E-Paper
Advertisement

మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!

మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!
Advertisement

Washing Machines 2026: ప్రస్తుత రోజుల్లో వాషింగ్ మిషన్ లేని ఇళ్లు ఉండవంటే ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు.. వీటిని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు అత్యాధునిక ఫీచర్లు కలిగిన కొత్త మోడల్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేలో అందుబాటులో ఉండనున్న అత్యాధునిక వాషింగ్ మిషన్లు, వాటిలోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హైయర్ ఎఫ్ 11 సిరీస్

హైయర్ కంపెనీకి చెందిన ఈ ప్రీమియం సిరీస్ వాషింగ్ మిషన్లు.. ఏఐ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. దీనిలోని అల్ట్రా ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ (Ultra Fresh Air Technology).. బట్టలు మిషన్ లో ఉన్నప్పుడు దుర్వాసన రాకుండా లోపలకి తాజా గాలిని ప్రసరింపజేస్తుంది. టచ్ స్క్రీన్ ప్యానెల్ తో రావడం వల్ల దీనిని తేలిగ్గా ఆపరేట్ చేయవచ్చు. బెల్ట్ తో పనిలేని డైరెక్ట్ మోషన్ మోటర్ వల్ల శబ్దం చాలా తక్కువగా వస్తుంది. బట్టల బరువును బట్టి దానంతట అదే కావాల్సినంత డిటర్జెంట్‌ను తీసుకోవడం ఈ మిషన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

అకాయ్ డిజిటల్ వాష్ సిరీస్

Advertisement

అకాయ్ కంపెనీకి చెందిన ఈ అధునాతన వాషింగ్ మిషన్లు.. డీప్ క్లీన్ టెక్నాలజీతో రూపొందాయి. ఇవి బట్టల లోతుల్లోకి వెళ్లి దుస్తుల మెరుపు తగ్గకుండా మురికిని వదిలించేస్తాయి. ఇంటిని వీడి చేసే హీటర్, కరెంటు తక్కువగా వినియోగించే ఇన్వర్టర్ టెక్నాలజీ దీనిలో ఉన్నాయి. మిషన్ డ్రమ్ కు వేసిన యాంటీ బ్యాక్టీరియల్ కోట్.. లోపలకి క్రిములు, కీటకాలు చేరకుండా చూస్తాయి.

ఎల్జీ ఏఐ డీడీ 2.0 వాషింగ్ మిషన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఎల్జీ.. సరికొత్త ఏఐ టెక్నాలజీతో ఈ వాషింగ్ మిషన్ ను రూపొందించింది. ఈ మిషన్ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో సెన్సార్ల ద్వారా గుర్తించి.. వాటికి తగ్గట్లు వాష్ సైకిల్ ను అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే దీనిలోని ‘టర్బో వాష్ 360 డిగ్రీ’ ఆన్ చేస్తే.. కేవలం 39 నిమిషాల్లోనే బట్టలను అత్యంత వేగంగా ఉతికేస్తుంది. మరోవైపు ఇందులోని స్టీమ్ ప్లస్ టెక్నాలజీ.. 99.9 శాతం అలర్జీ కారకాలను తొలగించి బట్టలపై ముడతలు పడకుండా వాష్ చేస్తుంది.

ఐఎఫ్‌బీ ఎగ్జిక్యూటివ్ జెడ్ఎక్స్ఎస్

Advertisement

ఐఎఫ్ బీ కంపెనీకి చెందిన వాషింగ్ మిషన్లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీ రూపొందించిన ఈ వాషింగ్ మిషన్.. అత్యాధునిక క్లీనింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ మిషన్.. బట్టలకు ఏమాత్రం డ్యామేజ్ కలుగకుండా 9 రకాల మోషన్స్ లో శుభ్రం చేస్తుంది. అంతేకాదు బట్టల్లోని మెుండి మరకలు, క్రిములను వదిలించడానికి ఆవిరిని సైతం ఉపయోగిస్తుంది. కఠినమైన ఉప్పు నీటిని కూడా సరళంగా మార్చి డిటర్జేంట్ కరిగేలా చేయడం ఈ వాషింగ్ మిషన్ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Also Read: మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!

బాష్ సిరీస్ 8 వాషింగ్ మిషన్లు

జర్మన్ టెక్నాలజీతో వచ్చే బాష్ సిరీస్ 8 వాషింగ్ మిషన్లు.. ఇప్పుడు మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని ఎకో సైలెన్స్ డ్రైవ్ ఫీచర్.. చాలా సైలెంట్ గా దుస్తులను ఉతికేస్తుంది. అంతేకాదు బట్టల పరిమాణాన్ని బట్టి నీటిని చాలా పొదుపుగా వాడుతుంది. అంతేకాకుండా బట్టలు ఒకదానికొకటి చిక్కుపడకుండా డ్యామేజ్ అవ్వకుండా ఈ మిషన్ చూస్తుంది. ఇతర వాటితో పోలిస్తే.. వాషింగ్ లో ఏమాత్రం క్వాలిటీ తగ్గకుంటా 65 శాతం సమయంలోనే బట్టలను ఇది ఉతికేస్తుంది.

Also Read: కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×