Top Refrigerators India 2026: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మార్చి 1 నాటికి ఎండలు తీవ్రంగా ఉండే వేసవిలోకి అందరూ అడుగుపెడతారు. అయితే సమ్మర్ అనగానే ప్రధానంగా అందరి దృష్టి ఫ్రిడ్జ్ ల మీదకు వెళ్తుంది. తమ అవసరాలకు అనుగుణంగా మార్కెట్ లో ఎలాంటి ఫ్డిడ్జ్ ఉన్నాయని తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్ లో టాప్ రేటింగ్ కలిగిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లను ఇక్కడ అందించడం జరిగింది. అందులో మీ అభిరుచులకు అనుగుణంగా ఉన్న ఫ్రిడ్జ్ లను ట్రై చేయండి.
శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్ వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. 236 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం, పవర్ ఫుల్ కూలింగ్ వ్యవస్థ, ఆహారపదార్థాలను ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంచగలడం దీని ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ లో రూ.25,490కి ఈ డబుల్ డోర్ శాంసంగ్ ఫ్రిడ్జ్ లభిస్తోంది.
హైయర్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్ సైతం వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. 14 రకాల కూలింగ్ పద్దతుల్లో ఈ ఫ్రిడ్జ్ లో ఆహారపదార్థాలను భద్రపరుచుకోవచ్చు. పవర్ సేవింగ్ మోడ్, సర్ ప్రైజ్ పార్టీ మోడ్, టర్బో మోడ్ వంటి కూలింగ్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీకి ఈ ఫ్రిడ్జ్ ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్ లో దీని ధర రూ. 35,490గా ఉంది.
ఎల్జీ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్.. 272 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్, స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ, యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ వంటి ఫీచర్లను ఇది కలగి ఉంది. మార్కెట్ లో రూ.28,990కి ఈ ఫ్రిడ్జ్ విక్రయిస్తున్నారు. అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ లో ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్ డబుల్ డోర్ కలిగి ఉంది. 197 W పవర్ వినియోగం, మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ, 47.5 కేజీల బరువు, ఫాజిల్ స్టీల్ కలర్ ఆప్షన్, 3 స్టార్ రేటింగ్ ను ఇది కలిగి ఉంది. మార్కెట్ లో ఈ ఫ్రిడ్జ్ రూ.23,990కు లభిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫ్రిడ్జ్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.
విర్ల్ పూల్ కంపెనీకి చెందిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. 265 లీటర్ల సామర్థ్యం, 3 స్టార్ రేటింగ్, డిజిటల్ ఇన్వర్టర్, 60 కేజీల బరువు, డోర్ అలారం సిస్టమ్ తో ఈ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.27,740గా ఉంది.