Nokia Smartphone: మొబైల్ ప్రపంచంలో Nokia అనే పేరు ఒక బ్రాండ్ మాత్రమే కాదు, చాలా మందికి నమ్మకంగా మారిన గుర్తింపు. కేవలం కాల్ చేయడమే ప్రధానంగా ఉన్న రోజుల్లో నుంచే కాదు, స్మార్ట్‌ఫోన్ యుగంలోకి వచ్చిన తర్వాత కూడా నోకియా తన ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. బిల్డ్ క్వాలిటీపై శ్రద్ధ, సింపుల్ డిజైన్, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం నోకియా ఫోన్లను ఇతర బ్రాండ్‌లతో పోల్చితే వేరుగా నిలబెడతాయి. అవసరం లేని హైప్ లేకుండా, రోజువారీ వాడకంలో స్థిరమైన అనుభవం ఇవ్వడమే నోకియా అసలు స్టైల్. అలాంటి బ్రాండ్ నుంచి వస్తుందని టాక్ నడుస్తున్న పేరు Nokia 35 5జీ.
డిజైన్ ఎలా ఉంటుందంటే
Nokia 35 5జీ డిజైన్ సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా ఉండొచ్చని వినిపిస్తున్న సమాచారం. గ్లోసీ లుక్‌కు బదులుగా మ్యాట్ ఫినిష్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇలా ఉండటం వల్ల ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుందని, స్లిప్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. బ్యాక్ ప్యానల్‌పై నోకియా లోగో సెంటర్‌లో ఉండటం, కెమెరా మాడ్యూల్ స్క్వేర్ షేప్‌లో ఉండటం లాంటి వివరాలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రేమ్ ప్లాస్టిక్ అయినా రోజువారీ వాడకానికి సరిపడే బలమైన బిల్డ్ క్వాలిటీపై ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్సీ లుక్ కంటే ఉపయోగకరమైన డిజైన్‌నే నోకియా ఎంచుకుందని తెలుస్తుంది.
డిస్‌ప్లే గురించి వినిపిస్తున్నది
Nokia 35 5జీకి 6.6 అంగుళాలు లేదా 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో ఏఎమ్ ఓఎల్ ఈడి డిస్‌ప్లే ఉంటే వీడియోలు చూడడం, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమ్స్ ఆడేటప్పుడు మంచి వ్యూయింగ్ అనుభవం వస్తుందని అంటున్నారు. కొన్ని చోట్ల 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గురించీ వినిపిస్తోంది, దీని వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది.
6000mah బ్యాటరీ గురించి టాక్
Nokia 35 5జీ లో 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉండొచ్చని వినిపిస్తున్నది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 1 రోజు కాదు 2 రోజులు కూడా నడిచే అవకాశం ఉంటుంది. వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం, బ్రౌజింగ్ లాంటి వాడకంలో కూడా బ్యాటరీ టెన్షన్ తక్కువగా ఉంటుంది. నోకియా సాధారణంగా బ్యాటరీ ఆప్టిమైజేషన్‌పై శ్రద్ధ పెడుతుందన్న విషయం ఇక్కడ గుర్తుకు వస్తుంది.
Also Read: Samsung Galaxy A16: రూ.18వేలలోపు బెస్ట్ 5జి ఫోన్ కావాలా.. శామ్‌సంగ్ గెలాక్సీ A16 5G పై ఓ లుక్కేయండి
135 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ గురించి మాటలు
ఈ ఫోన్‌తో పాటు ఎక్కువగా వినిపిస్తున్న అంశం 135 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్. చాలా తక్కువ సమయంలో ఫోన్ చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు చార్జ్ చేస్తే గంటలపాటు వాడొచ్చు. ఈ ఫీచర్ నిజమైతే ఈ సెగ్మెంట్‌లో ఇది పెద్ద ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
120 ఎంపీ లేదా 200 ఎంపీ కెమెరా గురించి సమాచారం
Nokia 35 5జీ కెమెరా విషయానికి వస్తే, 120 ఎంపీ లేదా 200 ఎంపీ కెమెరా ఉండే అవకాశం ఉందని టాక్. నోకియా సాధారణంగా నేచురల్ కలర్స్, స్టేబుల్ అవుట్‌పుట్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి, ఈ కెమెరా సెటప్ ఉంటే ఫోటోగ్రఫీ పరంగా ఆసక్తికరంగా మారవచ్చని అంటున్నారు.
8 జీ బీ 12జీబీ ర్యామ్ పర్‌ఫార్మెన్స్ అంచనాలు
ఈ ఫోన్‌లో 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది. డే టు డే యూజ్, యాప్స్ స్విచింగ్, క్యాజువల్ గేమింగ్ వరకు స్మూత్ అనుభవం ఇవ్వగలదని అంటున్నారు. 5జీ సపోర్ట్ ఉండటం వల్ల ఫాస్ట్ డౌన్‌లోడ్స్, స్ట్రీమింగ్ అనుభవం మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది.
క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం
నోకియా ఫోన్లకు ప్రధాన అట్రాక్షన్ క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవమే. Nokia 35 5జీ కూడా బ్లోట్‌వేర్ లేకుండా సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రావచ్చని వినిపిస్తున్నది. రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్, స్టేబుల్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఉండటం నోకియా ఇమేజ్‌కు సరిపోతుందని చాలామంది భావిస్తున్నారు.
భారతదేశంలో ధర ?
Nokia 35 5జీ ధర విషయంలో 10,999 రూపాయలు, 14,999 రూపాయలు ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ ధర పరిధిలో ఇన్ని ఫీచర్లు వస్తే వినియోగదారుల దృష్టిని ఖచ్చితంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. నోకియా ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారు ఎప్పటిలాగే కంపెనీ నుంచి వచ్చే స్పష్టమైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పొచ్చు.