E-Paper
Advertisement

స్మార్ట్ కిచెన్ కోసం టాప్ 5 మిక్సీ గ్రైండర్లు.. వంట పని ఇక నిమిషాల్లో క్లోజ్!

స్మార్ట్ కిచెన్ కోసం టాప్ 5 మిక్సీ గ్రైండర్లు.. వంట పని ఇక నిమిషాల్లో క్లోజ్!
Advertisement

Best Mixer Grinders in India: ఈ రోజుల్లో వంటింట్లో గంటల తరబడి కేటాయించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. మార్నింగ్ హడావుడిలో టిఫిన్ కోసం పిండి రుబ్బాలన్నా, గట్టి మసాలాలు నూరాలన్నా మంచి మిక్సర్ గ్రైండర్ ఉండాల్సిందే. కిచెన్‌లో మన టైమ్ సేవ్ చేస్తూ, వివిధ పదార్థాలను సెకన్లలో ఫైన్ పేస్ట్‌గా, పౌడర్‌గా మార్చే టాప్ 5 మిక్సీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ బడ్జెట్ , అవసరాలకు సరిపోయే పర్‌ఫెక్ట్ మిక్సీని ఎంచుకుని మీ డెయిలీ కుకింగ్‌ను మరింత ఈజీ, స్మార్ట్‌గా మార్చేసుకోండి.

పర్‌ఫెక్ట్ మిక్సీలు :

1. Sujata Dynamix 900W:

ఇండియన్ కిచెన్స్‌లో ఇది ఒక ఆల్‌టైమ్ లెజెండ్! 90 నిమిషాల పాటు ఆగకుండా పనిచేసే కెపాసిటీ దీని సొంతం. గట్టి కొబ్బరి తురుము, పసుపు కొమ్ములు లేదా ఇడ్లీ పిండి.. ఏదైనా సరే సెకన్లలో స్మూత్‌గా గ్రైండ్ చేసేస్తుంది. 22,000 RPM స్పీడ్ మోటార్, డబుల్ బాల్ బేరింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. తరచూ మిక్సీలు వాడే వారికి , పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.  రూ. 5,500 నుంచి రూ. 6,200 వరకు దీని ధర ఉంటుంది.

2.Bosch TrueMixx Pro 1000W:

Advertisement

పాతకాలపు రోకటి బండ రుచిని మిక్సీలో పొందాలనుకుంటే బోష్ బెస్ట్ ఛాయిస్. దీనిలోని ‘Stone Pounding Technology’ మసాలాలను మరీ పిండిలా కాకుండా సాంప్రదాయ రీతిలో కచ్చాపచ్చాగా దంచి, అసలైన రుచిని, సువాసనను కాపాడుతుంది. 1000 Watts పవర్‌ఫుల్ హై-టార్క్ మోటార్, ఆక్టివ్ ఫ్లో బ్రేకర్ జార్లు దీని ప్రత్యేకతలు. అంతే కాకుండా .. నాటు కోడి కూరలు, గ్రేవీల్లో అథెంటిక్ ఇండియన్ స్పైస్ టేస్ట్ కోరుకునే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి. రూ. 6,500 నుంచి రూ. 7,500 వరకు దీని ధర ఉంటుంది.

3.Preethi Zodiac MG-218 750W:

మల్టీ టాస్కింగ్ కింగ్ అంటే ప్రీతి జోడియాక్! ఇది కేవలం మిక్సీ మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసర్‌గా కూడా పని చేస్తుంది. చపాతీ పిండి కలపడం, కూరగాయలు స్లైస్ చేయడం, జ్యూస్ తీయడం వంటివన్నీ నిమిషాల్లో అయిపోతాయి. 5 జార్లు (3 స్టెయిన్‌లెస్ స్టీల్ + Master Chef Jar + 3-in-1 జ్యూసర్) దీని ప్రత్యేకతలు. ఒకే మెషిన్‌తో ఆల్ ఇన్ వన్ కిచెన్ వర్క్ పూర్తిచేయాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర కూడా రూ. 7,800 నుంచి రూ. 8,800 వరకు ఉంటుంది.

4.Philips HL7756/01 750W:

Advertisement

లుకింగ్‌లో క్లాస్, పర్ఫార్మెన్స్‌లో మాస్! కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే ఈ మిక్సీలో లేటెస్ట్ ‘ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్’ ఉంటుంది. దీని వల్ల ఎంతసేపు వాడినా మోటార్ ఓవర్ హీట్ అవ్వదు. టర్బో మోటార్, లీక్ ప్రో ప్రూఫ్ గాస్కెట్ జార్లు దీని ప్రత్యేకతలు. చిన్న, మీడియం సైజ్ ఫ్యామిలీలకు, డైలీ చట్నీలు, గ్రేవీలు చేసుకునే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి. దీని ధర రూ. 3,600 నుంచి రూ. 4,200 వరకు ఉంటుంది.

Also Read: రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

5.Atomberg Zenova 550W BLDC:

లేటెస్ట్ స్మార్ట్ టెక్నాలజీ ఫ్రెండ్లీ మిక్సీ ఇది! సాధారణ మిక్సీల కంటే తక్కువ కరెంట్ వాడుకునే BLDC మోటార్‌తో ఇది పనిచేస్తుంది. తక్కువ శబ్దంతో, ఎక్కువ పవర్‌తో పని చేయడం దీని ప్రత్యేకత. జార్ లాక్ సేఫ్టీ, స్మార్ట్ ఎల్ఈడీ నాబ్, తక్కువ కరెంట్ వాడకం దీని ప్రత్యేకతలు. కరెంట్ బిల్లు ఆదా చేస్తూ, సైలెంట్‌గా పని చేసే మోడ్రన్ గ్యాడ్జెట్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి. దీని ధర రూ. 5,800 నుంచి రూ. 6,800 వరకు ఉంటుంది.

మీ ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య, మీ వంటల అలవాట్లను బట్టి సరైన మిక్సీని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ రుబ్బుడు పనులు ఉంటే Sujata లేదా Bosch, ఆల్ ఇన్ వన్ ఫీచర్లు కావాలంటే Preethi Zodiac బెస్ట్. ఈ మోడల్స్‌తో మీ వంటపనిని వేగంగా మార్చేసి స్మార్ట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి.

Tags

Related News

సింగిల్ ఛార్జ్‌తో 2.5 రోజులు బ్యాకప్ ఇచ్చే OnePlus N6x.. ధర ఎంత ఉండొచ్చంటే?

నోకియా లుమియా డిజైన్‌తో AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

గూగుల్ పిక్సెల్ వాచ్ 5 లీక్.. భారీ RAM, అధునాతన AI ఫీచర్లతో రాబోతున్న కొత్త స్మార్ట్‌వాచ్!

ఈ ఆదివారం యమా స్పీడుగా తిరగనున్న భూమి.. తగ్గిపోనున్న రోజు, ఎంతంటే?

4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?

BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?

ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!

Big Stories

Advertisement
×