Arunachalam: ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకుంటోంది దక్షిణ మధ్య రైల్వే. భాగ్యనగరం నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పేసింది. భాగ్యనగరం నుంచి అరుణాచలం వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సర్వీసుల వల్ల గిరి ప్రదక్షిణ కోసం తరలి వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుంది.
భక్తులకు తప్పిన తిప్పలు, దక్షిణ మధ్య రైల్వే కొత్త నిర్ణయం
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు మంచి కబురు వచ్చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన చర్లపల్లి నుంచి అరుణాచలం మీదుగా వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. కొత్త సర్వీసుల వల్ల గిరి ప్రదక్షిణ కోసం ప్రతి నెలా పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్లే లక్షలాది మంది భక్తులకు ప్రయాణం చేయవచ్చు.
గతంలో తిరుపతి లేకుంటే చెన్నై మీదుగా అరుణాచలం వెళ్లేవారు భక్తులు. లేకుంటే బస్సుల్లో వెళ్లేవారు. దానివల్ల సమయం, డబ్బు వృథా అయ్యేవి. గతంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి అరుణాచలానికి వెళ్లే రైళ్లు అందుబాటులో ఉండేవి కావు. భక్తులు తొలి తిరుపతి మీదుగా అరుణాచలం వెళ్లాల్సి వచ్చేది.
చర్లపల్లి నుంచి నేరుగా అరుణాచలానికి రైళ్లు
చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ప్రైవేట్ బస్సులు, పాసింజర్ల ద్వారా అక్కడికి వెళ్లేవారు. పాత కనెక్టింగ్ మార్గాల వల్ల భక్తులకు డబ్బుతోపాటు సమయం వృథా అయ్యేది. కాచిగూడ-మధురై, కాచిగూడ-నాగర్‌కోయిల్ కొన్ని వీక్లీ, ప్రత్యేక రైళ్లు ఉండేవి. ఫలితంగా పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణల సమయంలో రద్దీ ఏర్పడింది. కనీసం భక్తులకు కన్ఫార్మ్ టికెట్లు దొరకడం కష్టంగా మారింది.
దీన్ని గమనించిన దక్షిణ మధ్య రైల్వే.. చర్లపల్లి స్టేషన్ నుంచి కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అరుణాచలం మీదుగా డైవర్ట్ చేసింది. ఈ రైళ్ల వల్ల భక్తులు తిరుపతి, అరుణాచలం , శ్రీరంగం వంటి ముక్కోటి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభించింది.
ALSO READ: రైల్వే ఫుడ్ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!
చర్లపల్లి నుంచి కేవలం 15 గంటల్లో అరుణాచలం చేరుకోవచ్చు. కొత్త సర్వీసుల వల్ల సికింద్రాబాద్, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించే వీలు కలగడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గం నుంచి మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.