E-Paper
Advertisement

Beer for Hair: బీర్ ఇలా వాడారంటే జుట్టు ఒత్తుగా మెరుపుతో పెరగడం ఖాయం

Beer for Hair: బీర్ ఇలా వాడారంటే జుట్టు ఒత్తుగా మెరుపుతో పెరగడం ఖాయం
Advertisement

బీర్ తాగే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. దాన్ని కేవలం తాగే పానీయంగానే చూస్తారు. అయితే దీన్ని జుట్టు ఆరోగ్యానికి, ఎదుగుదలకు కూడా వినియోగించవచ్చని కొంతమంది బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఇప్పుడు కొందరు దాన్ని హెయిర్ రిన్స్‌గా వాడుతున్నారు. బీర్‌లో ఉండే కొన్ని పదార్థాలు జుట్టుకు తాత్కాలికంగా మెరుపు, పట్టులాంటి అందంగా ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బీర్ వాడితే జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది లేదా శాశ్వతంగా సమస్యలు పోతాయి అనే విషయానికి సంబంధించి మాత్రం స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే దీన్ని ఒక చిన్న హెయిర్ కేర్ టిప్‌గా మాత్రమే చూడాలి.

బీర్ ఎలా ఉపయోగపడుతుంది?
బీర్‌లో మాల్ట్, హాప్స్ గింజలు , బార్లీ వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు తంతువుల మీద ఒక పొరలా ఏర్పడి జుట్టు మెత్తగా, కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. బీర్ వాడడం వల్ల కొందరికి జుట్టు పొడిబారడం తగ్గినట్టు, జిడ్డుదనం తగ్గినట్టు చెప్పారు. అలాగే జుట్టు బలంగా మారినట్టు కూడ కొంతమంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. హాప్స్‌ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల తల చర్మానికి కొంత వరకు మేలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. బార్లీ లో ఉండే బి విటమిన్లు, జింక్ వంటి పదార్థాలు కూడా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని వారు వివరిస్తున్నారు.

Advertisement

Also read: River: మనదేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక నది ఏదో తెలుసా?

బీర్ ను ఎలా వాడాలి?
బీర్‌ను జుట్టుకు వాడే విధానం కూడా చాలా సులభమే. ముందుగా బీర్ బాటిల్‌ను తెరిచి కొన్ని గంటలు అలాగే ఉంచాలి. అలా ఉంచితే అందులోని గ్యాస్ తగ్గుతుంది. తర్వాత సాధారణంగా షాంపూ చేసి జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బీర్‌ను జుట్టు మీద నెమ్మదిగా పోయాలి లేదా చేతులతో జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో బాగా కడగాలి. అవసరమైతే చివర్లో కండిషనర్ వాడొచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు మెత్తగా అనిపించవచ్చు. అయితే వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి మాత్రమే ఇలా చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also read: Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా, తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్

అయితే ప్రతి ఒక్కరికి బీర్ జుట్టుకు సరిపడుతుందని చెప్పలేము. కొందరికి తల చర్మం సెన్సిటివ్‌గా ఉండొచ్చు. అలాంటి వారు ముందుగా కొద్దిగా పరీక్ష చేసి తర్వాతే వాడటం మంచిది. అలాగే బీర్ వాసన కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ కండిషనర్ లేదా మంచి షాంపూ వాడితే ఆ వాసన తగ్గుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బీర్ తో కడిగితే సరిపోదు. సరైన ఆహారం, తగినంత నీరు తాగడం, తల శుభ్రత, సరైన నిద్ర… ఇవి అన్నీ చేస్తేనే జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేతప్ప బీర్ వాడితే చాలని మేము చెప్పడం లేదు.

Related News

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

Big Stories

Advertisement
×