E-Paper
Advertisement

Best Printers 2026: మీ ఇంటికి కొత్త ప్రింటర్ కావాలా? ఈ టాప్ 5 మోడల్స్ చూడాల్సిందే!

Best Printers 2026: మీ ఇంటికి కొత్త ప్రింటర్ కావాలా? ఈ టాప్ 5 మోడల్స్ చూడాల్సిందే!
Advertisement

Best Printers 2026: ఒకప్పుడు ప్రింటర్లు కేవలం ఆఫీసులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థుల అసైన్ మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్, స్టడీ మెటీరియల్స్ ప్రింట్ కోసం ప్రింటర్ల అవసరం పెరిగిపోయింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఆఫీసు డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకోవడానికి కూడా ఇవి తప్పనిసరిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంటి అవసరాల కోసం మార్కెట్లో లభించే టాప్ 5 హై-క్వాలిటీ ప్రింటర్ల వివరాలు, వాటి ప్రధాన ఫీచర్లు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

HP OfficeJet Pro 9135e

మార్కెట్లోని అత్యుత్తమ ప్రింటర్స్ లో ఇదీ ఒకటి. ఇది చాలా వేగంగా ప్రింట్ చేస్తుంది. డ్యూయల్ పాస్ స్కానింగ్ ఫీచర్‌ను సైతం కలిగి ఉంది. దీనిలో ఫోటోలు, డాక్యుమెంట్లు రెండూ చాలా స్పష్టంగా వస్తాయి. HP+ సబ్‌స్క్రిప్షన్‌తో ఇంక్ మేనేజ్మెంట్ మరింత సులభతరం కానుంది. దీని ధర రూ.66,199గా ఉంది.

Epson EcoTank ET-8550

Advertisement

ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రింటర్ ఒక వరమని చెప్పవచ్చు. ఇది కార్ట్రిడ్జ్ రహిత (Cartridge-free) ప్రింటర్. బాటిల్స్ ద్వారా ఇంక్ నింపుకోవచ్చు. దీనిలోని 6 కలర్ ఇంక్ సిస్టమ్ వల్ల రంగులు చాలా సహజంగా, అద్భుతమైన క్వాలిటీతో వస్తాయి. ఇది రూ.84,000 నుంచి రూ.1.25 లక్షల మధ్య అందుబాటులో ఉంది.

Canon PIXMA TR8620a

ఇంట్లో అందరికీ ఉపయోగపడేలా ఆల్ వన్ ప్రింటర్ ను కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇది కాంపాక్ట్ డిజైన్ తో రూపొందింది. కాబట్టి ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు. దీనికి వైఫై కనెక్టివిటీ సైతం అందించారు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ద్వారానే నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. దీని ధర రూ.19,000 నుంచి రూ.48,000 మధ్య పలుకుతోంది.

Brother MFC-L2820DW

Advertisement

మీకు కేవలం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లు మాత్రమే కావాలని భావిస్తే ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది లేజర్ ప్రింటర్.. కాబట్టి ఇంక్ ఆరిపోయే సమస్య ఉండదు. ఆటోమేటిక్ డ్యూప్లెక్స్ (రెండు వైపులా) ప్రింటింగ్ ఫీచర్ వల్ల పేపర్లు ఆదా అవుతాయి. ఆఫీస్ వర్క్ కోసం ఇది పర్ఫెక్ట్ గా నిలుస్తుంది. ఇది రూ. 57,990 నుంచి రూ.64,980 మధ్య సేల్ అవుతోంది.

Also Read: Air Conditioner: నీటి తుంపర్ల చిట్కా.. సగానికే పవర్ బిల్లు.. ఏసీ యూజర్లకు పండుగే!

HP Envy 6055e

బడ్జెట్ ధరలో మంచి క్వాలిటీ ప్రింటర్ కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. పిల్లల స్కూల్ ప్రాజెక్టులకు, అప్పుడప్పుడు తీసుకునే ఫోటో ప్రింట్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తక్కువ బడ్జెట్ లో లభించే నాణ్యమైన ప్రింటర్. ఇది మార్కెట్లో రూ.12,900కి లభిస్తోంది.

Also Read: బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×