E-Paper
Advertisement

Naa Anveshana : నా అన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. అరెస్ట్ చెయ్యాలని డిమాండ్..

Naa Anveshana : నా అన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. అరెస్ట్ చెయ్యాలని డిమాండ్..
Advertisement

Naa Anveshana : శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా చర్చనీయంశంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా సామాన్యులు, మహిళలు శివాజీ వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ సమర్థిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ యూట్యూబ్ స్పందించారు. ఆయన ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు. అనసూయకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో పై హిందు సంఘాలు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అరెస్ట్ చెయ్యాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై జనాల రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

నా అన్వేష్ పై హిందువులు ఆగ్రహం..

దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొంతమంది ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే కానీ కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ శివాజీకి మద్దతు తెలుపుతున్నారు..తాజాగా ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ కూడా ఈ వివాదం పై స్పందించారు.. శివాజీది తప్పు అంటూ ఆయన చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో శివాజీ గురించి మాట్లాడడంతో పాటుగా హిందూ దేవుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలని కొందరు హిందువులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు అంటూ హిందూ సంఘాల సభ్యులు మండిపడుతున్నారు.. ఇండియాలో పుట్టి పెరిగి విదేశాల్లో వీడియోలు చేసుకుంటూ బతికే నువ్వు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ కొందరు ఆయనను దారుణంగా తిడుతున్నారు.. ఇలాంటి వాడిని మన హిందూ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.. ఈ వ్యక్తిని ఒకప్పుడు సపోర్ట్ చేశాము కానీ ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాము అంటూ కొందరు నెటిజన్లు ఆ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి నా అన్వేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాల సభ్యులు వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు..

Advertisement

Also Read :ముందు సంక్రాంతి ఉన్నా.. ఈవారం థియేటర్లలోకి ఇన్ని సినిమాలా?

నా అన్వేష్ పై పోలీస్ కేసులు.. 

ప్రముఖ యూట్యూబ్ నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగే వాటిని చూపిస్తూ జనాలని బాగా ఆకట్టుకున్నాడు. యాత్రికుడిగా ముద్ర వేసుకున్న అన్వేష్ ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈమధ్య అతను చేస్తున్న వీడియోలు మాట్లాడుతున్న మాటలు జనాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అమ్మాయిలతో ఎలా ఉండాలి అన్న విషయాల గురించి ఎన్నో వీడియోలలో చెప్పినా అన్వేష్.. ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలను తప్పు పడుతూ చేసిన వీడియో మాత్రం జనాలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. హిందూ దేవుళ్ళపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫిర్యాదుల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×