E-Paper
Advertisement

Telangana Assembly: కేసీఆర్‌‌తో మాట్లాడిన సీఎం రేవంత్.. అటెండెన్స్ తర్వాత బయటకు! చిక్కిన కేటీఆర్

Telangana Assembly: కేసీఆర్‌‌తో మాట్లాడిన సీఎం రేవంత్.. అటెండెన్స్ తర్వాత బయటకు! చిక్కిన కేటీఆర్
Advertisement

Telangana Assembly winter sessions-2025 live:  తెలంగాణ అసెంబ్లీలో తొలిరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  సోమవారం ఉదయం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత  జాతీయగీతం పూర్తి కాగానే ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వెళ్లారు.

ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసు కున్నారు. పలువురు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు  ఆయనకు అభివాదం చేశారు. చివరకు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు కేసీఆర్.

Advertisement

కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తుండడంతో సభలో సభ్యులు గౌరవం ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు లేచి నిలబడగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అమర్యాదగా కూర్చుని ఉన్న వైనం బయటపడింది.  వారిలో ఒకరు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మరొకరు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ఇద్దరు సభ్యులు సీట్లలో కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి తన పదవిని పక్కన పెట్టి కేసీఆర్ బాగోగులు అడిగి తెలుసుకుంటే, ఆయన కొడుకు సభ మర్యాదని పాటించలేదంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు.  ఇదేనా సభ మర్యాద అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

సభ నుంచి నేరుగా తన ఛాంబర్‌కి వెళ్లిపోయారు మాజీ సీఎం. ప్రతిపక్షంలో కూర్చోవడం ఇష్టంలేక కేసీఆర్ పోయినట్టు తెలుస్తోంది. ఇటీవల మరణించిన దివంగత సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌రెడ్డికి సంతాపం తెలిపింది అసెంబ్లీ.  సభలో కీలక పత్రాలు ప్రవేశపెట్టింది.

ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. చెక్ డ్యామ్‌‌లను బాంబులు పెట్టి పేల్చారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ ఇచ్చారు. సభలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం నిజంగా సిగ్గు చేటని అన్నారు. సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని రికార్డుల్లో నుంచి తొలగించాలన్నారు. సభ్యలో సభ్యులు సరైన భాష మాట్లాడాలని సూచన చేశారు.

అటు నియోజకవర్గంలో పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. మరోవైపు తెలంగాణ శాసనమండలి ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడింది. జనవరి 2కు సమావేశాలను వాయిదా వేసినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం.

 

 

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×