E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరే?

Bigg Boss 9 Telugu Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరే?
Advertisement

Bigg Boss 9telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం 14 వ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరొక వారంలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. ఇక 14వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం ఫినాలేకి ఒక వారం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈవారం ఇద్దరు కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించబోతున్నారు. ప్రస్తుతం హౌస్ లో తనూజ, సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్ పడాల, ఇమ్మానుయేల్, డీమోన్ పవన్ మొత్తం ఏడుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు.

సుమన్ శెట్టి, భరణి ఎలిమినేషన్?

ఇక ఈ ఏడుగురిలో ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించగా మిగిలిన ఐదుగురిని ఫినాలేకీ పంపించబోతున్నారు. ఇక ఈ వారం సుమన్ శెట్టితో పాటు భరణి కూడా హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే భరణి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత సుమన్ శెట్టికి కూడా ఓట్లు తక్కువగా వచ్చిన నేపథ్యంలో వీరిద్దరూ ఈ వారం హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక సుమన్ శెట్టి మొదటి నుంచి కూడా ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈయన 14వ వారం హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.

కప్పు ఎవరి సొంతం?

Advertisement

ఇక టాప్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ మొదటి నుంచి కూడా తనుజ, ఇమ్మానియేల్, కళ్యాణ్ పడాల , సంజన, డీమోన్ పేర్లు వినపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా హౌస్ లో ఈ ఐదుగురు ఉండబోతున్నారని తెలుస్తుంది .మరి ఈ ఐదు మందిలో కప్పు ఎవరికి సొంతం అనేది తెలియాల్సి ఉంది. మొదటినుంచి కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ కార్యక్రమం చివరి వరకు విన్నర్ ఎవరు అనే విషయంపై స్పష్టత లేనివిధంగా ఎన్నో ట్విస్టులతో కొనసాగుతోంది.

గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు..

Advertisement

ఇక టాప్ ఫైవ్ లో ఉండబోయే కంటెస్టెంట్ లో కూడా ఒకరిని మించి మరొకరు ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వారే. మరి ఈసారి కప్పు ఎవరు అందుకోబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా ఎంతో కీలకంగా మారింది. అందరూ అనుకున్న విధంగానే డబుల్ ఎలిమినేషన్ తో సుమన్ శెట్టి భరణి ఇద్దరు హౌస్ నుంచి బయటకు వస్తారా లేకపోతే మరేదైనా ట్విస్ట్ ఉండబోతోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్రాండ్ ఫినాలే లో భాగంగా చీఫ్ గెస్ట్ గా ఎవరైనా స్టార్ హీరో రాబోతున్నారా? లేదంటే నాగార్జున విన్నర్ ను అనౌన్స్ చేస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Akhanda 2: అఖండ 2 లో శివుడి పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×