Telugu Classics :వెండి తెరపై కనువిందు చేసే దృశ్యాల వెనక మనకి తెలీని కొన్ని ఆసక్తి సంఘటనలు జరుగుతుంటాయ్. మరి అలనాటి క్లాసిక్స్ అయిన ఈ సినిమాలలో తెర వెనుక జరిగిన కొన్ని విశేషాలని మనమూ ఒకసారి చూసేద్దామా!
మాయా బజార్ విషయానికి వస్తే
మొదటగా అలనాటి క్లాసిక్ మాయా బజార్ సినిమా విషయానికి వస్తే, ఘటోత్కచుడుగా ఎస్వీ రంగారావు పోషించిన పాత్ర న భూతో న భవిష్యత్. ఇక ఆ సినిమాలో వివాహ భోజనంబు అనే పాట షూటింగ్ గ్రాఫిక్స్ లాంటివేవి లేని రోజుల్లో చేయడం ఒక సాహసం అని చెప్పాలి. ఆ పాటలో లడ్డూలు ఎగిరి ఘటోత్కచుడి నోట్లో పడటం మనకి తెల్సిందే. మరి ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మార్కస్ బార్ట్లే అలా వచ్చేందుకు ఏం చేశాడో తెలుసా.. లడ్డూలు ఎగిరి నోట్లోకి వెళ్లడానికి ఆ లడ్డూలకు సన్నని దారాలు కట్టి, వాటిని వెనక్కి లాగుతూ (Reverse Photography) షూట్ చేశాడట. ఇక ఆ పాట కంప్లీట్ కావడానికి దాదాపు 4 రోజులు పట్టిందట. ఇక నిజమైన ఆ లడ్డూలు పాడవకుండా నాలుగు రోజుల పాటు ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుందట మూవీ టీమ్.
ఇదే ‘మాయాబజార్’లో
ఇక ఇదే ‘మాయాబజార్’లో శశిరేఖ (సావిత్రి) అద్దం ముందు కూర్చుని తనను తాను చూసుకుంటే, అందులో అభిమన్యుడు (అక్కినేని) కనిపిస్తాడన్న సంగతి మనకి తెల్సిందే. మరి గ్రాఫిక్స్ లేకుండా ఇలా ఎలా మ్యానేజ్ చేశారా అన్న క్యూరియాసిటీ కలగడం సహజం. దీనికోసం ఒక అద్దాన్ని సగానికి కోసి, వెనుక వైపు నుంచి అక్కినేని గారు కూర్చునేలా సెట్ వేశారట. సావిత్రి ఒకవైపు నుంచి అద్దంలో చూస్తుంటే, సరిగ్గా అదే యాంగిల్‌లో అక్కినేని ఉండటం వల్ల ఒకే అద్దంలో ఇద్దరు ఉన్నట్లు భ్రమ కలిగించిందన్న మాట. ఈ టెక్నిక్ కోసమే కెమెరామెన్ మార్కస్ బార్ట్లే రెండు రోజుల పాటు లైటింగ్‌తో ప్రయోగాలు చేసి మరీ ఈ సీన్ ని సక్సెస్ చేయడం విశేషం.
దాన వీర శూర కర్ణ సినిమా..43 రోజుల్లో
ఇప్పట్లో మైథలాజి, పౌరాణిక సినిమాలని తీయడానికి ఏళ్లకేళ్ళు తీసుకుంటున్నారు, కాని దాన వీర శూర కర్ణ సినిమాని ఎన్టీఆర్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడో తెలుసా… అక్షరాల 43 రోజుల్లో. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరోగా మాత్రమే కాదు, విలన్ గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా అన్ని మేజర్ క్రాఫ్ట్‌లని తన భుజాల మీద వేసుకోవడం విశేషం. ఇక తెల్లవారుజామున 3 గంటలకే మేకప్ వేసుకుని అర్ధరాత్రి వరకు పనిచేసే ఆయన స్పీడ్‌ని చూసి షాక్ అయిపోయేదట సినిమా యూనిట్.
also read:27 ఏళ్ల తర్వాత వెండితెరపై మ్యాజిక్.. నాగార్జున ‘కింగ్ 100’లో టబు రీ-ఎంట్రీ ఫిక్స్!
కృష్ణకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘సాక్షి
ఇక సూపర్ స్టార్ కృష్ణకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘సాక్షి’. దర్శకుడు బాపు తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ అంతా పులిదిండి అనే ఒక చిన్నపల్లెటూరులో జరిగింది. అయితే కనీస సౌకర్యాలు కూడా లేని ఆ ఊర్లో ఒక చిన్న గుడిసెలో ఉండి, ఊరి బయట ఉన్న కాలువలో స్నానం చేసి షూటింగ్ కి వచ్చేవారట కృష్ణ. అలా సింపుల్ గా ఉండటం వల్లే కాబోలు సూపర్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సాక్షి సినిమా అప్పుడే కృష్ణ విజయనిర్మలని కలిసింది.
అక్కినేని వారికి దేవదాసు
ఇక అక్కినేని వారికి దేవదాసు ఎంతటి పేరు తెచ్చిందో చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక కుక్క ఏడవడం మీకు గుర్తుండే ఉంటుంది. దాని వెనుక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా. సినిమా అంతటా అక్కినేని వెంట తిరిగే కుక్క సినిమా చివరికి వచ్చే సరికి బాగా అలవాటు అయిపోయింది. ఇక క్లైమాక్స్ లో అక్కినేని పార్వతి ఇంటి ముందు పడిపోయినప్పుడు, ఆ కుక్క నిజంగానే కన్నీళ్లు పెట్టుకుందట. దాంతో అది చూసి యూనిట్ లో ఉన్నవాళ్ళు షాక్ అయ్యారు. ఇక కుక్క అలా ఏడవడాన్ని క్యాప్చర్ చేసిన మేకర్స్ సినిమాలో అలాగే ఉంచేశారు. అదే సినిమాకు ఒక పెద్ద అసెట్ అయ్యిందన్న సంగతి చెప్పక్కర్లేదు.
పాతాళ భైరవిలో విశ్వరూపం చూపించిన SVR
అలనాటి క్లాసిక్ పాతాళ భైరవిలో మంత్రవాది పాత్రలో విశ్వరూపం చూపించాడు ఎస్వీ రంగారావు. అయితే ఈ సినిమాకోసం డిఫరెంట్ గెటప్ వేసుకునే SVR ఆ గెటప్‌లో ముక్కు చివర ఎముక ముక్కలా ఉండటం మనకి కనిపిస్తుంది. అయితే దాన్ని అతికించడానికి వాడిన గమ్ వల్ల ఏకంగా ముక్కుకే ఇన్ఫెక్షన్ అయిన పరిస్థితి. అయినా ఆ నొప్పిని భరిస్తూనే సినిమాని పూర్తి చేశాడట SVR. అందుకేనేమో వారి గురించి ఇప్పటికీ గొప్పగా మాట్లాడుకుంటాం.
బృహన్నలగా నర్తనశాలలో
ఇక బృహన్నలగా నర్తనశాలలో ఎన్టీఆర్ చూపించిన నటనని మనమిప్పటికీ మర్చిపోలేము. అయితే ఆ పాత్ర అంతలా పండటానికి, ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలకడానికి ప్రఖ్యాత నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గారి వద్ద స్పెషల్‌గా శిక్షణ తీసుకోవడం విశేషం. ఇక కళ్లకి కాటుక పెట్టుకుని, చేతులకు గోరింటాకు పెట్టుకుని రోజంతా ఆ పాత్రలో ఉండేందుకు ప్రయత్నించేవారట. ఎంతలా అంటే, ఇంటి దగ్గర కూడా ఆడవారిలా నడవటం ప్రాక్టీస్ చేసేవారట కూడా. ఈ కమిట్‌మెంటే ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టింది.
also read: మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లేముందు పిల్లలకి రేణు దేశాయ్ ఏం చెబుతుందో తెలుసా ?
గుండమ్మ కథ కల్ట్ క్లాసిక్
ఇక గుండమ్మ కథ చూడని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. తెలుగు సినిమాలలో అదొక కల్ట్ క్లాసిక్. అయితే ఈ సినిమాలో రామారావు హనుమంతుడి వేషం వేసి అక్కినేనిని భయపెట్టే సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అయితే సీన్ షూట్ అయ్యేటప్పుడు ఎన్టీఆర్ నిజంగానే ఒక కోతిలా అరుస్తూ అక్కినేని గారిపైకి దూకారు. అది స్క్రిప్ట్‌లో లేకపోయినా, ఏఎన్నార్ గారు అస్సలు భయపడకుండా తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య అంతటి కోఆర్డినేషన్ ఉండటం వల్లే సినిమా సహజంగా వచ్చింది.
శంకరాభరణం ..వేరే క్లైమాక్స్
శంకరాభరణం.. పెద్ద హీరోలు లేనప్పటికీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ కోసం మొదట్లో కె. విశ్వనాథ్ వేరే వెర్షన్ అనుకున్నప్పటికీ, జె.వి. సోమయాజులు గారు (శంకరశాస్త్రి) మరణించే ముందు ఆ శివలింగం దగ్గర చేసిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన విశ్వనాథ్ అప్పటికప్పుడు మార్చి రాశారట. ఇక చేసిన ఆ మార్పు ఎంతలా పని చేసింది అంటే ఆ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేంతగా. ఒక రకంగా సినిమా క్లాసికల్ అయినప్పటికీ అంత పెద్ద హిట్ అయిందంటే కారణం ఆ ఎమోషనే.
మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369
ఇక బాలయ్య బాబు హీరోగా తెలుగులో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 అన్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన ‘టైమ్ మెషిన్’ ని ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా ఎలా రూపొందించారో తెలుసా.. పాత రేడియో స్పేర్ పార్ట్స్, సిల్వర్ ఫైల్స్, మరియు కొన్నిపాతకాలం బల్బులను వాడి ఒక వెరైటీ లుక్‌లోకి తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ కోసం ఏకంగా లండన్ నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్లను పిలిపించడం విశేషం. నిజంగా కేవలం 1.5 కోట్ల బడ్జెట్‌లో ఇంతటి విజువల్ వండర్ సృష్టించారంటే సింగీతం వారిని మెచ్చుకోవాల్సిందే.
also read :గొర్రెలను అమ్మి కోటి రూపాయలతో సినిమా.. గొర్రెలు కాచుకునే మహిళ సంచలనం! మే 8న ‘స్పిరిట్’ రిలీజ్