E-Paper
Advertisement

Electric Pressure Cookers: ఈ ఒక్క స్మార్ట్ కుక్కర్ ఉంటే.. గ్యాస్ సిలిండర్‌తో పనిలేదు, టాప్ 5 మోడల్స్ ఇవే!

Electric Pressure Cookers: ఈ ఒక్క స్మార్ట్ కుక్కర్ ఉంటే.. గ్యాస్ సిలిండర్‌తో పనిలేదు, టాప్ 5 మోడల్స్ ఇవే!
Advertisement

Electric Pressure Cookers: ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి కిచెన్‌లోనే ఉండాలంటే ఎవరికైనా విసుగేస్తుంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, చిన్న పిల్లలున్న తల్లులకైతే వంట పని ఎంత త్వరగా ముగిస్తే అంత హాయిగా ఉంటుంది. అలాంటి వారికోసం ‘ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్’ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అసలే గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి. ఒకవేళ బుక్ చేసినా సకాలంలో రాక ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ ఒక్క ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే చాలు, గ్యాస్‌తో పని లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఇది టైమ్ సేవ్ చేయడమే కాదు, మనం వండే కూరల్లోని పోషకాలు పోకుండా రుచిని కూడా పెంచుతుంది. మీరు కూడా మీ వంట పనిని స్మార్ట్‌గా మార్చుకోవాలనుకుంటే, అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్ ఉన్న ఈ 5 ఆప్షన్లపై ఓ లుక్కేయండి.

1. Geek Robocook Zeta

Advertisement

ఈ గీక్ రోబోకుక్ జీటా మన కిచెన్‌లో ఉంటే మనకు ఒక పర్సనల్ షెఫ్ ఉన్నట్టే. ఎందుకంటే.. ఇది ఒక్కటి ఉంటే దాదాపు 11 రకాల పనులు చేసేస్తుంది. దీనిలో 13 రకాల ఇండియన్ మెనూ ఆప్షన్లు ఉన్నాయి. అన్నం, కూరలు, సాంబార్.. ఇలా ఏదైనా సరే జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు, అదే వండేస్తుంది. ఈ కుక్కర్ 6 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది కాబట్టి.. నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. స్టీల్ బాడీతో రావడంతో మన్నిక కూడా ఎక్కువే.

Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

2. Pigeon Electra Pro

Advertisement

బడ్జెట్ తక్కువలో ఉండి మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి పిజియన్ ఎలక్ట్రా ప్రో బెస్ట్ ఛాయిస్. దీనిలో ఏకంగా 18 రకాల వంటల ఆప్షన్లు ఇచ్చారు. ఇది 3 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి.. చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఫీచర్ ఉండటం వల్ల వంట అయిపోగానే అదే ఆగిపోతుంది. దీంతో ఎలాంటి భయం లేకుండా వేరే పనులు చూసుకోవచ్చు.

3. Agaro Imperial

మీది పెద్ద ఫ్యామిలీ అయితే 8 లీటర్ల కెపాసిటీ ఉన్న అగోరా ఇంపీరియల్ కుక్కర్‌ను కళ్లు మూసుకుని కొనేయొచ్చు. దీనిలో 14 రకాల వంటల ఫంక్షన్లు ఉన్నాయి. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే.. ఒకేసారి రెండు రకాల వంటలు చేసుకోవడానికి వీలుగా బాస్కెట్ సదుపాయం ఉంటుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండటం వల్ల వంట ఎంత వరకు వచ్చిందో కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు.

4. Usha iChef

మనందరికీ బాగా తెలిసిన నమ్మకమైన బ్రాండ్ ఉషా. ఈ సంస్థ నుండి వచ్చిన ఈ 6 లీటర్ల కుక్కర్‌లో 10 రకాల మెనూ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ‘కీప్ వార్మ్’ అనే అదిరిపోయే ఫీచర్ ఉండటం వలన వంట పూర్తయినా ఆహారం చాలా సేపటి వరకు వేడిగానే ఉంటుంది. అలాగే డిలే టైమర్ ఆప్షన్ ఉండటం వల్ల మనకు కావాల్సిన టైమ్‌కి వంట అయ్యేలా ముందుగానే సెట్ చేసుకోవచ్చు.

5. Morphy Richards WizPot

చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండే మార్ఫీ రిచర్డ్స్ విజ్‌పాట్.. వంటను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఇది దాదాపు 70 శాతం వరకు వంట సమయాన్ని తగ్గిస్తుందట. ఈ కుక్కర్‌లో 14 రకాల ఇండియన్ వంటల మెనూలు ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, సేఫ్టీ లాక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం వల్ల బిజీగా ఉండే వారికి ఇది బాగా ఉపయోగకరం.

Also Read: ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్.. మహిళలకు BSNL ‘కవచ్’ భరోసా!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×