E-Paper
Advertisement

‘ChiChi Call’ Video Scam: వైరల్ వీడియో స్కామ్‌తో కొత్త సైబర్ ఫ్రాడ్.. ఒక్క క్లిక్‌తో మీ ఫోన్ హ్యాక్..

‘ChiChi Call’ Video Scam: వైరల్ వీడియో స్కామ్‌తో కొత్త సైబర్ ఫ్రాడ్.. ఒక్క క్లిక్‌తో మీ ఫోన్ హ్యాక్..
Advertisement

‘ChiChi Call’ Video Scam| సైబర్ మోసగాళ్లు తరుచూ కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు. ఇటీవల “చిచి కాల్” అనే కొత్త రకం ఆన్‌లైన్ మోసం చాలా త్వరగా ప్రజల్లోకి వ్యాప్తి చెందుతోంది. మోసగాళ్లు ఫేక్ వీడియో లింకులతో యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రైవేట్ వైరల్ క్లిప్ చూపిస్తామని ఆశ చూపిస్తారు. కానీ ఇదంతా ప్లాన్ చేసిన సైబర్ మోసం మాత్రమే. “చిచి కాల్ వైరల్ వీడియో” లేదా “వెరా హిల్ లీక్ వీడియో” అనే లింకులు వస్తే జాగ్రత్త! అలాంటి సందేహాస్పద లింకులు క్లిక్ చేయకండి. ఒక్క క్లిక్‌తో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగతనం అవుతుంది.

వెరా హిల్ ఎవరు?

వెరా హిల్ ఫిలిప్పీన్స్‌లోని సియార్గావో నుంచి లైఫ్‌స్టైల్, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆన్‌లైన్‌లో ఆమెను “చిచి” అని పిలుస్తారు. ఆమె ప్రైవేట్ వీడియో కాల్ లీక్ అయిందని వైరల్ పోస్టులు వచ్చాయి. కానీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ఇదంతా అబద్ధమని చెబుతున్నారు. అలాంటి ఆథెంటిక్ లీక్ వీడియో ఏదీ లేదని ధృవీకరించారు. ఇదంతా మోసగాళ్లు సృష్టించిన ట్రెండ్ మాత్రమే. టిక్‌టాక్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, రెడ్డిట్‌లో ఫేక్ క్లిప్స్ వ్యాప్తి చేస్తున్నారు. చాలా వీడియోలు సంబంధం లేనివి లేదా హెవీ ఎడిట్ చేసినవి.

స్కామ్ ఎలా జరుగుతుంది?

Advertisement

మోసగాళ్లు SEO పాయిజనింగ్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్‌లలో “చిచి వీడియో కాల్ ఫుల్”, “వెరా హిల్ వైరల్ లింక్” వంటి కీవర్డ్స్‌తో ఫేక్ బ్లాగ్ పోస్టులు పోస్ట్ చేస్తారు. మీరు సెర్చ్ చేస్తే మోసపూరిత నకిలీ వెబ్‌సైట్లు మొదటి రిజల్ట్స్‌లో వస్తాయి (ముందుగా కనిపిస్తాయి). లింక్ క్లిక్ చేస్తే ఫేక్ స్ట్రీమింగ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేజీ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. అప్పుడు మీ IP అడ్రస్ క్యాప్చర్ చేస్తారు. ఫేక్ ఫేస్‌బుక్ ఏజ్ వెరిఫికేషన్ పేజీకి తీసుకెళతారు. క్రెడెన్షియల్ ఫిషింగ్ (మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్) పేజీలకు పంపుతారు. బ్రౌజర్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయమని అడుగుతారు. ఆ ప్లగిన్‌లో మాల్వేర్ (హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్) ఉంటుంది. అది మీ కీస్ట్రోక్స్ రికార్డ్ చేసి పాస్‌వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలిస్తుంది.

జాగ్రత్తగా ఉండాల్సిన సంకేతాలు

ఏజ్ వెరిఫికేషన్ కోసం ఫేస్‌బుక్ లాగిన్ అడిగితే అది మోసమే. ఒకేసారి లింక్స్‌కు మీ బ్రౌజర్ రీడైరెక్ట్ అవుతుంటే అది ప్రమాదకర విషయం. వీడియో చూడటానికి ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయమంటే మాల్వేర్. “అన్‌కట్” లేదా “ఫుల్ వెర్షన్” అని ప్రామిస్ చేసే అకౌంట్లు స్కామర్లవే. టెలిగ్రామ్, రెడ్డిట్ గ్రూపుల్లో ఫేక్ డౌన్‌లోడ్ లింకులు ఉంటాయి. తెలియని కంటెంట్ క్లిక్ చేయకండి.

వైరల్ కంటెంట్ షేర్ చేస్తే చట్టపరమైన రిస్క్

Advertisement

ఇలాంటి కంటెంట్ షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, భారతీయ న్యాయ సంహిత కింద సైబర్ క్రైమ్స్ శిక్షార్హం. నాన్-కన్సెన్షువల్ ఇంటిమేట్ కంటెంట్, డీప్‌ఫేక్ లీక్ వీడియోలు షేర్ చేయడం నేరం. ఫార్వర్డ్ చేసినా శిక్ష పడుతుంది. అన్‌వెరిఫైడ్ వైరల్ మెటీరియల్ షేర్ చేయకండి.

Also Read:  వేసవి వచ్చేసింది.. కరెంట్ కోతలకు బెస్ట్ ఇన్‌వర్టర్ బ్యాటరీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ డీల్స్

ఆన్‌లైన్‌లో ఎలా సేఫ్‌గా ఉండాలి?

సందేహాస్పద వైరల్ లింకులు క్లిక్ చేయకండి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించండి. డివైస్‌లను సెక్యూరిటీ ప్యాచెస్‌తో అప్‌డేట్ చేస్తూ ఉండండి. ట్రస్టెడ్ యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేయండి. సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో సందేహాస్పద పోస్టులను రిపోర్ట్ చేయండి. జాగ్రత్తగా ఉంటే మీ డేటా సేఫ్ అవుతుంది. సైబర్ క్రిమినల్స్.. మీ ఆసక్తి, భయాన్ని ఆయుధంగా ఉపయోగిస్తారు. అందుకే ఏదైనా కొత్తవి, వైరల్ ట్రెండ్స్ కనిపిస్తే తొందరపాటుతో ఈ తప్పులు చేయకండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×