E-Paper
Advertisement

ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!

ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!
Advertisement

Upcoming Mobiles In May 2026: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఫోన్ లేనిదే అడుగు తీసి బయట పెట్టే పరిస్థితి ఉండటం లేదు. మరోవైపు మెుబైల్ కంపెనీలు సైతం.. యూజర్ల అవసరాలు, అభిరుచులు, సౌకర్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధునాతన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మే నెలలోనూ మరికొన్ని అద్భుతమైన ఫోన్లు మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవి ఏంటీ? వాటిలోని ప్రధాన ఫీచర్లు ఏవి? ఈ కథనంలో చూద్దాం.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 6

ఈ ఫోన్ మే 7 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. పీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్.. 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 8000mAh బిగ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇది రాబోతోంది. 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా దీనికి అందించారు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా సిరీస్

Advertisement

ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను మే నెలలోనే పరిచయం చేయనుంది. Find X9 Ultra, Find X9s పేర్లతో వాటిని తీసుకురానుంది. X9 Ultra మోడల్ విషయానికి వస్తే 6.82 అంగుళాల స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, అత్యంత నాణ్యమైన క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ దీనిలో ఉన్నాయి. ఫైండ్ ఎక్స్ 9ఎస్ వేరియంట్ లో 7,025mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ ప్రాసెసర్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వివో ఎక్స్ 300 అల్ట్రా, ఎక్స్ 300 ఎఫ్ఈ

వివో తన X300 సిరీస్‌లో భాగంగా ఈ మోడల్స్‌ను తీసుకువస్తోంది. ఎక్స్ 300 అల్ట్రా వేరియంట్.. ప్రీమియం ఫీచర్లతో రాబోతోంది. అయితే అవి ఏంటన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఎక్స్ 300ఎఫ్ఈ మోడల్.. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 6.31 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మోటొరోలా ఎడ్జ్ 70 ప్రో 5G

Advertisement

మోటోరోలా నుండి వస్తున్న ఈ ఫోన్ చాలా స్లిమ్ డిజైన్‌తో ఉండబోతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ స్ట్రీమ్, 144 రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్ నెస్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 6,500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రధాన ఫీచర్లను ఇది కలిగి ఉండనుంది.

Also Read: ఇన్వర్టర్‌ బ్యాటరీలో ఎలా పడితే అలా నీరు పోస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వన్ ప్లస్ 15ఎస్

ఇది వన్‌ప్లస్ నుండి రాబోతున్న ఒక ‘కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్’ మొబైల్. స్నాప్ డ్రాగెన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 6.32 అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, 7,500mAh బ్యాటరీ, 100 వాట్స్ వైర్డ్, 50వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఇది రానుంది. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన టెలిఫోటో లెన్స్ వంటి ఫీచర్లు ఈ వన్ ప్లస్ మెుబైల్ లో ఉండనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Also Read: మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×