E-Paper
Advertisement

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!
Advertisement

Xiaomi Pocket Photo Printer Pro: మనకు ఎంతో ఇష్టమైన క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసేది ఫోటోలే. ఫోన్‌లో వేల సంఖ్యలో ఫోటోలు ఉన్నా.. వాటిని ప్రింట్ తీసి చేతిలో పట్టుకుని చూసే అనుభూతి మాత్రం ప్రత్యేకమే. అలాంటి మధుర జ్ఞాపకాలను డిజిటల్ స్క్రీన్ నుంచి నేరుగా మన చేతుల్లోకి తీసుకొచ్చేందుకు షావోమీ కొత్త గ్యాడ్జెట్‌ను పరిచయం చేసింది. చైనా మార్కెట్లో ‘మిజియా పాకెట్ ఫోటో ప్రింటర్ ప్రో గిఫ్ట్ బాక్స్’ పేరుతో లాంచ్ చేసిన ఈ ప్రొడక్ట్.. ఫోన్‌లోని ఫోటోలను సులభంగా ప్రింట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ పాకెట్ ఫోటో ప్రింటర్‌లో ప్రత్యేకతలేంటి? ఇదెలా పనిచేస్తుంది? ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త లుక్, ప్రత్యేకమైన డిజైన్:

సాధారణంగా దొరికే రెగ్యులర్ ప్రింటర్‌తో పోలిస్తే.. ఈ గిఫ్ట్ బాక్స్ ఎడిషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని ఆకర్షణీయమైన లైట్ పర్పుల్ రంగులో తీర్చిదిద్దారు. దీంతో పాటు ఒక మల్టీ పర్పస్ ఫోటో ఫ్రేమ్, స్టోరేజ్ బ్యాగ్ కూడా లభిస్తాయి. ఫోటో ఫ్రేమ్‌ను టేబుల్‌పై పెట్టుకోవచ్చు లేదా వెనుక ఉండే మాగ్నెట్ సహాయంతో ఫ్రిజ్‌కు కూడా తగిలించుకోవచ్చు. దీనిలో దాదాపు 20 ఫోటోల వరకు దాచుకునే వీలుంది. ఇక ప్రింటర్, దానికి సంబంధించిన కాగితాలను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఈ బ్యాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

స్పష్టమైన క్వాలిటీ ఫోటో ప్రింటింగ్:

ఈ చిన్న ప్రింటర్ ఫోటోలను చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో ప్రింట్ చేస్తుంది. ఇది డై-సబ్లిమేషన్ టెక్నాలజీతో పనిచేస్తూ మిలియన్ల కొద్దీ రంగులను చక్కగా ప్రతిబింబిస్తుంది. ఫోటో ప్రింట్ బయటకు వచ్చే సమయంలోనే దానిపై ఆటోమేటిక్‌గా ఒక రక్షణ పొర ఏర్పడుతుంది. దీనివల్ల నీటి బొట్లు పడినా లేదా కాలం మారినా ఫోటో రంగులు తగ్గిపోకుండా చాలా కాలం పాటు కొత్తదానిలాగే భద్రంగా ఉంటుంది.

స్మార్ట్ ఫీచర్లు, మల్టీయూజర్ సపోర్ట్:

Advertisement

బ్లూటూత్ ద్వారా ఈ ప్రింటర్‌ను ఫోన్‌కు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు దీనిని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ యాప్ సహాయంతో ఫోటోలకు బోర్డర్లు, ఫిల్టర్లు, కొలేజ్ డిజైన్లు జోడించవచ్చు. అంతటితో ఆగకుండా.. ప్రింట్ తీసే ఫోటోకు ఆడియో లేదా వీడియో క్లిప్‌ను లింక్ చేసే సదుపాయం కూడా ఉంది. ఫోటోపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ వీడియో లేదా ఆడియో ప్లే అవుతుంది.

ధర వివరాలు ఇలా:

ఈ పాకెట్ ప్రింటర్ ప్రో గిఫ్ట్ బాక్స్ ధర చైనాలో దాదాపు రూ.9,400 ఉంది. కేవలం ప్రింటర్ మాత్రమే కావాలనుకుంటే దాని ధర రూ.3,000 వరకు ఉంటుంది. అదనపు యాక్సెస్సరీలతో వచ్చిన ఈ గిఫ్ట్ బాక్స్ వేరియంట్ ధర కాస్త ఎక్కువగానే ఉంది. ప్రస్తుతానికి ఇది చైనాలోనే అందుబాటులో ఉంది, మన దేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తారనేది షావోమీ ఇంకా ప్రకటించలేదు.

Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

Tags

Related News

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

Big Stories

Advertisement
×