార్ట్ వాచ్ ను బ్రస్సెల్స్ డిజైన్ స్టూడియో.. ఫ్యూచర్ వేవ్ సిరీస్ కింద ఆవిష్కరించింది. సరికొత్త శాటిలైట్ కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్ ను ఓ – బాయ్ (O-Boy) పేరిట లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ వాచ్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాణాలను రక్షించే సరికొత్త స్మార్ట్ వాచ్ గా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ వాచ్ లోని ప్రధాన ఫీచర్లు ఏంటీ? ఎవరికి ఉపయోగం? వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

ప్రాణదాతగా శాటిలైట్ స్మార్ట్‌వాచ్

సాధారణంగా మనం వాడే స్మార్ట్‌వాచ్‌లు ఫోన్ నెట్‌వర్క్ లేదా వైఫై మీద ఆధారపడతాయి. కానీ ఈ సరికొత్త టెక్నాలజీతో రూపొందిన ఓ-బాయ్ వాచ్.. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని అడవులు, సముద్రాలు లేదా కొండ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శాటిలైట్ ను ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు మీ ఉనికిని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి వినియోగదారులు సురక్షితంగా ఉండొచ్చు.

గ్లోబల్ కనెక్టివిటీ

Advertisement

ఈ స్మార్ట్ వాచ్.. టెలి, వైఫై నెట్ వర్క్ తో సంబంధం లేకుండా ఇది నేరుగా ఉపగ్రహాల (Satellites) ద్వారా సందేశాలను పంపుతుంది. కాబట్టి భూమి మీద ఎక్కడి నుంచైనా అత్యవసర సమాచారాన్ని చేరవేయవచ్చు.

ఎమర్జెన్సీ అలర్ట్స్

మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు. మీ ఖచ్చితమైన లొకేషన్ వివరాలు రెస్క్యూ టీమ్‌కు లేదా మీ కుటుంబ సభ్యులకు వెంటనే ఈ స్మార్ట్ వాచ్ చేరవేస్తుంది. తద్వారా విపత్కర పరిస్థితుల నుంచి మీరు సురక్షితంగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది.

శాటిలైట్ వాచ్ మోడల్స్..

Advertisement

బెల్జియంకు చెందిన ఈ ‘O-Boy’ స్మార్ట్‌వాచ్ తో పాటు మరికొన్ని శాటిలైట్ వాచ్ లు సైతం గ్లోబల్ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. Apple Watch Ultra 3, Garmin Fenix 8 Pro, Google Pixel Watch 4 వంటివి కూడా శాటిలైట్ ఎమర్జెన్సీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Also Read: Optoma Projector: వరల్డ్‌లో ఫస్ట్ టైమ్.. డాల్బీ విజన్, ఐమాక్స్ అనుభవం.. క్రేజీ ప్రొజెక్టర్ భయ్యా!

ఇది ఎవరికి ఉపయోగం?

ఈ శాటిలైట్ వాచ్ లు.. కొండలు, అడవుల్లో ట్రెక్కింగ్ చేసే వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే నడి సముద్రంలో సిగ్నల్స్ లేనప్పుడు నావికులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. గనులు, అడవుల్లో పనిచేసే వారికి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది. సాధారణ స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే ఇవి కేవలం ఫిట్‌నెస్ ట్రాకర్లుగానే కాకుండా ఆపదలో ఉన్నప్పుడు నిజమైన లైఫ్ సేవర్స్‌గా ఈ స్మార్ట్ వాచ్ లు ఉపయోగపడతాయి.

Also Read: Philips OneChef: ఫిలిప్స్ సంచలనం.. అధునాతన కుక్కర్ వచ్చేసిందోచ్.. 33 స్టైల్స్‌లో వండుకోవచ్చు!

Related News

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

Big Stories

Advertisement
×