Waterproof smartphones| తక్కువ బడ్జెట్‌లో వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కొనడం ఒకప్పుడు అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సాధ్యమే. చాలా బ్రాండ్లు రూ.15,000 కంటే తక్కువ ధరలో వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లలో IP68, IP69 లేదా IP64 రేటింగ్ ఉంటుంది. నీటి చనికులు, వర్షం, డస్ట్, తేమ నుంచి ఈ రేటింగ్స్ ఉన్న ఫోన్స్ సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 5 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..
IP రేటింగ్స్.. నీరు, దుమ్ము రక్షణ కలిగిన ఫోన్లకు లభిస్తుంది. IP68, IP69 ఫోన్‌లు నీటిలో మునిగినా, భారీ వర్షంలో తడిచినా సురక్షితంగా ఉంటాయి. IP64 ఫోన్‌లు లైట్ వర్షం, చెమట్, యాదృచ్ఛికంగా ఫోన్ పై నీరు పడినా ఫోన్ డ్యామెజ్ కాకుండా తట్టుకుంటాయి. ఈ రేటింగ్‌లు రోజువారీ ఉపయోగంలో ఫోన్ డ్యూరబిలిటీని పెంచుతాయి.
వివొ Y31 5Gలో అరుదైన IP68, IP69 ప్రొటెక్షన్ ఉంది. నీటిలో మునిగినా, భారీ వర్షంలోనైనా, డస్ట్‌లోనైనా సులభంగా తట్టుకుంటుంది. Vivo Y31 5G ధర రూ.14,499 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర సెగ్మెంట్‌లో ఇలాంటి ఫీచర్ చాలా అరుదు. అవుట్‌డోర్ యూజర్లు, రఫ్ వాతావరణానికి ఇది సరైనది. బలమైన బిల్డ్ క్వాలిటీ, నమ్మదగిన పనితీరు ఇస్తుంది.
రెడ్ మి 15 5Gలో IP64 రేటింగ్ ఉంది. నీటి చినుకులు పడినా, ఫోన్ చెమటలో తడిచినా ఫోన్ సురక్షితంగా ఉంటుంది. లైట్ వర్షంలో కూడా నిర్భయంగా ఫోన్ ని నిర్భయంగా ఉపయోగించవచ్చు. రోజువారీ అవసరాలకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర కేవలం రూ.14,183కు లభిస్తోంది. భద్రత, పనితీరు, చౌక ధర మధ్య మంచి బ్యాలెన్స్ కలిగిన ఫోన్ ఇది.
పోకో M7 ప్లస్ 5G కూడా IP64 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, చిన్న వాటర్ ఎక్స్‌పోజర్‌ను తట్టుకుంటుంది. జిమ్ యూజర్లు, అవుట్‌డోర్ యాక్టివిటీలకు ఇది సరిపోతుంది. యాదృచ్ఛిక వాటర్ కాంటాక్ట్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ధర రూ.11,849 నుంచి మొదలవుతుంది. ఈ ధరలో పోకో బలమైన వాల్యూ ఇస్తుంది.
రెడ్‌మి నోట్ 14 SE 5Gలో IP64 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షిస్తుంది. వైబ్రంట్ AMOLED డిస్‌ప్లే ఉంది. ప్రీమియం లుక్, బలమైన డ్యూరబిలిటీ ఇస్తుంది. ధర రూ.13,499. స్టైల్, సేఫ్టీ కావాలనుకునేవారికి ఇది సరిపోతుంది.
Also Read: ప్రీమియం ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్.. రూ.50000 రేంజ్ లో ఇవే బెస్ట్
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+లో IP64 రేటింగ్ డిజైన్ ఉంది. సాధారణ వాటర్ స్ప్లాష్, డస్ట్‌ను తట్టుకుంటుంది. బడ్జెట్ బయ్యర్లకు ఇది సరైనది. రోజువారీ వినియోగానికి నమ్మదగిన డ్యూరబిలిటీ ఇస్తుంది. ధర రూ.10,499 నుంచి మొదలవుతుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన వాల్యూ ఆఫర్ చేస్తుంది.
స్మార్ట్ఫోన్లలో వాటర్ డ్యామేజ్ సాధారణ సమస్య. వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌లు రిపేర్ రిస్క్‌లను గణనీయంగా తగ్గిస్తాయి. రియల్-వరల్డ్ కండిషన్స్‌లో ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఈ మోడల్స్ ఇప్పుడు డ్యూరబిలిటీ చౌకగా అందుబాటులో ఉందని నిరూపిస్తున్నాయి.