Trending Mobiles in jan 2026: కొత్త ఏడాది ప్రారంభమైన మొదటి నెలలో చాలామంది కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటారు. ఏలాంటి మొబైల్ కొనాలి? ఏ బ్రాండ్ ఫోన్ కొంటే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది? ఇలా చాలా సందేహాలు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో 2026 జనవరిలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఫోన్లలో Oppo Reno15 సిరీస్, OnePlus 15R/ Turbo, Realme 16 Pro సిరీస్, అలాగే Vivo X300 Pro వంటి హై-ఎండ్ ఫోన్లు ఇప్పటికే విడుదల కాగా.. iQOO 15తో పాటు అత్యాధునిక ఫోల్డబుల్స్, శాంసంగ్ S25/S26 స్మార్ట్‌ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ కింది ఫోన్లను ఓసారి పరిశీలించండి.
ప్రముఖ Oppo సంస్థ తన కొత్త Reno 15 Series 5Gని తాజాగా ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. దీనిలో 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. Oppo Reno 15, Oppo Reno 15 Pro, Oppo Reno 15 Pro Mini, Oppo Reno 15C పేర్ల మీద లాంచ్ చేసింది. అయితే ఒప్పో రెనో సిరీస్‌లో కొత్తగా Mini పేరిట కొత్త మోడల్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ Android – 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
OnePlus 15R, టర్బో సిరీస్‌లో భాగంగా విడుదలైన గేమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 165Hz డిస్‌ప్లే, భారీ 7,400mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, OxygenOS 16 మీద రన్ అవుతుంది. ఈ సిరీస్ ఫోన్ అద్భుతమైన పనితీరు, గేమింగ్, మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
చైనాకు చెందిన ప్రముఖ రియల్‌మీ భారతదేశంలో తన Realme 16 Pro సిరీస్‌ను జనవరి 6న లాంచ్ చేసింది. దీనిలో భాగంగా Realme 16 Pro, Realme 16 Pro Plus అనే రెండు శక్తివంతమైన మోడల్స్‌ను సంస్థ పరియం చేసింది. ఈ ఫోన్లు ముఖ్యంగా గేమింగ్ లవర్స్, ఫొటోగ్రఫీ ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రీమియం మిడ్‌రేంజ్ సెక్షన్లో అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో మంచి పోటీని ఇస్తున్నాయి.
చైనా టెక్ దిగ్గజం వివో ఎక్స్300 సిరీస్‌లో భాగంగా రెండు స్మార్ట్‌ఫోన్లను ఆల్రెడీ లాంచ్ చేసింది. గతేడాది అక్టోబరులో ఈ ఫోన్లను చైనాలో విడుదల చేయగా.. డిసెంబరులో భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Vivo X300, X300 Pro పేర్లతో రెండు మోడల్స్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా కెమెరా ప్రియులే లక్ష్యంగా తీసుకొచ్చిన బెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఇవే.
Vivo అనుబంధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO తన ఫ్లాగ్‌షిప్ మోడల్ iQOO 15ను గతేడాది చివరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ క్వాల్‌కామ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్5 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 7000mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ హ్యాండ్ సెట్ 2k డిస్‌ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. iQOO 15 ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఫోన్లలో లిస్ట్ అయ్యింది.
ఈ నెల చివరి కల్లా శాంంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, S26 Plus, S26 Ultra ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ S26 Ultraలో కెమెరా సెక్షన్ యూజర్లను ఆకట్టుకోనుంది. అప్డేటెడ్ సెన్సార్ వల్ల నైట్ ఫొటోలు చాలా స్పష్టంగా రావడం, వీడియో రికార్డింగ్‌లో స్టెబిలిటీ మెరుగవడం వంటివి కనిపించొచ్చు. సుమారు 5500mAh వరకు బ్యాటరీ లైఫ్‌తో రానుంది. ఈ సరికొత్త శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే.. ఈ నెల చివరి వరకు వేచి ఉండటం ఉత్తమం.