E-Paper
Advertisement

2025 AI Phones: 2025లో లాంచ్ అయిన బెస్ట్ ఏఐ స్మార్ట్‌ఫోన్లు.. జాబితాలో టాపర్ ఎవరంటే

2025 AI Phones: 2025లో లాంచ్ అయిన బెస్ట్ ఏఐ స్మార్ట్‌ఫోన్లు.. జాబితాలో టాపర్ ఎవరంటే
Advertisement

2025 AI Phones| 2025 సంవత్సరం స్మార్ట్‌ఫోన్‌ రంగంలో AI పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఏఐ టెక్నాలజీ రాకతో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్‌లు మనుషులు రాసే కంటెంట్ స్వయంగా రాస్తున్నాయి, ఫోటోలు ఎడిట్ చేస్తున్నాయి, టాస్క్‌లు ఆర్గనైజ్ చేస్తున్నాయి. కేవలం వాయిస్ కమాండ్ చేస్తే చాలు ఏఐ ఫోన్లు అన్నీ టాస్కులు స్మార్ట్‌గా చేస్తాయి. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, ఇమేజ్ ఎడిటింగ్, స్మార్ట్ అసిస్టెంట్స్ లాంటివి ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే బిల్ట్-ఇన్‌గా వచ్చాయి. 2025లో వచ్చిన 5 బెస్ట్ AI ఫోన్‌లు చూద్దాం.

OnePlus 13s (రూ.63,999)

వన్‌ప్లస్ 13s ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చి ప్రాక్టికల్ AI ఫీచర్స్ తెచ్చింది. AI Plus Mind ఫోటోల నుంచి డీటెయిల్స్ తీసి క్యాలెండర్‌లో పెడుతుంది. AI VoiceScribe కాల్స్ రికార్డ్ చేసి సమ్మరీ ఇస్తుంది. Call Assistant రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ చేస్తుంది. ఫోటోలకి AI Reframe, AI Best Face 2.0 లాంటివి ఉన్నాయి. ఇందులో ఎడిటింగ్ చాలా సులువు.

Google Pixel 10 (రూ.69,500)

Advertisement

గూగుల్ పిక్సెల్ 10లో Gemini Nano AI ఆన్-డివైస్‌లోనే పని చేస్తుంది. మ్యాజిక్ క్యూ (Magic Cue) మెసేజ్‌లు, యాప్స్ నుంచి ముఖ్య సమాచారం ఆటోమాటిక్‌గా చూపిస్తుంది. ఇందులో ఉండే Pixel Journal రోజువారీ ప్లానింగ్ సజెస్ట్ చేస్తుంది. Camera Coach, Call Transcripts, కాంటెక్స్ట్ అవేర్ ఫోటో ఎడిట్స్ ఉన్నాయి. 2025లో అత్యంత స్మార్ట్ పిక్సెల్ ఫోన్ ఇదే.

Oppo Find X9 (రూ.74,999)

ఒప్పో ఫైండ్ X9లోని కలర్ OS 16లో ఎక్కువ AI ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లోని ఏఐ ప్రోట్రెయిట్ గ్లో, ఏఐ మైండ్ స్పేస్ ప్లానింగ్‌ కోసం, AI Summary, Writer ప్రొడక్టివిటీ కోసం ఉపయోగపడతాయి. AI LinkBoost నెట్‌వర్క్ స్టెబిలిటీ పెంచుతుంది. ఫోటోల్లో బ్లర్ తొలగించడం, లైటింగ్ మార్చడం, రిఫ్లెక్షన్స్ తీసేయడం లాంటివి ఉన్నాయి. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కూడా ఉన్నాయి.

iQOO 15 (రూ.72,999)

Advertisement

iQOO 15లో ఒరిజిన్ OS 6లో సర్‌ప్రైజింగ్ AI ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ ట్రాన్స్‌లేషన్, ఇంటెలిజెంట్ కాల్ హ్యాండ్లింగ్, స్లీప్ మోడ్ బ్యాటరీ ఆదా చేస్తుంది. ఏఐ రీటచ్, ఇమేజ్ ఎక్స్‌పాండర్, రిఫ్లేక్షన్ ఎరేజ్ లాంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి – చాలా సులువుగా పని చేస్తాయి.

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Samsung Galaxy S25 Ultra (రూ.1,08,999)

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో గెలాక్సీ AI మరింత యూనిఫైడ్‌గా ఉంది. AI Select సైడ్‌బార్ టెక్స్ట్ హైలైట్ చేసి రైటింగ్ అసిస్ట్ ఇస్తుంది. గ్యాలరీలో రిఫ్లెక్షన్స్ తొలగించడం, షాడోస్ ఫిక్స్ చేయడం, ఇమేజ్ ఎక్స్‌పాండ్ చేయడం, ఆబ్జెక్ట్స్ మూవ్ చేయడం లాంటివి చాలా సులువుగా జరుగుతాయి. 2025లో బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లలో ఇది ఒకటి.

ఈ ఫోన్‌లు అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీతో మన రోజువారీ పనులను చాలా సులువు చేస్తాయి. మీ బడ్జెట్, అవసరాలు బట్టి ఎంచుకోండి.

 

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×