E-Paper
Advertisement

గ్యాంగ్‌టక్‌లో మోదీ గోల్.. ఫుట్‌బాల్ ఆడుతూ అలరించిన ప్రధాని

గ్యాంగ్‌టక్‌లో మోదీ గోల్.. ఫుట్‌బాల్ ఆడుతూ అలరించిన ప్రధాని
Advertisement

PM Modi: సిక్కిం రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక యువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను పంచుకున్నారు. బ్లూ కలర్ స్పోర్ట్స్ జాకెట్ ధరించిన ప్రధాని మైదానంలో గోల్ కొట్టడం ఆపై యువ ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. గ్యాంగ్‌టక్‌లో ఆహ్లాదకరమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. యువతలో ఉన్న ఉత్సాహం తనకు కూడా ఎనర్జీని ఇచ్చిందని ప్రధాని తన పోస్ట్‌లో రాశారు.

అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అత్యంత సాధారణంగా క్రీడాకారులతో మమేకమవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్లతో హై-ఫైవ్ ఇస్తూ వారిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 4,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సిక్కిం సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు.

Advertisement

ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు రవాణా ఆరోగ్యం విద్య విద్యుత్ వంటి కీలక రంగాలకు సంబంధించినవి. పట్టణాభివృద్ధి పర్యావరణం పర్యాటక రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. సిక్కిం గోల్డెన్ జూబ్లీ ఏడాదిలో ప్రధాని పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోయింది. హిమాలయ రాష్ట్రం స్థిరమైన అభివృద్ధి పథంలో సాగడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ పర్యటన ద్వారా సిక్కిం ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మరోసారి చాటుకున్నారు.

Advertisement

Read Also: మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×