E-Paper
Advertisement

Allu Sirish: రామ్ చరణ్ పై ట్రోల్.. కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్!

Allu Sirish: రామ్ చరణ్ పై ట్రోల్.. కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్!
Advertisement

Allu Sirish:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ (Allu Sirish) కూడా తన ప్రేయసి నయనికా రెడ్డి (Nayanika Reddy) తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. మార్చి 6వ తేదీన వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే దుబాయిలోని యాచ్ లో అల్లు శిరీష్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇవ్వగా.. ఇక్కడ అల్లు అర్జున్ హైదరాబాదులో సినీ సెలబ్రిటీల కోసం గ్రాండ్ ప్రైవేట్ పార్టీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ పార్టీలో అల్లు అర్జున్ ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి, రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన, అల్లు శిరీష్ ఆయన కాబోయే భార్య నయానికా రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరంతా బ్లాక్ డ్రెస్ కోడ్ పాటించి దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ పై ట్రోల్స్..

మరోవైపు అల్లు శిరీష్ కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో కొంతమంది రామ్ చరణ్ పై నెగిటివ్ కామెంట్లు చేశారు. స్వామి మాలలో అలాంటి పార్టీకి వెళ్తారా? వాళ్లను ఎలా ముట్టుకుంటారు? ఇది స్వామి మాలను అవమానించడమే అవుతుంది.. అంటూ కొంతమంది రామ్ చరణ్ పై విమర్శలు గుప్పించారు. అయితే వాళ్లందరికీ చెంప చెల్లుమనిపించేలా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు అల్లు శిరీష్. అల్లు శిరీష్ రామ్ చరణ్ స్వామితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ ఫోటో కింద పలు రకాల కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్స్ లో ఒక వ్యక్తి రామ్ చరణ్ స్వామి మాలలో పార్టీకి వచ్చాడని కామెంట్ చేశాడు. దీనికి సమాధానంగా అల్లు శిరీష్ ఊహించని కౌంటర్ ఇచ్చాడు.

గట్టి కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్..

Advertisement

“రామ్ చరణ్ స్వామి ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అయితే ఆ సమయంలో అక్కడ ఇంకా ఎవరు పార్టీకి రాలేదు. పైగా పార్టీ కూడా మొదలు కాలేదు . ఎవరు ఆల్కహాల్ తీసుకోలేదు . ఆ సమయంలోనే ఆయన వచ్చి మమ్మల్ని కలిసి ఫోటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయ్యప్ప స్వామి మాల పట్ల ఆయన అంత భక్తి శ్రద్ధలతో ఉంటారు” అంటూ చెప్పుకొచ్చారు అల్లు శిరీష్ . మొత్తానికైతే అల్లు శిరీష్ చేసిన ఈ కామెంట్లతో రామ్ చరణ్ పై వచ్చిన నెగటివ్ కామెంట్స్ కి భారీ కౌంటర్ పడిందని చెప్పాలి.

అయ్యప్ప స్వామి పై రామ్ చరణ్ భక్తి..

ఇకపోతే రామ్ చరణ్ కి అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తిశ్రద్ధల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఏడాదిలో కనీసం రెండు నెలలైనా ఆయన మాలలోనే మనకు కనిపిస్తారు. మానసికంగా తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి, వ్యక్తిగతంగా దృఢంగా మార్చుకోవడానికి ఆయన అయ్యప్ప స్వామి మాలను ధరిస్తానని గతంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ALSO READ:Minister Vakiti Srihari: యువతను క్రీడల వైపు మళ్లించడమే.. ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి

రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×