E-Paper
Advertisement

కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చింగా? మేలో ధుమ్ ధామ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యమే!

కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చింగా? మేలో ధుమ్ ధామ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యమే!
Advertisement

Upcoming Smart TVs: ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలకు చెందిన ఎన్నో అధునాతన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2026 ఏడాదికి గాను ఇప్పటికే చాలా కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేశాయి. అయితే మే నెలలోనూ ప్రముఖ కంపెనీలకు చెందిన అత్యాధునిక టీవీలు అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి కొత్తగా స్మార్ట్ టీవీ కొనాలని భావిస్తున్న వారికి మే నెలలో పండుగే అని చెప్పవచ్చు. ఇంతకీ మేలో రాబోయే టీవీలు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లు ఏంటి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షావోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్

ఈ స్మార్ట్ టీవీ సిరీస్ లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోసం క్యూడీ మినీ ఎల్ఈడీ (QD Mini LED) టెక్నాలజీని ఉపయోగించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఆడియో విషయానికి వస్తే డాల్బీ ఆడియో, డీటీఎస్-ఎక్స్ సపోర్ట్ కలిగిన 34W స్పీకర్ ను దీనికి అందించారు. ఇది గూగుల్ టీవీ ఆధారిత పాచ్ వాల్ ఇంటర్ ఫేస్ సాఫ్ట్ వేర్ తో పనిచేయనుంది.

లుమియో విజన్ 9 సిరీస్

Advertisement

భారత మార్కెట్లోకి రాబోతున్న అత్యంత వేగవంతమైన స్మార్ట్ టీవీల్లో ఒకటిగా ఇది నిలుస్తోంది. 4K రిజల్యూషన్ స్క్రీన్, మిడియా టెక్ పాంటోనిక్ 700 చిప్ సెట్ దీనికి అమర్చారు. 3GB ర్యామ్ తో ఇది రానుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన 50W హెక్సా డ్రైవర్ ఆడియో వ్యవస్థను దీనికి అందించారు.

శాంసంగ్ 2026 OLED లైనప్..

కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్.. తన ఏఐ ఫీచర్లతో లేటెస్ట్ OLED టీవీలను మరింత పవర్ ఫుల్ గా మార్చేసింది. ఎల్95హెచ్, ఎస్90హెచ్ మోడళ్లలో ఎన్ క్యూ4 ఏఐ జెన్ 3 ప్రాసెసర్ ను అమర్చారు. దీనిలోని గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ.. వెలుతురు ఎక్కువగా ఉన్న గదుల్లోనూ స్పష్టంగా చిత్రాలను చూపించగలదు.

ఎల్జీ క్యూఎన్ఈడీ 2026 మోడల్స్

Advertisement

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఎల్జీ.. తన క్యూఎన్ఈడీ సిరీస్ లో మినీ ఎల్ఈడీ, క్వాంటం డాట్ టెక్నాలజీని సంయుక్తంగా అందిస్తోంది. ఇది సరికొత్త వెబ్ఓస్ 25 (webOS 25) ఆపరేటింగ్ సిస్టమ్ పై వర్క్ చేయనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ను దీనికి అందించారు. అలాగే అత్యాధునిక HDMI 2.1 పోర్ట్‌లతో ఇది రాబోతోంది. గేమింగ్ ప్రియులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది.

Also Read: ఇన్వర్టర్‌ బ్యాటరీలో ఎలా పడితే అలా నీరు పోస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

తుషిబా 5050 సిరీస్..

మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని తుషిబా ఈ సరికొత్త 4K ఎల్ఈడీ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. 4K అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, డాల్బీ విజన్ హెచ్ డీఆర్ సపోర్ట్, వీఐడీఏఏ ఓఎస్ ను ఇది కలిగి ఉంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ యాప్ లకు సపోర్ట్ చేస్తుంది. దీనికి 30W పవర్ ఫుల్ స్పీకర్ సెటప్ ను అందించారు. అంతేకాకుండా రిమోట్ నౌ (Remote Now) యాప్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారానే ఈ టీవీని కంట్రోల్ చేయవచ్చు.

Also Read: మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!

Related News

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

Big Stories

Advertisement
×