E-Paper
Advertisement

Laptop Under Rs 30,000: కళ్లు చెదిరే ఆఫర్.. Asus Vivobook Go 15 ల్యాప్ టాప్‌పై.. రూ.15 వేల డిస్కౌంట్!

Laptop Under Rs 30,000: కళ్లు చెదిరే ఆఫర్.. Asus Vivobook Go 15 ల్యాప్ టాప్‌పై.. రూ.15 వేల డిస్కౌంట్!
Advertisement

Laptop Under Rs 30,000: ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ పని కంప్యూటర్, ల్యాప్ టాప్ చుట్టూనే తిరుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కంటెంట్ క్రియేటర్లు ఇలా ప్రతీఒక్కరూ తమ రోజూవారి కార్యక్రమాల కోసం ల్యాప్ టాప్ మీదనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన పనితీరు కనబరిచే ల్యాప్ టాప్ కావాలంటే రూ.45,000 వరకూ ఖర్చు చేయాల్సిందే. అయితే రూ.45 విలువ కలిగిన Asus Vivobook Go 15 ల్యాప్ టాప్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.

రూ.15,000 తగ్గింపుతో..

Asus Vivobook Go 15 ల్యాప్ టాప్ పై ప్రస్తుతం స్విగ్గీ ఇన్ స్టామార్ట్ (Swiggy Instamart)లో రూ.15 వేల వరకూ రాయితీ లభిస్తోంది. రూ.29,990కే ల్యాప్ అందుబాటులో ఉంది. ఒకసారి ఆర్డర్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోనే ల్యాప్ టాప్ మీ గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. కొత్త ల్యాప్ టాప్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఫీచర్ల విషయానికి వస్తే..

Advertisement

ఆసుస్ వివోబుక్ గో 15 ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది మోడరన్ డిజైన్, స్లిమ్ లుక్ తో 1.63 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంది. ఫలితంగా దీనిని తేలిగ్గా క్యారీ చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్ 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 15.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. AMD రైజెన్ 3 7320U ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM, 512GB SSD స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు..

Windows 11 హోమ్ ప్రీ ఇన్ స్టాల్ తో ఈ ల్యాప్ టాప్ లభిస్తుంది. ఇందులో ఎంఎస్ ఆఫీసు సౌకర్యం కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే USB టైప్ A, టైప్ C పోర్ట్‌లు, Wi Fi 6E సపోర్ట్, బ్లూటూత్ 5.0, గోప్యత కోసం షట్టర్ తో కూడిన HD వెబ్‌క్యామ్ ఉన్నాయి.

Advertisement

Also Read: Bharat Taxi: భారత్ ట్యాక్సీ లాంచ్.. ఓలా, ఉబర్ దోపిడికి చెక్.. 30% తక్కువ ఖర్చుతో ప్రయాణం!

ఆఫీసు ప్రజెంటేషన్స్

ఆఫీసు వర్క్, ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఈ ల్యాప్ టాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ ల్యాప్ టాప్ లోని Ryzen 3 ప్రాసెసర్ రోజువారీ పనులను స్మూత్ గా వేగంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. 15.6 అంగుళాల స్క్రీన్.. ప్రజెంటేషన్స్ కోసం అనుకూలంగా ఉండనుంది. ఎక్కువ సేపు టైప్ చేసేందుకు వీలుగా ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్ డిజైన్ ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Also Read: Railyway Station In India: మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×