E-Paper
Advertisement

రూ.10వేల లోపు క్రేజీ ఫీచర్లు.. భారీ బ్యాటరీ, ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

రూ.10వేల లోపు క్రేజీ ఫీచర్లు.. భారీ బ్యాటరీ, ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!
Advertisement

Best Budget Phones: ఒకప్పుడు రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తక్కువ బడ్జెట్‌లోనే ఖరీదైన ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే ఫీచర్లతో మొబైల్ కంపెనీలు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. మంచి కెమెరా, రోజంతా ఛార్జింగ్ వచ్చే బ్యాటరీ, గేమింగ్‌కు సపోర్ట్ చేసే డిస్‌ప్లే.. ఇలా అన్నీ ఈ బడ్జెట్ ఫోన్లలోనే దొరుకుతున్నాయి.

ఇప్పుడు ట్రెండ్ మారింది:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ పెరగడంతో Poco, Tecno, Lava వంటి కంపెనీలు సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా తక్కువ ధరకే సూపర్ ఫీచర్లను అందిస్తున్నాయి. నీళ్లు పడినా తడవని బాడీ, స్క్రీన్ వాడకం స్మూత్‌గా ఉండేలా హై రిఫ్రెష్ రేట్ వంటి సదుపాయాలు ఇప్పుడు రూ.10వేల లోపు ఫోన్లలోనే కనిపిస్తున్నాయి. గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేసేవారికి, వీడియోలు చూసేవారికి ఇవి బాగా నచ్చుతాయి. ముఖ్యంగా ఇందులోని AI కెమెరాల వల్ల చీకటిలో కూడా ఫొటోలు సూపర్ క్లారిటీతో వస్తాయి.

AI+ Pulse 2.. బ్యాటరీలో కింగ్:

Advertisement

రూ.10వేల బడ్జెట్ రేంజ్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఫోన్ AI+ Pulse 2. దీనిలో ఏకంగా 6000mAh బ్యాటరీ ఇచ్చారు. దీంతో ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఇక పదే పదే ప్లగ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. 6.7 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడటం చాలా స్పీడ్‌గా అనిపిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 50MP AI కెమెరా కూడా ఉంది. త్వరగా ఛార్జింగ్ అవ్వడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం.

Also Read: AC వేసినా రూమ్ చల్లబడట్లేదా? బహుశా మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనేమో, ఓసారి చెక్ చేసుకోండిలా!

Poco and Tecno.. ఒకదాన్ని మించి ఒకటి:

Advertisement

Poco C81x మోడల్ కూడా బడ్జెట్ ప్రియులకు మంచి ఆప్షన్. దీని స్క్రీన్ క్వాలిటీ భలే ఉంటుంది, వీడియోలు చూసేటప్పుడు మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక Tecno విషయానికొస్తే.. Tecno Spark Go 3, Tecno Pop X మోడళ్లతో మార్కెట్‌ను హీటెక్కిస్తోంది. ముఖ్యంగా Tecno Pop X ఫోన్ కింద పడినా అంత త్వరగా పాడవదు. అంత గట్టిగా దీన్ని తయారు చేశారు. సిగ్నల్ తక్కువగా ఉన్నా కాల్స్ మాట్లాడుకునే సదుపాయం దీనిలో ఉండటం గమనించాల్సిన విషయం.

Lava Bold N2 Pro.. 128GB స్టోరేజ్:

సాధారణంగా తక్కువ ధర ఫోన్లలో మెమరీ త్వరగా నిండిపోతుంటుంది. కానీ Lava Bold N2 Pro ఆ సమస్యకు చెక్ పెట్టింది. రూ.10వేల ధరలో ఎవరూ ఇవ్వని విధంగా 128GB భారీ స్టోరేజ్‌ను అందిస్తోంది. ఎన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నా మెమరీ ఫుల్ అవుతుందనే టెన్షన్ ఉండదు. 50MP కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తున్నాయి.

ఏది కొనడం ఉత్తమం?

ఈ ఆధునిక యుగంలో ఫోన్ కొనేవారు కేవలం తక్కువ ధర ఉంటే సరిపోదు.. అది క్వాలిటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్‌కు, ఇంట్లో పెద్దవాళ్లకు లేదా తక్కువ ధరలో మంచి సెకండ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ మోడల్స్ చాలా బాగా సెట్ అవుతాయి. కంపెనీలు కూడా కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా ఫోన్ చూడటానికి స్టైలిష్‌గా ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. కాబట్టి.. రూ.10వేల లోపు ఫోన్ కావాలనుకుంటే.. పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన మొబైల్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: Galaxy S26 యూజర్ల కోసం One UI 9 బీటా లాంచ్.. మీ ఫోన్ లుక్ మార్చేసే 5 క్రేజీ ఫీచర్లు ఇవే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×