E-Paper
Advertisement

ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్

ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్
Advertisement

URBN 20000 mAh Power Bank Review: ఈ రోజుల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడైనా లేదా ఆఫీస్ వర్క్‌లో ఉన్నప్పుడైనా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అయిపోతే పెద్ద తిప్పలే వస్తాయి. తరచూ ఛార్జింగ్ సాకెట్ కోసం వెతుక్కోవడం కష్టంగా మారినప్పుడు ఒక సాలిడ్ పవర్ బ్యాంక్ దగ్గరుండడం ఎంతో అవసరం. అలాంటి వారి కోసం పాపులర్ బ్రాండ్ అర్బన్ ఒక అద్భుతమైన ఆప్షన్‌ తెచ్చింది. కేవలం రూ. 1,099 ఆఫర్ ధరతో లభిస్తున్న URBN 20000 mAh  Power Bank ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

URBN 20000 mAh పవర్ బ్యాంక్ రివ్యూ :

రూ. 1,100 బడ్జెట్‌లో 20000 mAh భారీ కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చే పవర్ బ్యాంకులు మార్కెట్‌లో చాలా తక్కువ. ఈ బ్రాండ్ తన కాంపాక్ట్ డిజైన్, మేడ్ ఇన్ ఇండియా ప్రౌడ్‌నెస్ తో ఈ రేంజ్‌లో ట్రెండింగ్ ప్రొడక్ట్‌గా నిలిచింది.

Advertisement

1. డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:
సాధారణంగా 20000 mAh పవర్ బ్యాంకులు ఇటుక రాయిలా చాలా బరువుగా, లావుగా ఉంటాయి. కానీ దీని ఈ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచించింది.

పాకెట్-ఫ్రెండ్లీ సైజ్: ఇది సాధారణ పవర్ బ్యాంకుల కంటే.. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి, బ్యాగ్‌లో లేదా జాకెట్ పాకెట్‌లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.

Advertisement

టెక్స్చర్డ్ ఫినిషింగ్: పవర్ బ్యాంక్ బయటి భాగంపై మంచి గ్రిప్ ఉండేలా టెక్స్చర్డ్ డిజైన్ ఇచ్చారు, దీని వల్ల చేతిలోంచి జారిపోదు.

ఎల్ఈడీ ఇండకేటర్స్: ఇందులో ఉండే చిన్న ఎల్ఈడీ లైట్ల ద్వారా పవర్ బ్యాంకులో ఎంత బ్యాటరీ మిగిలి ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.

2. ఛార్జింగ్ స్పీడ్ & పర్ఫార్మెన్స్:
ఈ పవర్ బ్యాంక్ ప్రధాన హైలైట్ దీని 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

పవర్ డెలివరీ: ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. మీ ఫోన్ 50% ఛార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాల సమయం సరి పోతుంది.

మల్టీ-డివైజ్ ఛార్జింగ్: ఇందులో టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టైప్-సి పోర్ట్, సాధారణ USB-A పోర్ట్‌లు ఉంటాయి. అంటే.. ఒకేసారి రెండు డివైజ్‌లను (ఉదాహరణకు ఫోన్, ఇయర్‌బడ్స్) ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎన్నిసార్లు ఛార్జ్ చేయవచ్చు?: 4000 mAh బ్యాటరీ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను దాదాపు 3 నుంచి 4 సార్లు పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయెచ్చు.

3. సేఫ్టీ & సెక్యూరిటీ:
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఛార్జ్ చేసేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఇందులో 12-రింగ్ అడ్వాన్స్‌డ్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అందించింది.

ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్ కాకుండా ఇది మీ ఫోన్‌ను సేఫ్ గా  ఉంచుతుంది.

ఫ్లైట్ లేదా విమాన ప్రయాణాల్లో కూడా ఈ పవర్ బ్యాంక్‌ను హ్యాండ్ బ్యాగేజ్‌లో తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.

ధర:
ఆన్‌లైన్ ఆఫర్లలో ఈ పవర్ బ్యాంక్ ప్రారంభ ధర కేవలం రూ. 1,099. సేల్ సమయాల్లో ఇది రూ. 1,000 నుంచి రూ. 1,299 ల మధ్య లభిస్తుంది. ఇది బ్లాక్, ఆర్థ్ క్రాఫ్ట్, బ్లూ లాంటి రంగులలో ఇది అందుబాటులో ఉంది.

Also Read: రూ. 4,000 లోపు వాచ్ కొంటున్నారా? ఈ రివ్యూ చూశాకే డిసైడ్ అవ్వండి!

ప్రత్యేకతలు :
1.రూ. 1,099లకే 20000 mAh భారీ బ్యాటరీ కెపాసిటీ .

2.22.5W ఫాస్ట్ ఛార్జింగ్ , టూ-వే టైప్-సి పోర్ట్ సపోర్ట్.

3.మిగతా పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే చాలా కాంపాక్ట్ , లైట్‌వేయిట్ డిజైన్.

4.మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ , 12-లేయర్ సేఫ్టీ ప్రొటెక్షన్.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి, కాలేజ్ స్టూడెంట్స్‌కు, రోజంతా ఫోన్ వాడే వారికి ఈ పవర్ బ్యాంక్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. రూ. 1,099 ధరకు ఇన్ని ఫీచర్లు, కాంపాక్ట్ సైజ్ దొరకడం ఖచ్చితంగా వర్త్ అని చెప్పవచ్చు.

Related News

రూ. 4,000 లోపు వాచ్ కొంటున్నారా? ఈ రివ్యూ చూశాకే డిసైడ్ అవ్వండి!

డిస్కౌంట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్.. స్టైలిష్ డిజైన్, 52 గంటల బ్యాటరీ

వాటర్ వేస్టేజ్ లేదు, మినరల్స్ మిస్ అవ్వవు ! ప్రతీ మోడర్న్ ఇంటికి పర్ఫెక్ట్ సెట్

మతిపోయే ఫీచర్లతో కొత్త వాషింగ్ మెషీన్స్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

Big Stories

Advertisement
×