E-Paper
Advertisement

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!
Advertisement

Trending Vs Useful Gadgets: మార్కెట్‌లోకి రోజూ ఏదో ఒక కొత్త గ్యాడ్జెట్ వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, రకరకాల కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన ఫీచర్లతో కనిపించే వస్తువులు మనల్ని బాగా టెంప్ట్ చేస్తుంటాయి. అయితే, ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి వస్తువు నిజంగా మనకు అవసరమా అంటే చెప్పడం కష్టమే. అందుకే రూపాయి ఖర్చు పెట్టేముందు అది మన రోజువారీ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవడం చాలా ముఖ్యం.

ట్రెండింగ్ మోజులో పడొద్దు:

ఈ రోజుల్లో రీల్స్, ప్రకటనలు చూసి చాలామంది కనిపించిన గ్యాడ్జెట్‌ను వెంటనే కొనేస్తుంటారు. కానీ, ఆకర్షణీయమైన లుక్స్ ఉన్నంత మాత్రాన అది మంచి ప్రొడక్ట్ అయిపోదు. కొన్ని రోజులు వాడిన తర్వాత మూలన పడేసే గ్యాడ్జెట్ల కంటే.. ప్రతిరోజూ మన పనిని సులభం చేసే వాటిని ఎంచుకోవడమే తెలివైన పని.

నిత్య జీవితానికి ఉపయోగపడేవి:

Advertisement

మనకు నిజంగా ఉపయోగపడేవి పవర్ బ్యాంకులు, వైర్‌లెస్ ఛార్జర్లు లేదా మంచి హెడ్‌ఫోన్లు వంటి గ్యాడ్జెట్లే. ఇవి ప్రయాణాల్లో, ఆఫీస్ పనిలో చాలా సమయాన్ని ఆదా చేస్తాయి. ప్రచారాల వెనుక పరిగెత్తకుండా.. మన నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను తీర్చే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం వల్ల పెట్టిన డబ్బుకు సరైన విలువ దక్కుతుంది.

Also Read: ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

స్మార్ట్‌వాచ్ నిజంగా అవసరమా?

Advertisement

ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లు అందరి చేతుల్లో కనిపిస్తున్నాయి. హెల్త్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు చూడటానికి ఇవి బాగానే ఉంటాయి. కానీ రోజువారీ వర్కౌట్లు, రన్నింగ్ చేసే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం టైమ్ చూడటానికి మాత్రమే అయితే, వేల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే సాధారణ వాచ్ తీసుకోవడమే ఆర్థికంగా మంచి నిర్ణయం.

స్మార్ట్ హోమ్ పరికరాల ఎంపిక:

స్మార్ట్ లైట్లు, ప్లగ్స్, స్పీకర్లు ఇంట్లో పనులను సులభం చేస్తాయి. వాయిస్ కమాండ్లతో లైట్లు వేయడం లేదా టైమర్లు పెట్టడం సౌకర్యంగానే ఉంటుంది. అయితే ఇవి అందరి ఇళ్లకు సరిపోవాలని లేదు. వీటిని కొనేముందు వైఫై కనెక్షన్, సెటప్, గోప్యత వంటి విషయాలను మనసులో ఉంచుకోవాలి. అనవసరంగా పరికరాలు పెంచేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.

తక్కువ బడ్జెట్.. ఎక్కువ ప్రయోజనం:

ఎక్కువ ధర ఉండే గ్యాడ్జెట్లే గొప్పవి అనుకోవడం పొరపాటు. రూ.200 నుంచి రూ.500 లోపు దొరికే ఫోన్ స్టాండ్లు, కేబుల్స్, చిన్న స్పీకర్లు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం తక్కువ ధర ఉందనో లేదా ట్రెండింగ్ అనో కాకుండా.. క్వాలిటీ, కస్టమర్ రివ్యూలు చూసి కొనుగోలు చేయడం మంచిది. మన అవసరాన్ని బట్టి ఎంచుకుంటేనే ఆ వస్తువుకి అసలైన విలువ వస్తుంది.

Also Read: చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

Tags

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×