E-Paper
Advertisement

NovaWatch Smartwatch:స్మార్ట్ వాచ్‌లోనే ఇయర్ బడ్స్, రొటేటింగ్ కెమెరా.. ఇక ఫోన్‌తో పనేలేదు !

NovaWatch Smartwatch:స్మార్ట్ వాచ్‌లోనే ఇయర్ బడ్స్, రొటేటింగ్ కెమెరా.. ఇక ఫోన్‌తో పనేలేదు !
Advertisement

NovaWatch Smartwatch: టెక్ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న Ai+ (ఏఐ ప్లస్) సంస్థ తాజాగా ఇండియాలో తన సరికొత్త స్మార్ట్‌వాచ్ సిరీస్నోవావాచ్‘ (NovaWatch) ను ఆవిష్కరించింది. కేవలం ఒకే మోడల్‌తో కాకుండా.. వివిధ అవసరాలకు తగ్గట్టుగా నాలుగు విభిన్న మోడళ్లను పరిచయం చేసింది. ఈ సిరీస్ లోని మోడల్స్, వాటి ప్రత్యేకతలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

NovaWatch సిరీస్‌లోని 4 ప్రధాన మోడల్స్:

1. NovaWatch Active (నోవావాచ్ యాక్టివ్): ఇది అందరికీ ఉపయోగపడే కామన్ మోడల్. ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం దీనిని రూపొందించారు. గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర, వాకింగ్ వంటి ముఖ్యమైన ఆరోగ్య విషయాలను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఇది చేతికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

2. NovaWatch Wearbuds (నోవావాచ్ వేర్‌బడ్స్): సిరీస్‌లో ఇది చాలా విభిన్నమైన మోడల్. ఈ వాచ్‌ లోనే బ్లూ టూత్ ఇయర్ బడ్స్ కూడా ఉంటాయి. అంటే మీరు విడిగా ఇయర్ ఫోన్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పాటలు వినాలన్నా.. కాల్స్ మాట్లాడాలన్నా వాచ్‌లో ఉన్న బడ్స్ తీసి వాడుకోవచ్చు. ఇది ఇంత వరకు ఏ స్మార్ట్ ఫోన్ లో లేని ఆప్షన్.

3. Kids Geo-Fencing 4G Watch (కిడ్స్ జియో-ఫెన్సింగ్): పిల్లల భద్రతే లక్ష్యంగా దీనిని తయారు చేశారు. ఇందులో 4 జీ కనెక్టివిటీ ఉండటం వల్ల పిల్లలు స్మార్ట్‌ ఫోన్ లేకుండానే తల్లి దండ్రులతో మాట్లాడవచ్చు. ముఖ్యంగాజియో-ఫెన్సింగ్ఫీచర్ ద్వారా పిల్లలు ఒక నిర్దిష్ట పరిధి దాటి బయటకు వెళ్తే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ అందుతుంది. దీని వల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు.

4. Rotatecam 4G (రొటేట్ క్యామ్ 4G): ట్రెండ్ కు తగ్గట్టు ఆలోచించే యువత కోసం ఇందులోరొటేటింగ్ కెమెరా’ ఉంటుంది. అంటే మీరు మీ వాచ్ నుంచే ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఇది ఒక గొప్ప ఫీచర్.

Also Read: స్మార్ట్‌వాచ్.. మీ ఆరోగ్య నేస్తమా? లేక ఏకాగ్రతను చెడగొట్టే శత్రువా ?

ముఖ్యమైన ఫీచర్లు :

హెల్త్ ట్రాకింగ్: అన్ని మోడళ్లలో అధునాతన సెన్సార్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తాయి.

LTE కనెక్టివిటీ: ఇందులో 4జీ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ దగ్గర లేకపోయినా కాల్స్ , మెసేజ్‌లు కూడా చేసుకోవచ్చు.

ఫ్యాషన్ , స్టైల్: ఈ వాచ్‌లు కేవలం టెక్నాలజీ కోసమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండేలా రూపొందించారు. ఇవి మీకు ట్రెండీ లుక్ అందిస్తాయి.

యాప్ సపోర్ట్: Ai+ యొక్క ప్రత్యేక మైన యాప్ ద్వారా మీ డేటా మొత్తాన్ని ఫోన్‌లో కూడా చూసుకోవచ్చు.

ధర:

ప్రస్తుతానికిమోడళ్లను ప్రదర్శించిన Ai+, వీటి ధరలకు సబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనుంది. మరో 3 నెలల్లో ఇవి ఫ్లిప్ కార్ట్ ,ఇతర ప్రధాన స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 7 వేల నుంచి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×