E-Paper
Advertisement

కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం.. ఆనాడు ఇందిరాగాంధీ మాట మరిచారా? అంటూ ప్రశ్నలు

కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం.. ఆనాడు ఇందిరాగాంధీ మాట మరిచారా? అంటూ ప్రశ్నలు
Advertisement

Hyderabad: ప్రధాని నరేంద్రమోదీ బంగారం కొనుగోలు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు. మెట్రో, ప్రజా రవాణా, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు ఊపయోగించాలని ప్రధాని సూచించారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం

Advertisement

మంగళవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన, సంక్షోభ సమయాల్లో ఆనాటి ప్రధానులుగా నెహ్రు, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలకు సూచనలు చేశారని గుర్తు చేశారు. 1967లో బంగారం కొనుగోలు చేయవద్దని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చెప్పారని గుర్తు చేశారు.

ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడారారని గుర్తు చేశారు. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగినా భారత్‌లో ఒక్క పైసా పెరగలేదన్నారు. ఆదివారం హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు ఆపాలని విజ్ఞప్తి చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

Advertisement

ఆనాడు ఇందిరాగాంధీ మాట మరిచారా? అంటూ ప్రశ్నలు

ఈ క్రమంలో 1967లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశ ప్రజలకు ఇలాంటి పిలుపు ఇచ్చారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆనాటి ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియా గిరగిరా తిరుగేస్తోంది. ఈ వార్త పూర్తిగా నకిలీదని ఆంగ్ల దినపత్రిక ది హిందూ ఇప్పటికే స్పష్టం చేసింది.  1967 ఏడాది జూన్ 6న ది హిందూ పత్రిక పేరిట ఓ డిజిటల్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బంగారం కొనుగోలు చేయవద్దని ఆనాటి ప్రధాని ఇందిర ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు ఉంది. దీనిపై ది హిందూ పత్రిక యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మా పత్రికకు సంబంధించిన పేజీ కాదని, దాన్ని డిజిటల్‌గా మార్పులు చేశారని పేర్కొంది. ఇలాంటివి షేర్ చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని సూచన చేసింది.

ALSO READ: మౌనం వీడండి.. విద్యార్థులను కాపాడండి.. కేంద్రానికి కిరణ్ రెడ్డి పిలుపు

ప్రధాని మోదీ వ్యాఖ్యలను సమర్థించేందుకు కొందరు బీజేపీ అభిమానులు నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ దీనిపై మాట్లాడారు. 1967లో ఇందిరా గాంధీ బంగారం కొనొద్దని చెబితే జాతీయ క్రమశిక్షణ అని, 2013లో చిదంబరం చెప్పారని, ఆర్థిక బాధ్యత అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు ప్రధాని చెబితే విమర్శించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×