E-Paper
Advertisement

AP Districts: ఏపీలో మొత్తం జిల్లాలు 29 కాదు 28.. కొత్త జాబితా ఇదే

AP Districts: ఏపీలో మొత్తం జిల్లాలు 29 కాదు 28.. కొత్త జాబితా ఇదే
Advertisement

AP Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మంత్రి మండలి నిర్ణయంతో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28కి చేరింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా ప్రకటించారు. మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసింది. ప్రజల నుంచి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాంతీయ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు కేబినెట్ పేర్కొంది.

కేబినెట్ కీలక నిర్ణయం

కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ సీఎం చంద్రబాబు నివేదిక అందించింది. సబ్ కమిటీ నివేదికను కేబినెట్ లో చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులు పడేవారు. దీంతో కూటమి ప్రభుత్వం మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి.

అన్నమయ్య జిల్లా..మదనపల్లె కేంద్రం

Advertisement

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌పై కేబినెట్ లో తీవ్రమైన చర్చ జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్వేగానికి లోనైనప్పటికీ, భౌగోళిక, సాంకేతిక కారణాలతో మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఖరారు చేశారు. మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లు కలిపి అన్నమయ్య జిల్లాలో ఉంటాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉండగా, జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తు్న్నారు. జిల్లా పేరులో మార్పు చేయలేదు.

పోలవరం జిల్లా

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారించేందుకు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షణ, ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు శాశ్వత కలెక్టరేట్లకు నిధులు కేటాయించనున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు లేకుండా పోలవరం జిల్లా ఏర్పాటుపై కేబినెట్ లో ప్రశ్నలు తలెత్తాయి. దీంతో పోలవరం నిర్వాసితుల కోసమే ఈ జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

మార్పు చేర్పులు

Advertisement

బనగానపల్లె, అడ్డరోడ్డును రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్పు చేశారు. దర్శి నియోజకవర్గాన్ని అద్దంకి సబ్ డివిజన్ లోనే భాగం చేశారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు కేటాయించారు. సిద్ధవటం, ఒంటిమిట్టను కడపలోకి మార్పు చేశారు. మడకశిరను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు.

ఏపీలో మొత్తం జిల్లాలు 28 ఇవే

ఉత్తరాంధ్ర జిల్లాలు -6

  • అల్లూరి సీతారామ రాజు
  • అనకాపల్లి
  • పార్వతీపురం మన్యం
  • శ్రీకాకుళం
  • విశాఖపట్నం
  • విజయనగరం

కోస్తాంధ్ర జిల్లాలు -14

  • బాపట్ల
  • డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ
  • తూర్పు గోదావరి
  • పశ్చిమగోదావరి
  • ఏలూరు
  • గుంటూరు
  • కాకినాడ
  • కృష్ణా
  • ఎన్టీఆర్
  • పల్నాడు
  • ప్రకాశం
  • మార్కాపురం
  • పొట్టి శ్రీరాములు నెల్లూరు
  • పోలవరం

రాయలసీమ జిల్లాలు-8

  • అనంతపురం
  • అన్నమయ్య
  • చిత్తూరు
  • కడప
  • కర్నూలు
  • నంద్యాల
  • శ్రీ సత్యసాయి
  • తిరుపతి

Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Related News

మాజీ స్పీకర్ తమ్మినేని చుట్టూ ఉచ్చు.. సీతారాం, కుటుంబసభ్యులపై కేసు, ఏం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×