E-Paper
Advertisement

Smartwatches Under 1000: యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. వెయ్యి లోపు ఖతర్నాక్ ఫీచర్లతో టాప్ మోడల్స్

Smartwatches Under 1000: యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. వెయ్యి లోపు ఖతర్నాక్ ఫీచర్లతో టాప్ మోడల్స్
Advertisement

Smartwatches Under 1000: ఒకప్పుడు స్మార్ట్‌వాచ్ అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. స్మార్ట్‌వాచ్ కూడా ఉండాల్సిందే అన్నది నేటి యూత్ ట్రెండ్. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, ఆఫీస్‌లకు వెళ్లే వారు ట్రెండీ లుక్ కోసం బడ్జెట్‌లోనే దొరికే స్మార్ట్‌వాచ్‌లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం రూ. వెయ్యిలోపు అదిరిపోయే ఫీచర్లతో.. మార్కెట్లో ఉన్న టాప్ 5 వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. beatXP Vector Smartwatch(Rs.799):
తక్కువ ధరలో ‘ప్రీమియం లుక్’ కావాలనుకునే వారికి beatXP వెక్టర్ ఒక మంచి ఆప్షన్. దీని డిజైన్ చాలా క్లాసీగా ఉంటుంది. ఇందులో లార్జ్ డిస్‌ప్లేతో పాటు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. అంటే మీరు ఫోన్ తీయకుండానే వాచ్ నుంచే మాట్లాడొచ్చు. హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

2. Noise ColorFit Pulse 2 Max(Rs.850):
నాయిస్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇది రారాజు. Pulse 2 Max మోడల్ పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. దీని బ్రైట్‌ నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టే యువతకు ఇది బెస్ట్ ఛాయిస్.

3. Fire-Boltt Assault Smartwatch(Rs.989):
రఫ్ అండ్ టఫ్ లుక్ ఇష్టపడే వారి కోసం ఫైర్-బోల్ట్ అసాల్ట్ రూపొందించారు. ఇది చూడటానికి చాలా స్ట్రాంగ్‌గా, స్పోర్టీగా ఉంటుంది. ఇందులో ఇన్-బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి. అంతే కాకుండా ఖాళీ టైమ్‌లో బోర్ కొట్టకుండా ఉండటానికి ఇది బాగుంటుంది. కాలింగ్ ఫీచర్ , మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

4. Vaku Luxos T800 Ultra(Rs.749):
మీకు ఆపిల్ వాచ్ అల్ట్రా లాంటి డిజైన్ కావాలా? అయితే మీ కోసమే ఈ Vaku Luxos T800 Ultra. ఈ వాచ్ చూడటానికి చాలా ఖరీదైన వాచ్‌లా కనిపిస్తుంది. దీని బిగ్ స్క్రీన్ , ఆరెంజ్ స్ట్రాప్ ఆకర్షణీయంగా ఉంటాయి. కేవలం స్టైల్ కోసమే కాకుండా.. బ్లూటూత్ కాలింగ్ కోసం కూడా దీనిని వాడుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Also Read: కూలర్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ 6 టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

5. PunnkFunnk NovoLux Smartwatch(Rs.949):
ఇది ఒక యునిక్ డిజైన్ ఉన్న వాచ్. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అంటే ప్రతిరోజూ మీ డ్రెస్‌కు తగ్గట్టుగా వాచ్ స్క్రీన్‌ను మార్చుకోవచ్చు. హార్ట్ రేట్.. SpO2 (ఆక్సిజన్ లెవెల్స్) మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

రూ. 1,000 లోపు ఈ స్మార్ట్‌వాచ్‌లు బ్రాండెడ్ వాచ్‌లతో పోటీ పడుతున్నాయి. అయితే.. ఒక విషయం గుర్తుంచుకోవాలి, వీటిలో వచ్చే హెల్త్ డేటా 100% ఖచ్చితంగా ఉండకపోవచ్చు, కానీ స్టైల్, నోటిఫికేషన్స్, బ్లూటూత్ కాలింగ్ కోసం ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మీ అవసరానికి తగ్గట్టుగా, మీకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకోండి మరి.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×