E-Paper
Advertisement

మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!

మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!
Advertisement

Upcoming Coolers in May 2026: వేసవిలో కూలర్లకు ఉండే డిమాండ్ దృష్ట్యా.. ప్రముఖ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు కలిగిన మోడల్స్ ను విడుదల చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మే నెల చివరి నాటికి అడ్వాన్స్డ్ ఫీచర్లు కలిగిన సరికొత్త కూలర్లు మార్కెట్ లో విడుదల కానున్నాయి. ఇంతకీ అవి ఏంటి? వాటిలోని ప్రధాన ఫీచర్లు? ఈ కథనంలో పరిశీలిద్దాం.

సింఫనీ జంబో 200 ఎక్స్

సింఫనీ కంపెనీకి చెందిన ఈ కూలర్ 200 లీటర్ల భారీ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇది పెద్ద గదులకు లేదా పంక్షన్ హాల్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 3 సైడ్ హానీకోంబ్ ప్యాడ్స్, సీఎఫ్ డీ టెక్నాలజీ, పవర్ ఫుల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఇన్వర్టర్ సపోర్ట్, లాక్ చేయగల వీల్స్ ను కలిగి ఉంది.

సింఫనీ ఇవాన్, సింగమ్ మోడల్స్

Advertisement

ఈ కూలర్లు సింఫనీ నుంచి రాబోతున్న అధునాతన మోడల్స్. 70-100 లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన ఈ కూలర్లు.. పెద్ద గదులకు సరిగ్గా సరిపోతాయి. ఇందులో హైస్పీడ్ ఫ్యాన్, ఐస్ చాంబర్, రిమోట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

బర్లీ బ్రీజా 100ఎల్

అధిక వాటర్ ట్యాంక్ సామర్థ్యం ఉన్న పవర్ ఫుల్ కూలర్ ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది 100 లీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండి.. 45 అడుగుల దూరం వరకూ గాలిని సమర్థవంతంగా ప్రసారం (Air Throw) చేయగలదు. గదిలోని తేమను నియంత్రించగల ‘హ్యుమిడిటీ కంట్రోల్’ ఫీచర్ ఇందులో ఉంది. అలాగే దోమలు, ఈగలు వంటివి లోపలికి వెళ్లకుండా మస్కిటో నెట్ (Mosquito Net) ఫిల్టర్లు దీనికి అమర్చారు.

సింఫనీ డైట్ 50టీ

Advertisement

50 లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ సింఫనీ కూలర్.. చిన్న లేదా మధ్యస్థంగా ఉన్న గదులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని ఐ ప్యూర్ టెక్నాలజీ.. దుమ్ము, దూళి, బ్యాక్టీరియా, అలర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇక ఇది స్లిమ్, కాంపాక్ట్ డిజైన్ ను కలిగి ఉంటూ.. ఇంట్లో ఏ మూలనైనా ఫిట్ అయిపోతుంది. పైగా తక్కువ విద్యుత్ ను మాత్రమే వినియోగించుకుంటూ పవర్ బిల్లును సైతం ఆదా చేస్తుంది.

Also Read: కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!

హవెల్స్ వెలో ఐ

అత్యాధునిక ఫీచర్లు కలిగిన మోడరన్ కూలర్ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 45 లీటర్ల వాటర్ సామర్థ్యం, ఎలక్ట్రానిక్ ప్యానెల్, రిమోట్ కంట్రోల్, ట్యాంక్ లో నీరు తక్కువగా ఉన్నప్పుడు అలారం మోగడం, బ్యాక్టీరియా షీల్డ్ కలిగిన హోనికోంబ్ ప్యాడ్స్ వంటి ఫీచర్లను ఈ హవెల్స్ కూలర్ కలిగి ఉంది.

Also Read: Flipkart Offers: ఏంది మామ ఇది.. Carrier 1.5 Ton ఏసీ.. ఇంత చౌకగా ఇచ్చేస్తున్నారు!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×