E-Paper
Advertisement

కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!

కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Advertisement

Upcoming ACs in May 2026:  వేసవి కాలంలో ఏసీలకు అమాంతం డిమాండ్ పెరిగిపోతుంటుంది. సమ్మర్ ఉండే భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు కలిగి సరికొత్త ఏసీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో మే నెలలో అందుబాటులో ఉండనున్న మోస్ట్ వాంటెడ్ ఏసీలు, వాటిలోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏఐ ఏసీ

2026 ఏడాదికి గానూ ఎల్జీ ఈ అధునాతన ఏసీని రూపొందించింది. ఈ మోడల్ ఏఐ కన్వర్టిబుల్ 6 ఇన్ 1 (AI Convertible 6-in-1) కూలింగ్ ఫీచర్ కలిగి ఉంది. గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్ ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనిలో విరాట్ మోడ్ (Viraat Mode), డైట్ మోడ్ ప్లస్ (Diet Mode Plus) వంటి ప్రత్యేక మోడ్స్ ను తీసుకొచ్చారు. విద్యుత్ ను ఆదా చేయడంలో తోడ్పాటు అందిస్తాయి. మరోవైపు వైరస్ ల నుంచి రక్షణ కోసం ఈ ఏసీలో హెచ్ డీ ఫిల్టర్.. సెల్ఫ్ క్లీనింగ్ కోసం హిమ్ క్లీన్ టెక్నాలజీ (Him Clean) ఇందులో ఇన్ బిల్ట్ చేశారు.

పానాసోనిక్ 1 టన్ 5 స్టార్ వై-పై ఏసీ

Advertisement

పానాసోనిక్ ఈ ఏసీలో సరికొత్త మ్యాటర్ ఎనేబుల్డ్ (Matter Enabled) ఫిక్స్ చేసింది. దీని సాయంతో ఇంట్లోని స్మార్ట్ హోమ్ పరికరాలతో దీనిని ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. అలాగే ఇందులో 8-in-1 కన్వర్టిబుల్ మోడ్స్, గాలి నాణ్యత కోసం PM0.1 ఫిల్టర్, గదిలోని దుమ్మును తొలగించడానికి డస్ట్ బస్టర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ఇచ్చిన వైఫై కనెక్టింగ్ ఫీచర్ ఆధారంగా MirAIe యాప్ ను ఉపయోగించి ఫోన్ నుంచే ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

శాంసంగ్ బెస్పోక్ ఏఐ విండ్ ఫ్రీ

శాంసంగ్ ఈ ప్రీమియం మోడల్ బెస్పోక్ ఏఐ విండ్ ఫ్రీ ఏసీని అధునాతన ఫీచర్లతో రూపొందించింది. ఇది నేరుగా చల్లగాలిని శరీరానికి తగలనివ్వదు. గత మోడల్స్ తో పోలిస్తే ఇందులో కొత్తగా 5 మోషన్ విండ్ ఫీచర్‌ను చేర్చారు. ఇది గాలిని ఐదు రకాలుగా ప్రసరింపజేసి.. గదిని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. ఇక దీనిలోని ఏఐ ఎనర్జీ మోడ్ (AI Energy Mode) విద్యుత్ వినియోగాన్ని 30 మేర తగ్గిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలోని వెల్ కమ్ కూలింగ్ అండ్ ఏవే కేర్ ఫీచర్ ద్వారా ఇంటికి రాకముందే ఏసీని ఆన్ చేయడం లేదా ఆపివేయడం వంటివి స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా చేయవచ్చు.

Advertisement

Also Read: ఏసీ, కూలర్ ఎంత వాడినా.. సగం కరెంటు బిల్లే రావాలా? ఈ 4 పనులు చేస్తే సరి!

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ

డైకిన్ కంపెనీకి చెందిన ఈ 2026 మోడల్‌లో 3D Coanda Airflow టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది గాలిని గదిలోని అన్ని మూలలకు 16 మీటర్ల దూరం వరకు ప్రసారింపజేస్తుంది. ఇందులో ఉన్న డ్యూ క్లీన్ టెక్నాలజీ (Dew Clean Technology) ఏసీ లోపలి భాగాలను ఆటోమేటిక్‌గా శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనికి ఉన్న Triple Display ఫీచర్ ద్వారా సెట్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్, ఎర్రర్ కోడ్లను సులభంగా చూడవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Also Read: AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!

Related News

మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!

మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!

AI చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. వచ్చేసింది GPT-5.5, ఇక కోడింగ్ చిటికెలో!

గేమింగ్ ట్రిగ్గర్స్, ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్.. మార్కెట్లోకి వచ్చేసిన Infinix GT 50 Pro!

AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!

Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!

మగువల మనసు దోచేలా నాయిస్ స్పెషల్ గిఫ్ట్.. రూ.5,000 లోపే లగ్జరీ సిరామిక్ వాచ్!

Big Stories

Advertisement
×