E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
Advertisement

National Award: గేమ్ చేంజర్ దెబ్బకి గింగిరాలు తిరిగిపోయాడు చరణ్. ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకేం ఉప్పెన తో వంద కోట్ల క్లబ్ లో కూర్చున్న బుచ్చిబాబు ఆశగా రావడంతో గట్టిగ పట్టేసుకున్నాడు.300 కోట్ల బడ్జెట్ తో వృద్ది సినిమాస్ రెడీ.ఇక బాలీవుడ్ నుండి జాన్వీ, కోలీవుడ్ నుండి రెహమాన్, కన్నడ నుండి శివ రాజ్ కుమార్ ..ఇలా సాలిడ్ గా అన్ని రకాల అస్ర్త శస్త్రాలతో పెద్ది అంటూ పట్టాలెక్కించాడు.బాడీ నుండి జుట్టు వరకు బుచ్చి అడిగిందల్లా కాదనకుండా పెంచేశాడు.అంతా బాగానే ఉంది.

దుమారం రేపిన జాన్వీ అందాల ఆరబోత 

ఇక సినిమా మార్చ్ 26 న వస్తానని ఊరించి ఊరించి చివరికి జూన్4న ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే సినిమా మిక్స్డ్ టాక్ ట్యాగ్ వేసుకుంది.అలా సినిమా కాస్త కాసులు చూడటం మొదలైందో లేదో జాన్వీ అందాల ఆరబోతపై పెద్ద దుమారమే రేగింది.సినిమాలో తనకు ఇష్టం లేకుండానే సీన్స్ చేశానని జాన్వీ పెట్టిన(అనుకుంటున్న) పోస్ట్ వైరల్ అవడంతో బుచ్చి బాబు పై దండ యాత్ర మొదలెట్టారంతా.
బాలీవుడ్ నుండి మల్లూ వుడ్ వరకు అలా ఎలా ఫోర్స్ చేస్తారంటూ మూకుమ్మడిగా ఎకిపారేశారు.ఫలితంగా సీన్స్ లేపెస్తున్నా బాబోయ్ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు బుచ్చి.

నేషనల్ అవార్డ్ అసలు మ్యాటరే కాదు

Advertisement

ఇక అంతా సద్దుమణిగింది ..సినిమా కాస్త తడబడినా బాక్సాఫీస్ వద్ద 400కోట్లు దాటేసింది( నిజమో కాదో మేకర్స్ కే తెలియాలి)అని అనుకుంటున్న ఈ సమయంలో మరో వివాదాన్ని మెడకి చుట్టుకుంది.కాదు కాదు చుట్టేశాడు చిరు. అవును..పెద్ది విజయోత్సవ వేడుకల సందర్భంగా చిరు వదిలిన మాటలు నెట్టింట్లో ,మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ లో మంటలు పుట్టిస్తున్నాయి. నేషనల్ అవార్డ్ గురించి మాట్లాడుతూ నేషనల్ అవార్డు అసలు మ్యాటరే కాదని , అది రావడం కోసం ఎన్నో దారులు ఉన్నాయి అని అనడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారు బన్నీ ఫ్యాన్స్.

also read :బన్నీ-లోకేశ్ కాంబో.. షూటింగ్ మొదలవ్వకుండానే పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ అప్‌డేట్!

Advertisement

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు(పుష్ప సినిమాకి గాను) కొట్టిన ఒకే ఒక స్టార్ అల్లు అర్జున్.దీంతో అల్లు అర్జున్ దొడ్డిదారిన అవార్డు తెచ్చుకున్నాడా అని ఫైర్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. నిజానికి చిరు బన్నీని ఉద్దేశించి అనకపోయినా గత కొంత కాలంగా అల్లు ,మెగా కుటుంబాల పెరిగిన దూరం కారణంగా బన్నీ ఫ్యాన్స్ వాటిని ఓన్ చేసుకుంటు హర్ట్ అవుతున్న పరిస్థితి.

ఎట్టకేలకి జాతీయ అవార్డ్ సాధించిన బన్నీ

వాస్తవానికి పెద్ది సినిమాలో చరణ్ చూపిన ప్రతిభ కి నేషనల్ అవార్డ్ ఇవ్వాల్సిందే అంటూ నెటిజన్లు సపోర్ట్ గట్టిగానే చేశారు. పైగా ఆ అవార్డ్ ప్రకటించాలంటే ఇంకా నాలుగు నెలలు గడవాలి. అలాంటిది ఈ లోపే చిరు ఇలా దొడ్డి దారులు అనే పదం ఆ సమయంలో వాడకపోయి ఉంటె బాగుండేదేమో. చిరు ఎలాంటి మీనింగ్ తో అన్నా బన్నీ ఒక్కడే ఈ అవార్డ్ అందుకోవడంతో విమర్శల వర్షంలో చిరు తడవాల్సిన పరిస్థితి.నిజానికి చిరు మనసులో అలాంటి నెగెటివిటీనే ఉంటె ఈ పాటికి అదే దొడ్డి దారుల్లో ఎన్నోఅవార్డులు మన టాలీవుడ్ గుమ్మం ముందు ఉండేవి.అయితే ఎన్నో ఏళ్లుగా పాటల్లో, మాటల్లో తీతల్లో జాతీయ అవార్డు కొల్లగొట్టిన టాలీవుడ్ కి నటనలో అవార్డ్ రావడానికి ఇన్నేళ్ళు పట్టడం గమనార్హం.

also read :రోజు గడిచాక బర్త్‌డే విషెస్.. అసలు కథేంటి? వైరల్ అవుతున్న త్రిష లేటెస్ట్ పోస్ట్!

చూడాలి మరి చిరు అన్న ఆ మాటల్ని అర్థం చేసుకొని బన్నీ ఫ్యాన్స్ ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెడతారా లేక ఇది కామా మాత్రమే అంటూ మెగా, అల్లు కుటుంబాల మధ్య పెరిగిన సెంటిమీటర్ దూరాన్ని కిలోమీటర్ చేస్తారా అనేది వాళ్ళ రియాక్షన్స్ పై ఆధారపడి ఉంది.

Related News

వెండితెరపై ‘మీర్జాపూర్’ రచ్చ.. థియేటర్లలోకి కల్ట్ ఫ్రాంచైజీ!

‘తలైవర్ 173’ డైరెక్టర్స్ మారడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!

“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!

మహేష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. షూటింగ్ బ్రేక్..?

Dharman Poster: డాక్టర్ అవతారంలో సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీకాంత్!

మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో జయం రవి.. పనిమనుషుల బంధించి..

Big Stories

×