Uganda: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు (Indian Premier League 2026 Tournament) జరుగుతున్న నేపథ్యంలో భారత పర్యటనకు పసికూన ఉగాండా క్రికెట్ జట్టు (UGANDA Cricket TEAM) రానుంది. ఇండియాలో ఏకంగా నాలుగు వన్డేలు, మరో నాలుగు టి20 లు ఆడేందుకు పర్యటిస్తోంది ఉగాండా క్రికెట్ టీం. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపటి నుంచి ఉగాండా క్రికెట్ జట్టు ఆడే టోర్నమెంట్ కూడా షురూ కానుంది. అయితే ఉగాండా ఆడేది మన టీమిండియా జట్టుతో కాదు. ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టుతో (Mumbai Cricket Association) క్రికెట్ ఉగాండా తలపడనుంది.
ఉగాండా జాతీయ క్రికెట్ జట్టు (UGANDA Cricket TEAM) ఇండియా పర్యటనకు వచ్చేసింది. నిన్న సాయంత్రం ముంబైలో దిగింది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టుతో నాలుగు వన్డేలు ( 4 Odis), నాలుగు టి20 మ్యాచ్ లు ( 4T20s) ఆడనుంది ఉగాండా క్రికెట్ జట్టు. దాదాపు 5 సంవత్సరాల ఒప్పందం ప్రకారం ఈ రెండు జట్లు రెండు సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఉగాండా వర్సెస్ ముంబై క్రికెట్ అసోసియేషన్ మధ్య రేపటి నుంచి అంటే మే 18వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మే 18, 20, 22, 24 తేదీలలో వన్డే సిరీస్ కొనసాగనుంది.
ఇందులో రెండు మ్యాచ్ లు పాల్ఘర్ దహను తాలూకా స్పోర్ట్స్ అసోసియేషన్ మైదానంలో జరగనున్నాయి. పాల్ఘర్ లోని అదానీ స్టేడియంలో మరో రెండు మ్యాచ్ లు ఉంటాయి. ఇక టి20 లీగ్ మే 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మే 26, 27, 29 , 30 తేదీలలో ఉగాండా వర్సెస్ ముంబై క్రికెట్ అసోసియేషన్ మధ్య నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో మొదటి మ్యాచ్ థానాలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా జరగనుంది. మిగిలిన మూడు మ్యాచులు అదానీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఆఫ్రికా ఖండంలో ( Africa ) క్రికెట్ ఎదుగుదలకు, ఉగాండా ఆటగాళ్లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకుగాను ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ఇండియాలో క్రికెట్ ఆడితే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లోకి ఉగాండా క్రికెటర్లు (UGANDA Cricket TEAM) వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశ క్రికెటర్లు అయిన ఉగాండాతో ముంబై ప్లేయర్లు ఆడితే… వాళ్లకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రెండు జట్ల ప్లేయర్ల మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడుతుంది. అందుకే ఇండియా పర్యటనకు ఉగాండా క్రికెట్ జట్టును ఆహ్వానించారు. పురుషుల జట్టు సక్సెస్ అయితే త్వరలో ఉగాండా మహిళల క్రికెట్ కూడా ఇండియాకు రానుందట.
UGANDA TEAM IS COMING TO MUMBAI 🏆🏏
– Four 50 over matches. (May 18 to 24)
– Four T20 matches. (May 26 to 30th)T20 matches will be against T20 Mumbai league Teams – Great work by Mumbai Cricket Association & Ajinkya Naik 👏 pic.twitter.com/i6rIw86MaG
— Johns. (@CricCrazyJohns) May 17, 2026