E-Paper
Advertisement

Trending Smartwatches Jan 2026: స్మార్ట్‌వాచ్ అంటే ఇలా ఉండాలి ! 2026 మోస్ట్ ట్రెండింగ్ మోడల్స్ మీ కోసం

Trending Smartwatches Jan 2026: స్మార్ట్‌వాచ్ అంటే ఇలా ఉండాలి ! 2026 మోస్ట్ ట్రెండింగ్ మోడల్స్ మీ కోసం
Advertisement

Trending Smartwatches Jan 2026: జనవరి 2026 నాటికి స్మార్ట్‌వాచ్‌ల ప్రపంచం సరికొత్త మోడల్స్‌తో ఉరకలేస్తోంది. గతంలో కేవలం ఫిట్‌నెస్ ట్రాకర్లుగా మాత్రమే ఉన్న ఈ వాచ్ లలో, ఇప్పుడు ఏఐ ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ , అత్యాధునిక హెల్త్ మానిటరింగ్ టూల్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. యాపిల్, శామ్‌సంగ్ వంటి ప్రీమియం బ్రాండ్ల నుంచి నాయిస్, బోట్ వంటి బడ్జెట్ బ్రాండ్ల వరకు ప్రతి బ్రాండ్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుత ట్రెండ్‌లో ఉన్న టాప్ స్మార్ట్‌వాచ్‌ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

2026లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ స్మార్ట్‌వాచ్‌లు:

1.Apple Watch Series 11 & Ultra 3: ఐఫోన్ వాడేవారికి ‘యాపిల్ వాచ్ సిరీస్ 11’ ఫస్ట్ ఆప్షన్. ఇందులో గతం కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ , 5G కనెక్టివిటీ ఉన్నాయి. ‘అల్ట్రా 3’ మోడల్ 3000-నిట్స్ బ్రైట్‌నెస్‌తో, టైటానియం బాడీతో ఈ వాచ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Advertisement

2. Samsung Galaxy Watch 8 & 8 Classic: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం శామ్‌సంగ్ తీసుకువచ్చిన ఈ వాచ్‌లలో ఏఐ రన్నింగ్ కోచ్, ‘యాంటీ ఆక్సిడెంట్ ఇండెక్స్’ వంటి కొత్త హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి. గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ మోడల్‌లో పాతకాలపు ‘రొటేటింగ్ బెజెల్’ మళ్ళీ తిరిగి రావడం విశేషం. ఇది వేర్ ఓఎస్ (Wear OS 6) పై పనిచేస్తుంది.

3. Google Pixel Watch 4: గూగుల్ తన ఫిట్‌బిట్ (Fitbit) ఇంటిగ్రేషన్‌ను ఇందులో మరింత మెరుగు పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే.. దీని ఎలిగెంట్ డిజైన్, గూగుల్ సర్వీసులతో సులభంగా కనెక్ట్ కావడం వల్ల ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులను ఇది బాగా ఆకట్టుకుంటోంది. ఇది ఇ రిపేర్ చేయడానికి కూడా చాలా అనుకూలంగ ఉంటుంది.

4.OnePlus Watch 3 & Garmin Venu X1: వన్ ప్లస్ వాచ్ బ్యాటరీ విషయంలో రికార్డు సృష్టిస్తోంది (సుమారు 120 గంటలు). ఇక ప్రొఫెషనల్ అథ్లెట్ల కోసం ఇద స్పోర్ట్స్ ట్రాకింగ్‌ను అందిస్తోంది. అంతే కాకుండా ఇది చూడటానికి ట్రెండీ లుక్ అందిస్తుంది.

Also Read: స్మార్ట్ వాచ్‌లోనే ఇయర్ బడ్స్, రొటేటింగ్ కెమెరా.. ఇక ఫోన్‌తో పనేలేదు !

5. Noise & boAt: ఈ బ్రాండ్లు రూ. 5,000 లోపే అమోలెడ్ (AMOLED) డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, SpO2 మానిటర్ల వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేలా వీటి డిజైన్లు స్టైలిష్‌గా ఉంటున్నాయి.

6. CMF by Nothing Watch Pro 2: నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ వాచ్ 11 రోజుల బ్యాటరీ లైఫ్ , బిల్ట్-ఇన్ GPSతో తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని ఇస్తోంది. దీని ధరకూడా తక్కువగానే ఉంటుంది.

మీరు స్మార్ట్‌ వాచ్ కొనేటప్పుడు మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (iOS లేదా Android), మీకు కావాల్సిన ఫీచర్లు (GPS, ECG, లేదా కేవలం నోటిఫికేషన్లు), మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. 2026లో వస్తున్న వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికే కాదు.. మీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యక్తిగత సహాయకుడిలా పనిచేస్తున్నాయి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×