Best Office Apps: ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆఫీస్ పనులను, వ్యక్తిగత బాధ్యతలను బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సామే. ప్రాజెక్ట్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లు, రోజువారీ పనుల లిస్ట్‌లు… ఇలా అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం మానవ మాత్రులకి కాస్త కష్టమే. అందుకే టెక్నాలజీని స్మార్ట్‌గా వాడుకుంటే మన పని మరింత సులువవుతుంది. ఆఫీస్ వర్క్‌ని సులభతరం చేసి మీ పనితీరును ఎఫెక్టివ్ గా మార్చే 5 అద్భుతమైన ఫ్రీ మొబైల్ యాప్స్ గురించి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.
రోజువారీ పనులను పక్కా ప్రణాళికతో ఫినిష్ చేయాలనే వారికి ‘Todoist’ యాప్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో మీరు చేయాల్సిన పనులను (To-do lists) తేదీలు, సమయాలతో సహా నోట్ చేసుకోవచ్చు. ఏ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఆఫీస్ టాస్క్‌లను, పర్సనల్ టాస్క్‌లను వేర్వేరుగా విభజించుకోవడానికి కూడా ఈ యాప్ వీలు కల్పిస్తుంది.
నోట్స్ రాసుకోవడం, డాక్యుమెంట్లు దాచుకోవడం, ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడం.. ఇలా అన్నింటికీ వేర్వేరు యాప్స్ వాడాల్సిన పనిలేకుండా ‘Notion’ ఒక్కటే అన్ని పనులూ చేసేస్తుంది. ఇందులో ఉండే వందలాది ఫ్రీ టెంప్లేట్స్ సాయంతో మీ వర్క్ ప్రొఫైల్‌ను అందంగా డిజైన్ చేసుకోవచ్చు. మీ టీమ్ మెంబర్స్‌తో కలిసి రియల్ టైమ్‌లో డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి ఇది అద్భుతంగా పనికి వస్తుంది.
ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా మంచి ఐడియా వస్తే దాన్ని వెంటనే నోట్ చేసుకోవడానికి ‘గూగుల్ కీప్’ ఉపయోగపడుతుంది. ఇందులో కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా.. వాయిస్ నోట్స్, ఫోటోలు, చేతితో రాసిన నోట్స్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండటం వల్ల మొబైల్‌లో రాసిన నోట్స్‌ను సిస్టమ్‌లో కూడా వెంటనే యాక్సెస్ చేయవచ్చు.
ఆఫీసులో ఒక టీమ్‌గా కలిసి పనిచేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ‘ట్రెల్లో’ యాప్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. చేయాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న వర్క్స్’ పూర్తయిన పనులు ఇలా కాలమ్స్ పెట్టుకుని, టాస్క్‌లను ఒకదాని నుంచి ఇంకొకదానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. దీనివల్ల ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
Also Read: ఫ్రెండ్‌లా నమ్మించాడు.. సైకోలా చంపేశాడు.. 4 నెలల్లో 8 మందిని లేపేసిన కిల్లర్!
ఆఫీస్‌లో విండోస్ లాప్‌టాప్ ఎక్కువగా వాడుతుంటే.. ఈ యాప్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ యాప్ సేవలను ఫ్రీగా పొందొచ్చు. ఎలాంటి యాడ్స్ కూడా ఇందులో రావు. దీనిలోని ‘My Day’ ఫీచర్ ప్రతిరోజూ ఉదయం మీరు ఏ పనులపై దృష్టి పెట్టాలో ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఔట్‌లుక్ ఈమెయిల్స్‌ను నేరుగా టాస్క్‌లుగా మార్చుకునే సదుపాయం ఇందులో ఉంది.
Also Read: రూ.18 వేలలో ఈ రేంజ్ ఫీచర్లా? ఇవి కదా మిడిల్ క్లాస్ మెచ్చే.. పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్లు!