Stainless Steel Refrigerators: కిచెన్ లేదా వంటగది అనేది కేవలం వంట చేసే స్థలం మాత్రమే కాదు, అది ఇంటి ఇంటీరియర్ లుక్‌ను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన భాగం. అందుకే ఈ రోజుల్లో గృహోపకరణాలను ఎంచుకునేటప్పుడు కేవలం వాటి పనితీరునే కాకుండా, అవి చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉన్నాయనే విషయాన్ని కూడా ఇళ్లలో ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వచ్చే డబుల్ డోర్ ఫ్రిజ్ లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇవి మీ వంటగదికి ఒక రాయల్ లేదా ప్రీమియం లుక్‌ను తీసుకురావడమే కాకుండా, సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి .
స్టెయిన్‌లెస్ స్టీల్ రిఫ్రిజిరేటర్ల ప్రత్యేకత ఏంటి?
సాధారణంగా పెయింట్ చేసిన లేదా గ్లాస్ ఫినిషింగ్‌తో వచ్చే ఫ్రిజ్‌లతో పోలిస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ ఉన్న వాటికి లైఫ్ ఎక్కువ. వీటిపై గీతలు పడటం చాలా అరుదు. అంతేకాదు, ఈ రోజుల్లో వస్తున్న మోడల్స్ అన్నీ ‘ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్’ కోటింగ్‌తో వస్తున్నాయి. అంటే వీటిపై చేతి వేలిముద్రల మరకలు అస్సలు పడవు. దీని వల్ల ఫ్రిజ్ ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది. తుప్పు పట్టే సమస్య అస్సలు ఉండదు కాబట్టి.. తీరప్రాంతాలు లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి.
డబుల్ డోర్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ భాగం విడిగా ఉండటం వల్ల, పదే పదే ఫ్రిజ్ డోర్ తీసినా లోపలి కూలింగ్ తగ్గదు. ఇది కరెంట్ ఆదా కావడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది.
1. శామ్‌సంగ్ కన్వర్టబుల్ 5-ఇన్-1 ఇన్వర్టర్ ఫ్రిజ్ (Samsung Twin Cooling Plus):
శామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ మోడల్ ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇందులో ఉన్న ‘ట్విన్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ ఫ్రిజ్ , ఫ్రీజర్ భాగాలకు విడివిడిగా కూలింగ్ గాలిని పంపుతుంది. దీని వల్ల ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు వాడిపోకుండా, వాటి సహజ సిద్ధమైన వాసనతో తాజాగా ఉంటాయి. దీనిలోని 5-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్ పెద్ద ప్లస్ పాయింట్. అంటే పండుగలు లేదా పార్టీల సమయంలో మీకు ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే.. ఫ్రీజర్ భాగాన్ని కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. దీని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ చాలా తక్కువ కరెంట్ తీసుకుంటుంది.
2. ఎల్‌జీ స్మార్ట్ ఇన్వర్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్ (LG Door Cooling+):
ఎల్‌జీ అనగానే మనకు గుర్తొచ్చేది నమ్మకం, లేటెస్ట్ టెక్నాలజీ. ఈ మోడల్ వంటగదికి ఎంతో ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో ఉన్న ‘డోర్ కూలింగ్+’ ఫీచర్ చాలా ప్రత్యేకమైంది. సాధారణంగా ఫ్రిజ్ డోర్ వైపు ఉండే బాటిల్స్ లేదా వస్తువులకు కూలింగ్ తక్కువగా అందుతుంది. కానీ ఈ టెక్నాలజీ ద్వారా డోర్ వైపు కూడా సమానంగా చల్లదనం అందుతుంది. దీని స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ సౌండ్ అస్సలు చేయదు. హోమ్ ఇన్వర్టర్‌పై కూడా ఇది రన్ అవుతుంది.
3. వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ ఇన్వర్టర్ ఏఐ ఫ్రిజ్ (Whirlpool Adaptive Intelligence):
వర్ల్‌పూల్ తన లేటెస్ట్ సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ జోడించింది. ఈ ఫ్రిజ్‌లో ఉండే ఇంటెలిజెంట్ సెన్సార్లు వాతావరణ ఉష్ణోగ్రతను, ఫ్రిజ్ లోపల ఉన్న లోడ్‌ను, మీ రోజువారీ వాడకాన్ని గమనించి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తాయి. దీని ప్రీమియం స్టీల్ ఫినిషింగ్ కిచెన్‌కు మోడ్రన్ లుక్ ఇస్తుంది. లోపల ఉన్న జియోలైట్ టెక్నాలజీ పండ్లు, కూరగాయలు కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు కాపాడుతుంది.
4. గాడ్రెజ్ ఈయాన్ వింటేజ్ సిరీస్ (Godrej Nano Shield Technology):
బడ్జెట్ ధరలో సూపర్ క్వాలిటీ, గట్టి బాడీ ఆశించే వారికి గాడ్రెజ్ ఒక అద్భుతమైన ఆప్షన్. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్ చాలా బలంగా ఉంటుంది. ఈ ఫ్రిజ్ లోపల ‘నానో షీల్డ్’ అనే ప్రత్యేక టెక్నాలజీని వాడారు. ఇది ఫ్రిజ్ లోపల ఉన్న ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా చేరకుండా 95% వరకు రక్షణ కల్పిస్తుంది. పాలు, కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.
5. హైసెన్స్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ప్రిజ్ (Hisense Multi Air Flow):
గ్లోబల్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న హైసెన్స్, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. దీని మోడ్రన్ స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్ లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. ‘మల్టీ ఎయిర్ ఫ్లో’ సిస్టమ్ ద్వారా ఫ్రిజ్‌లోని ప్రతి షెల్ఫ్‌కు సమానమైన చల్లటి గాలి అందుతుంది. ఇందులో ఉన్న తేమ వల్ల ఆకుకూరలు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.
కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు:
సైజ్ , కెపాసిటీ: మీ ఇంట్లో 3 నుంచి 5 గురు సభ్యులు ఉంటే 250 లీటర్ల నుంచి 350 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిజ్ సరిగ్గా సరిపోతుంది.
స్టార్ రేటింగ్: కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే కనీసం 3-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్స్‌ను ఎంచుకోవడం మంచిది.
వారంటీ: ఫ్రిజ్ కొనేటప్పుడు కంప్రెసర్‌పై కనీసం 10 సంవత్సరాల వారంటీ ఇచ్చే నమ్మకమైన బ్రాండ్స్‌ను మాత్రమే ఎంచుకోండి.