E-Paper
Advertisement

APAAR ID Apply Online: అపార్ ఐడీతో అన్ని సర్టిఫికెట్లు ఒకేచోట.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ప్రయోజనాలు ఇవే

APAAR ID Apply Online: అపార్ ఐడీతో అన్ని సర్టిఫికెట్లు ఒకేచోట.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ప్రయోజనాలు ఇవే
Advertisement

APAAR ID Apply Online: బోర్డు ఎగ్జామ్స్, ఎంట్రన్స్ పరీక్షలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్లు… ఇలా ప్రతిదానికి APAAR ID అడుగుతున్నారు. వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం 12 అంకెల APAAR IDని తీసుకొచ్చింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ID అంటే విద్యార్థులకు సంబంధించిన అన్ని విద్యా సర్టిఫికెట్లు, సాధించిన రికార్డులను ప్రదర్శించే కంబైన్డ్ డేటా. ఈ ఐడీ దరఖాస్తు చేసే ముందు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE+)లో రిజిస్టర్ చేసుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత మీకు 12-అంకెల అపార్ నంబర్‌ను కేటాయిస్తారు. ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలకు అపార్ ఐడీ ఉపయోగపడుతుంది. సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ కు అపార్ ఐడీ తప్పనిసరి చేసింది. అపార్ ఐడీ కూడా ఆధార్ లాగా విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ.

అపార్ ఐడీ ప్రయోజనాలు

అపార్ ఐడీలో విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు మెయింటెయిన్‌ వ్యవస్థ. ఉదాహరణకు, మీకు APAAR ID ఉంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, మార్క్‌షీట్‌లు ఇతర రికార్డులను ఫిజికల్ గా తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఎక్కడైనా ఈ సర్టిఫికెట్లు సమర్పించాల్సి వస్తే 12 అంకెల APAAR ID నంబర్‌ను ఇస్తే సరిపోతుంది. ఉన్నత విద్యా సంస్థలు లేదా అధికారులు మీ ఎడ్యుకేషన్ రికార్డులను డిజిటల్‌గా యాక్సెస్ చేయగలరు.

Advertisement

అపార్ ఐడీ ఉండడం వల్ల ఫేక్ సర్టిఫికెట్ల సమస్యను తగ్గుతుంది. విద్యార్థి సర్టిఫికెట్లను ఈజీగా యాక్సెస్ చేయడమే కాకుండా, మోసాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు ఫిజికల్ గా సర్టిఫికెట్ల రికార్డును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి, సర్టిఫికెట్‌లను పోగొట్టుకోవడం, పాడవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల సమయంలో APAAR ID సబ్‌మిట్ చేయవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఉద్యోగ దరఖాస్తులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో జాయిన్ అయ్యే సమయంలో దీనిని చూపించవచ్చు.

అపార్ ఐడీని  క్రియేట్

  • డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ పోర్టల్‌ పై క్లిక్ చేయండి.
  • సైన్ అప్ చేయడానికి మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించండి. మీకు డిజిలాకర్ ఖాతా లేకపోతే, ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత “సెర్చ్ డాక్యుమెంట్స్” లో “APAAR” లేదా “అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • “APAAR/ABC ID కార్డ్” సెలెక్ట్ చేసి మీ విద్యాసంస్థ పేరు, యూనివర్సిటీ, అకడమిక్ ఇయర్ వంటి అవసరమైన వివరాలను యాడ్ చేయండి.
  • వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ వివరాలను ABCతో పంచుకోండి.
  • చివరిగా వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీ APAAR ID కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 అర్హతలు

APAAR ID అప్లై చేసుకోవడానికి ముందుగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+)లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ పేరు UDISE+ యూనిక్ స్టూడెంట్ ఐడెంటిఫైయర్ , ఆధార్ రికార్డులతో ఒకే విధంగా ఉండాలి. APAAR ID కోసం శాశ్వత విద్యా సంఖ్య (PEN) కూడా కలిగి ఉండాలి.

Advertisement

Also Read:  హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 34,125 జీతం, విద్యార్హతలు ఇవే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×