E-Paper
Advertisement

BSNL Mahila Kavach: ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్.. మహిళలకు BSNL ‘కవచ్’ భరోసా!

BSNL Mahila Kavach: ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్.. మహిళలకు BSNL ‘కవచ్’ భరోసా!
Advertisement

BSNL Mahila Kavach: ప్రస్తుత రోజుల్లో సైబర్ వేధింపులు, అపరిచితుల నుంచి వచ్చే అవాంఛిత కాల్స్ మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా బయట మొబైల్ షాపుల్లో రీఛార్జ్ చేయించుకునేటప్పుడు తమ వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను రిటైలర్లకు చెప్పాల్సి రావడం వల్ల ఆ నెంబర్ దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, మహిళా వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు ‘కవచ్’ అనే వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల స్త్రీలు తమ అసలు నెంబర్‌ను ఎవరికీ వెల్లడించకుండానే సురక్షితంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఇదెలా పని చేస్తుంది?

ఈ కవచ్ ఫీచర్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వినియోగదారుల గోప్యతను కాపాడటం. మహిళా సబ్‌స్క్రైబర్లు ఈ సదుపాయాన్ని వాడుకున్నప్పుడు, వారి అసలు నెంబర్‌కు బదులుగా ఒక తాత్కాలిక 10 అంకెల నంబర్ కేటాయించబడుతుంది. మనం బ్యాంకు లావాదేవీల కోసం ఉపయోగించే OTP లాగే ఈ నెంబర్ కూడా కొంత సమయం మాత్రమే పని చేస్తుంది. రీఛార్జ్ పూర్తి కాగానే ఆ నెంబర్ దానంతట అదే రద్దవుతుంది. కాబట్టి.. దుకాణదారుల వద్ద లేదా వారి రికార్డుల్లో స్త్రీల వ్యక్తిగత నెంబర్లు నిక్షిప్తమయ్యే ప్రమాదం ఉండదు. ప్రతిసారి కొత్తగా రీఛార్జ్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ తాత్కాలిక నెంబర్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!

యాక్టివేషన్ ప్రక్రియ సులభం..

ఈ భద్రతా ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడం చాలా ఈజీ. BSNL మహిళా వినియోగదారులు తమ ఫోన్ డయలర్ నుంచి 1500 లేదా 1800 180 1503 నంబర్‌కు కాల్ చేయాలి. కాల్ కలిసిన తర్వాత కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడటానికి 9 నొక్కాల్సి ఉంటుంది. కవచ్ ఫీచర్‌ను ప్రారంభించమని కోరగానే, వారు సూచించే ప్రక్రియ ద్వారా మీ మొబైల్‌కు ఒక SMS వస్తుంది. అందులో ఉండే 10 అంకెల తాత్కాలిక నంబర్‌ను రిటైల్ స్టోర్‌లో ఇస్తే సరిపోతుంది. సాంకేతికతపై అవగాహన ఉన్నవారు నేరుగా BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

గ్రామీణ మహిళలకు భరోసా..

Advertisement

చాలామంది ఆన్‌లైన్ ద్వారానే రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ, మారుమూల గ్రామాలు లేదా చిన్న పట్టణాల్లో ఇప్పటికీ చాలామంది స్త్రీలు బయట షాపులపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉన్నచోట, డిజిటల్ చెల్లింపుల గురించి అవగాహన లేని వారికి ఈ కవచ్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేస్తూ BSNL తీసుకొచ్చిన ఈ మార్పు మహిళా లోకానికి నిజంగా రక్షణ కవచంలా మారుతుందని చెప్పవచ్చు.

Also Read: ఒక్కసారిగా పడిపోయిన ప్రీమియం ఫ్రిడ్జ్‌ల ధరలు.. ఏకంగా రూ.43,000కి పైగా డిస్కౌంట్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×