E-Paper
Advertisement

Upcoming Smartphones Jan 2026: శామ్‌సంగ్ ఎస్26 నుంచి ఐఫోన్ ఎస్ఈ 4 వరకు.. జనవరిలో లాంచ్ అయ్యే ఫోన్ల లిస్ట్

Upcoming Smartphones Jan 2026: శామ్‌సంగ్ ఎస్26 నుంచి ఐఫోన్ ఎస్ఈ 4 వరకు.. జనవరిలో లాంచ్ అయ్యే ఫోన్ల లిస్ట్
Advertisement

Upcoming Smartphones Jan 2026: జనవరి అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు టెక్ ప్రపంచంలో మరో కొత్త రౌండ్ స్టార్ట్ అయ్యే టైమ్ కూడా. ప్రతి సంవత్సరం ఆరంభంలోనే పెద్ద బ్రాండ్స్ తమ కొత్త ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తాయి. ఈసారి జనవరి 2026 మరింత స్పెషల్ ఎందుకంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ నుంచి మిడ్ రేంజ్ ఫోన్‌ వరకూ చాలానే కొత్త ఫోన్లు రాబోతున్నాయి. డిజైన్‌లో అప్‌డేటెడ్ లుక్, కెమెరాలో కొత్త సెన్సర్లు, బ్యాటరీలో ఎక్కువ బ్యాకప్, చార్జింగ్‌లో హై స్పీడ్ అన్నీ కలిపి ఈ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో ఫోన్‌ గురించి విడిగా చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ – ధర 90,000 నుంచి 1,10,000

Advertisement

శామ్‌సంగ్ ప్రతి సంవత్సరం ఆరంభంలోనే తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను తీసుకువస్తుంది. 2026 జనవరిలో వచ్చే గెలాక్సీ S26 సిరీస్ కూడా అదే ట్రాక్ ఫాలో అవుతుంది. ఈ ఫోన్‌లో కొత్త జనరేషన్ ప్రాసెసర్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి పర్‌ఫార్మెన్స్ పరంగా పెద్ద అప్‌గ్రేడ్ కనిపిస్తుంది. కెమెరా విషయంలో 200 మెగాపిక్సెల్ సెన్సర్‌తో మెరుగైన నైట్ ఫోటోగ్రఫీ ఇవ్వాలని శామ్‌సంగ్ చూస్తోంది. బ్యాటరీ సైడ్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో ఒక రోజు తగినంత బ్యాకప్ ఇస్తుందని అంచనా. చార్జింగ్ స్పీడ్ కూడా గతంతో పోలిస్తే ఫాస్ట్‌గా ఉంటుంది. ఇండియాలో ధర సుమారు 90,000 నుంచి 1,10,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్ ఎస్ఈ 4 (2026 ఎడిషన్) – ధర 45,000 నుంచి 50,000

Advertisement

యాపిల్ నుంచి జనవరి 2026లో చర్చకు వచ్చే ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 4. ఇది ఫ్లాగ్‌షిప్ కాదు కానీ యాపిల్ అనుభవం తక్కువ ధరలో కావాలనుకునే వాళ్ల కోసం. ఈ పోన్‌లో కొత్త A సిరీస్ చిప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి డేలీ యూజ్ స్పీడ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కెమెరా సింగిల్ సెన్సర్ అయినా ఫోటో క్వాలిటీ యాపిల్ స్టాండర్డ్‌లో ఉంటుంది. బ్యాటరీ పెద్దది కాకపోయినా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల ఒక రోజు ఈజీగా నడుస్తుంది. ఇండియా ధర సుమారు 45,000 నుంచి 50,000 మధ్య ఉండొచ్చని అంచనా.

Also Read: Smartphones for Students: స్టూడెంట్స్ ఫేవరెట్ ఫోన్స్.. 2025లో కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా కొన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

వన్‌ప్లస్ 14 – ధర 70,000 నుంచి 80,000

వన్‌ప్లస్ జనవరి 2026లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 14ని గ్లోబల్‌గా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా మరింత ప్రీమియం ఫీల్ ఇస్తుంది. డిస్ప్లే సైడ్ అమోలెడ్ ప్యానెల్‌తో హై రిఫ్రెష్ రేట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కెమెరాలో హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో నేచురల్ కలర్స్ కనిపిస్తాయి. బ్యాటరీ సుమారు 5200 ఎంఏహెచ్ ఉండొచ్చు చార్జింగ్ స్పీడ్ 100 వాట్స్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఇండియాలో ధర సుమారు 70,000 నుంచి 80,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

షావోమీ 16 – ధర 40,000 నుంచి 45,000

షావోమీ 16 జనవరి 2026లో మిడ్ రేంజ్ కస్టమర్లను టార్గెట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ కెమెరా సెన్సర్ ఇవ్వాలని షావోమీ ప్లాన్ చేస్తోంది. డిస్ప్లే పెద్ద సైజ్‌లో ఉంటుంది కాబట్టి వీడియో స్ట్రీమింగ్‌కు బాగా సూట్ అవుతుంది. బ్యాటరీ సుమారు 5500 ఎంఏహెచ్ కెపాసిటీతో లాంగ్ బ్యాకప్ ఇస్తుంది. చార్జింగ్ స్పీడ్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి రోజువారీ యూజ్‌లో టైమ్ సేవ్ అవుతుంది. ఇండియాలో ధర సుమారు 40,000 నుంచి 45,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

వివో X110 – ధర 60,000 నుంచి 70,000

వివో నుంచి వచ్చే X110 సిరీస్ జనవరి 2026లో కెమెరా లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌లో జైస్ ట్యూనింగ్‌తో అడ్వాన్స్ కెమెరా సెట్‌అప్ ఇవ్వే అవకాశం ఉంది. పోట్రైట్ ఫోటోగ్రఫీ ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్‌గా ఉంటుంది. బ్యాటరీ సైడ్ 5000 ఎంఏహెచ్ దాకా ఉండొచ్చు చార్జింగ్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. డిజైన్‌లో స్లిమ్ బాడీ ఉండటం వల్ల చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వస్తుంది. ఇండియాలో ధర సుమారు 60,000 నుంచి 70,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

2026లో ఏది బెస్ట్ ఫోన్ అంటే

జనవరి 2026లో వచ్చే ఫోన్ అన్ని రేంజ్‌లను కవర్ చేస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలంటే సామ్‌సంగ్ ఎస్26 సిరీస్ లేదా వన్‌ప్లస్ 14 వైపు చూడొచ్చు. యాపిల్ ఎకోసిస్టమ్ తక్కువ ధరలో కావాలంటే ఐఫోన్ ఎస్ఈ 4 సరైన ఎంపిక. మిడ్ రేంజ్‌లో షావోమీ 16 బాగా ఆకట్టుకుంటుంది. కెమెరా ప్రాధాన్యం ఎక్కువైతే వివో ఎక్స్110 మంచి ఆప్షన్ అవుతుంది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఈ ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో 2026 స్టార్ట్ నుంచే ఫోన్ మార్కెట్ హీట్ పెరగడం ఖాయం.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×