E-Paper
Advertisement

మోటో లవర్స్‌కు పండగే.. బడ్జెట్ To లగ్జరీ.. 2026 బెస్ట్ మోటోరోలా ఫోన్లు!

మోటో లవర్స్‌కు పండగే.. బడ్జెట్ To లగ్జరీ.. 2026 బెస్ట్ మోటోరోలా ఫోన్లు!
Advertisement

Motorola Phones 2026: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన బ్రాండ్స్ లో మోటోరోలా ఒకటి. క్లీన్ ఆండ్రాయిడ్, ప్రీమియం డిజైన్, మన్నికైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఈ కంపెనీ ఫోన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మోటోరోలా నుంచి రూ.16 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ అన్ని వర్గాలను కవర్ చేస్తూ మెుబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ – 5 స్మార్ట్ ఫోన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

మోటోరోలా G37 పవర్

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారి కోసం ఈ ఫోన్ ((Motorola G37 Power) బెస్ట్ ఛాయిస్. కేవలం రూ. 15,999 ధరకే లభిస్తున్న ఈ మోడల్‌లో ఏకంగా 7000mAh బ్యాటరీని అందించారు. కాబట్టి రోజంతా హెవీగా వాడినా ఛార్జింగ్ అయిపోదనే భరోసా ఈ ఫోన్ ఇస్తుంది. మరోవైపు రోజువారీ పనులు, సోషల్ మీడియా బ్రౌజింగ్, సాధారణ గేమింగ్‌కు సైతం ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలనుకునే మిడిల్ క్లాస్ యూజర్లకు ఇది పర్ఫెక్ట్ డివైజ్ అని చెప్పవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 70

Advertisement

రూ. 29,999 ప్రైస్ ట్యాగ్‌తో లభిస్తున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70’ (Motorola Edge 70) మిడ్-రేంజ్ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. స్టైలిష్ అల్ట్రా స్లిమ్ డిజైన్, సరికొత్త ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్.. గేమింగ్ ప్రియులను, మల్టీటాస్కింగ్ చేసేవారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 50 ఎంపీ కెమెరా సెటప్, అద్భుతమైన రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ స్క్రీన్ దీనికి అందించారు. 30 వేల బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ తరహా అనుభూతిని పొందాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో

అద్భుతమైన కెమెరా క్వాలిటీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro) అందుబాటులోకి వచ్చింది. రూ. 38,999 కి లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్, ప్రీమియం విభాగంలో గట్టి పోటీనిస్తోంది. అడ్వాన్స్‌డ్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, ఓఐఎస్ సపోర్ట్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రాత్రి వేళల్లో కూడా అద్భుతమైన ఫోటోలు తీయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకత. కంటెంట్ క్రియేటర్లకు, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.

మోటోరోలా సిగ్నేచర్

Advertisement

రూ. 60,000 బడ్జెట్‌లో అల్ట్రా-ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ‘మోటోరోలా సిగ్నేచర్’ (ధర రూ. 59,999) పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా వినూత్నంగా, లగ్జరీగా ఉంటుంది. అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్, అత్యుత్తమ స్క్రీన్, ఏఐ ఆధారిత ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు, బిజినెస్ క్లాస్ వ్యక్తులకు ఇది స్టేటస్ సింబల్ గా మారిపోతుంది.

Also Read: కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?

మోటోరోలా రేజర్ ఫోల్డ్

లగ్జరీతో పాటు అడ్వాన్స్డ్ సాంకేతికతను ఇష్టపడే వారికి మోటోరోలా రేజర్ ఫోల్డ్ (Motorola Razr Fold) సరిగ్గా సరిపోతుంది. రూ. 1,49,999 ధర కలిగిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. అల్ట్రా-ప్రీమియం విభాగంలో రారాజుగా నిలుస్తోంది. మడతపెట్టినప్పుడు జేబులో సులభంగా ఇమిడిపోయేలా, తెరిచినప్పుడు ట్యాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్ అనుభూతిని ఇది ఇస్తుంది. అధునాతన ఫోల్డింగ్ మెకానిజం, క్రీజ్ లెస్ డిస్ ప్లేతో ఈ ఏడాది బెస్ట్ ప్రీమియం ఫోన్లలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది.

Also Read: నీటితో నడిచే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి.. ఈ రైలు ప్రత్యేకతలు ఇవే

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×