E-Paper
Advertisement

CM Chandrababu: 1998లో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్‌ను తీసుకొచ్చాం: చంద్రబాబు

CM Chandrababu: 1998లో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్‌ను తీసుకొచ్చాం: చంద్రబాబు

CM Chandrababu: రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతికతలో ముందుకు నడిపించడమే లక్ష్యంగా.. ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. టెక్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడారు.

క్యూబిట్, వైసర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి రాష్ట్రంలో.. తొలిసారిగా క్వాంటమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్టర్ కావడం విశేషం. ఇది రాష్ట్ర యువతలో క్వాంటమ్ టెక్నాలజీపై ఉన్న ఆసక్తిని, భవిష్యత్తు సాంకేతికత వైపు వారు దృష్టి సారిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని మార్చబోతున్నాయని స్పష్టం చేశారు. 30 ఏళ్ల క్రితమే నేను ఐటీ రంగ ప్రాధాన్యతను గుర్తించి విజన్ ప్రకటించాను. 1995లోనే ఐటీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఇవాళ ఐటీ రంగమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీలపై నా విజన్‌ను మీ ముందుంచుతున్నాను అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయుల డామినేషన్ ఉంది. ఇండియన్ ఐటీ కంపెనీలే రాణిస్తున్నాయి. ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో కనీసం ఒకరు భారతీయుడే. భారత్‌లో అయితే 33 శాతం ఐటీ నిపుణులు తెలుగు వాళ్లే అని గర్వంగా తెలిపారు.

ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంలో తాను సాధించిన విజయాలను సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు రప్పించిన ఘనతను ప్రస్తావిస్తూ, అప్పట్లో గూగుల్ ఒక స్టార్టప్ మాత్రమే. కానీ తర్వాత కాలంలో గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలను కూడా తీసుకురాగలిగాం అని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్రానికి దక్కిన గొప్ప అవకాశమని వివరించారు.

ఇప్పటి ప్రపంచం మొత్తం క్వాంటమ్ గురించే ఆలోచిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆరోగ్యం, రక్షణ, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని వివరించారు. ఈ రంగంలో ముందుగానే నైపుణ్యం సాధిస్తే యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని సూచించారు.

Also Read: భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శనం

విద్యార్థులు కేవలం డిగ్రీలు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా.. ఇన్నోవేషన్, రీసెర్చ్‌పై దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీకి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తుందని, యువతకు అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×