E-Paper
Advertisement

ఇంట్లోనే జిమ్ వర్కవుట్! బెస్ట్ ఎక్సర్‌సైజ్ బైక్స్ ఇవే..

ఇంట్లోనే జిమ్ వర్కవుట్! బెస్ట్ ఎక్సర్‌సైజ్ బైక్స్ ఇవే..
Advertisement

Best Exercise Bikes: ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, డెస్క్ జాబ్స్ వల్ల చాలా మందికి జిమ్‌కు వెళ్లి వర్కవుట్ చేసే టైమ్ దొరకడం లేదు. దీని వల్ల బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. మరి దీనికి బెస్ట్ అండ్ సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఇంట్లోనే ఒక చిన్న ‘ఎక్సర్‌సైజ్ బైక్’సెట్ చేసుకోవడం. ఉదయాన్నే కేవలం 15 నుంచి 20 నిమిషాలు ఈ సైకిల్ తొక్కితే చాలు.. మీ బాడీ కిక్‌స్టార్ట్ అవ్వడమే కాకుండా వందల క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి. అమెజాన్‌లో కస్టమర్లు సూపర్ రేటింగ్స్ ఇచ్చిన టాప్ 5 ఎక్సర్‌సైజ్ సైకిల్స్ , వాటి ప్రస్తుత ధరల పూర్తి వివరాలు మీకోసం.

అమెజాన్ టాప్ 5 ఎక్సర్‌సైజ్ బైక్స్ :
ఇంట్లోనే కార్డియో వర్కవుట్ చేయడానికి ఎక్సర్‌సైజ్ బైక్ అత్యంత సురక్షితమైన , బెస్ట్ ఆప్షన్. ఇది మీ కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా కాళ్లు, పొట్ట , నడుము భాగాల్లోని కొవ్వును కరిగిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ సెల్లర్స్‌గా ఉన్న 5 మోడల్స్ ఇవే..

Advertisement

1. Lifelong LLF54 Fit Pro Stationary Exercise Bike:
బడ్జెట్ ధరలో ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్ అందించే బ్రాండ్లలో లైఫ్‌లాంగ్ ఒకటి. ఈ బైక్ చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది, కాబట్టి బెడ్‌రూమ్ లేదా హాల్‌లో ఎక్కడైనా ఈజీగా సర్దుకోవచ్చు. ఇందులో ఉండే LCD మానిటర్ ద్వారా మీరు ఎంత సమయం సైకిల్ తొక్కారు. ఎన్ని క్యాలరీలు కరిగాయి, మీ స్పీడ్ ఎంత అనేది లైవ్‌గా చూసుకోవచ్చు. ఇందులో రెసిస్టెన్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది.

ప్రస్తుత ధర: రూ. 4,999

Advertisement

2. Reach Air Bike Exercise Cycle with Moving Handles:
మీకు కేవలం కాళ్లకు మాత్రమే కాదు, చేతులకు , అప్పర్ బాడీకి కూడా మంచి వర్కవుట్ కావాలంటే రీచ్ ఎయిర్ బైక్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీనికి ఉండే మూవింగ్ హ్యాండిల్స్ వల్ల సైకిల్ తొక్కేటప్పుడు చేతులు కూడా కదులుతాయి, దీనివల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇందులో కంఫర్టబుల్ సీట్ , యాంటీ-స్లిప్ పెడల్స్ ఉంటాయి. దీని ఎయిర్ ఫ్లైవీల్ సిస్టమ్ మంచి రెసిస్టెన్స్‌ను ఇస్తుంది.

ప్రస్తుత ధర: రూ. 6,499

3. Sparnod Fitness SAB-05 Air Bike Exercise Cycle:
స్పార్నోడ్ ఫిట్‌నెస్ బైక్ కిచెన్ లేదా హాల్‌లో తక్కువ స్పేస్ ఉన్న ఇళ్లకు చాలా బాగా సూట్ అవుతుంది. దీని స్టీల్ ఫ్రేమ్ బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీని లోని బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ వల్ల సైకిల్ తొక్కేటప్పుడు అస్సలు శబ్దం రాదు, కాబట్టి ఇంట్లో మిగతా వారు నిద్రపోతున్నా సరే మీరు సైలెంట్‌గా వర్కవుట్ చేసుకోవచ్చు. దీని సీట్ ఎత్తును మీ హైట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ప్రస్తుత ధర : రూ. 5,799

4. Powermax Fitness BU-200 Magnetic Upright Bike:
మీకు మరింత స్మూత్, అడ్వాన్స్‌డ్ వర్కవుట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మ్యాగ్నెటిక్ బైక్స్ బెస్ట్. పవర్‌మ్యాక్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్‌లో ‘Magnetic Resistance’ ఉంటుంది. అంటే మీరు నాబ్ తిప్పడం ద్వారా సైకిల్ తొక్కే ఒత్తిడిని (కష్టాన్ని) 8 లెవెల్స్ వరకు మార్చుకోవచ్చు. దీని వల్ల బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ దాకా ఎవరైనా వాడుకోవచ్చు. దీని LCD డిస్‌ప్లేలో పల్స్ (హార్ట్ రేట్) సెన్సార్ కూడా ఉంటుంది.

ప్రస్తుత ధర : రూ. 9,499

5. BeatHPX Volte Spinning Exercise Bike:
జిమ్‌లో ఉండే హెవీ డ్యూటీ ‘స్పిన్నింగ్ బైక్’ లాంటి ఫీల్ ఇంట్లోనే కావాలనుకుంటే బీట్‌హెచ్‌పిఎక్స్ మోడల్ అల్టిమేట్ ఆప్షన్. ఇది 4 కిలోల భారీ ఫ్లైవీల్‌తో వస్తుంది. దీని వల్ల మీరు వేగంగా సైకిల్ తొక్కినా బైక్ అస్సలు కదలదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది సీరియస్‌గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేయాలనుకునే వారికి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. దీనికి మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది.

ప్రస్తుత ధర : రూ. 11,999

ఎక్సర్‌సైజ్ బైక్ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన టిప్స్:
బైక్ రకం: కేవలం లోయర్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి ‘స్టేషనరీ/మ్యాగ్నెటిక్ బైక్’ చాలు. బాడీ మొత్తం వర్కవుట్ కావాలంటే ‘ఎయిర్ బైక్ (మూవింగ్ హ్యాండిల్స్)’ ఎంచుకోండి.

యూజర్ బరువు : ప్రతి బైక్‌కు ఒక మాగ్జిమం వెయిట్ కెపాసిటీ (ఉదాహరణకు 100 kgs) ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నవారి బరువు కంటే కనీసం 10-15 కిలోల ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్‌ను ఎంచుకోవడం వల్ల బైక్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఉదయాన్నే నిద్ర లేవగానే టీవీ చూస్తూనో లేదా మీకు నచ్చిన మ్యూజిక్ వింటూనో ఇంట్లోనే హ్యాపీగా ఎక్సర్‌సైజ్ బైక్ తొక్కొచ్చు. అమెజాన్‌లో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే మీ ఫిట్‌నెస్ జర్నీని కిక్‌స్టార్ట్ చేయండి.

Related News

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×