E-Paper
Advertisement

Team India: రైలు అప్పర్ బెర్త్‌లో దాక్కొని, దొంగ‌లాగా పారిపోయిన వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో

Team India: రైలు అప్పర్ బెర్త్‌లో దాక్కొని, దొంగ‌లాగా పారిపోయిన వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో
Advertisement

Team India: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా మార్చి 8వ తేదీన ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడవ సారి టైటిల్ అందుకుంది టీమిండియా. అయితే టీమిండియా టైటిల్ గెలిచిన ఆనందంలో క్రికెటర్ శివమ్‌ దూబే ( Shivam Dube ), సాధారణ పౌరుడి లాగా ఓ రైలులో ప్రయాణించాడు. తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. 2007 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో తొలిసారిగా టైటిల్ దక్కించుకున్న టీమిండియా, 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో టైటిల్ గెలుచుకుంది. ఇక ఈ 2026 టోర్నమెంట్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా కు దక్కింది. దీంతో భారత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ఇదే ఉత్సాహంతో టీమిండియా ఆల్రౌండర్ వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శివ‌మ్ దూబే చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. టైటిల్ గెలిచిన ఆనందంలో సాధారణ పౌరుడిలాగా తన కుటుంబంతో అహ్మదాబాద్ నుంచి ముంబై ప్రయాణించాడు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శివ‌మ్ దూబే.

మార్చి ఎనిమిదో తేదీన ఫైనల్ జరగగా, 9వ తేదీన ఉదయం ఫ్లైట్ టికెట్లు లభించలేదని తెలుస్తోంది. ఇక ఇంటికి వెళ్లాలన్న ఆత్రుతతో, అహ్మదాబాద్ నుంచి ముంబై కి ట్రైన్ లో వెళ్ళాడు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శివ‌మ్ దూబే. తన భార్యతో కలిసి, రైలులో థర్డ్ ఏసి కోచ్ లో ప్రయాణించాడు. అయితే ప్రయాణికులందరూ గుర్తుపడతారని, ముఖానికి మాస్క్ అలాగే క్యాప్ ధరించాడు. ముంబై చేరుకునే వరకు ట్రైన్ అప్ప‌ర్‌ బెర్త్ పైన ( upper berth of train) పడుకొని లేవలేదు. ఈ విషయాన్ని స్వయంగా వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శివ‌మ్ దూబే వెల్లడించారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది విన్న క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వరల్డ్ కప్ హీరో ఇలా ట్రైన్ అప్పర్ బెర్త్ లో దొంగలాగా ప్రయాణించడం గొప్ప విషయమని పేర్కొంటున్నారు. కాగా ఈ టోర్న‌మెంట్ లో శివ‌మ్ దూబే జ‌ట్టుకు కీల‌క స‌మ‌యంలో ప‌రుగులు సాధించి పెట్టాడు.

Advertisement

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×