E-Paper
Advertisement

Puttaparthi: సీమకు ‘రక్షణ’..డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్

Puttaparthi: సీమకు ‘రక్షణ’..డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్
Advertisement

Puttaparthi: రాయలసీమకు ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు మంత్రి లోకేష్. ఆనాడు కార్లు పరిశ్రమ, ఇప్పుడు ఫైటర్ల జెట్లు తయారీ పరిశ్రమ వచ్చిందన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా విజన్‌ను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.

సీమకు ‘రక్షణ’- మంత్రి లోకేష్

Advertisement

పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఒకప్పుడు పుట్టపర్తిలో వంద ఇళ్లు లేవన్నారు. ఎన్డీయేను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని అన్నారు.

కరవు నేలపై కార్లు తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు అక్షరాల వ్యక్తి సీబీఎన్ కి దక్కుతుందన్నారు. ఇప్పుడు ఫైటర్ల జెట్లు తయారీ పరిశ్రమను తీసుకొచ్చారన్నారు. ప్రపంచానికి అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారిందన్నారు. 1991లో సత్య సాయిబాబా ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు.

Advertisement

డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్

దేశంలో నమో అంటే నరేంద్రమోదీ.. ఏపీలో నాయుడు-మోదీ జోడీ అని అన్నారు. మోదీ-రాజ్ నాథ్-చంద్రబాబు.. ఈ ముగ్గురూ 75 ఏళ్ల కుర్రాళ్లని, రెండున్నర దశాబ్దలుగా అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందన్నారు.

రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పుట్టపర్తి అంటే సత్యసాయిబాబా గుర్తుకు వచ్చేవారని తెలిపారు. తరాల తలరాత మార్చే సీఎం చంద్రబాబును చూసి ఇలాంటి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. ఇవాళ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు.

ALSO READ: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నే బురిడీ కొట్టించారు కిలాడీ జంట.. రూ. 81 లక్షలు స్వాహా..

రాయలసీమకు ఏఎంసీఏ ప్రాజెక్టు తీసుకొచ్చిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు సీమకు డ్రోన్ ప్రాజెక్టు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కర్నూలుకు డ్రోన్ల తయారీకి సంబంధించి ఆరు సంస్థలు రాబోతున్నట్లు వివరించారు. కేవలం తయారీ మాత్రమే కాదు, టెస్టింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టుల నుంచి వివిధ దేశాలకు విమానాలు నడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.  గతంతో పోల్చితే విమాన ప్రయాణికులు ఏపీ నుంచి పెరుగుతున్నారని గుర్తు చేశారు.

 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×