Redmi Watch 5 Lite review: ఈ రోజుల్లో మన ఫిట్‌నెస్ చూసుకోవడానికి, రోజూ వచ్చే కాల్స్ మాట్లాడటానికి ఒక మంచి స్మార్ట్‌వాచ్ చాలా అవసరం అయిపోయింది. అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్, క్లియర్ డిస్‌ప్లే, పర్ఫెక్ట్ జీపీఎస్ దొరకడం కాస్త కష్టమే. అలాంటి వారి కోసం షామీ నుంచి Redmi Watch 5 Lite వచ్చింది. కేవలం రూ. 3,999లకే 1.96-ఇంచ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ ఇన్-బిల్ట్ GPS,5 ATM వాటర్ రెసిస్టెన్స్ లాంటి అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వాచ్ ఫీచర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని 1.96-ఇంచ్ డిస్‌ప్లే గురించే. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎంత ఎండలో ఉన్నా స్క్రీన్ నోటిఫికేషన్లు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. పదే పదే బటన్ నొక్కకుండా లేదా చెయ్యి పైకిత్తెకుండా టైమ్ చూసుకోవచ్చు. మెటాలిక్ లుక్ ఉన్న ఫ్రేమ్‌తో.. డిజైన్ చేశారు. రోజంతా చేతికి పెట్టుకున్నా బరువుగా అనిపించదు.
2. అడ్వాన్స్‌డ్ ఇన్‌బిల్ట్ జీపీఎస్:
చాలా బడ్జెట్ వాచ్‌లలో లొకేషన్ ట్రాకింగ్ కోసం ఫోన్ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ దీనిలో లో ఇన్-బిల్ట్ Five-System GPS సపోర్ట్ ఉంది. మీరు జాగింగ్ లేదా సైక్లింగ్ వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లోనే వదిలేసినా.. మీ రూట్‌ను చాలా ఆక్యురేట్‌గా ట్రాక్ చేస్తుంది. మీరు చేసే ప్రతీ వర్కౌట్‌ను, నడిచే అడుగులను పర్ఫెక్ట్‌గా ఇది లెక్కపెడుతుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌కు 5 ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే.. 50 మీటర్ల లోతు వరకు నీటిలో ఉన్నా ఏమీ కాదు. వర్షంలో తడిసినా, స్విమ్మింగ్ చేసినా లేదా బాగా చెమట పట్టినా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.
4. క్లియర్ బ్లూటూత్ కాలింగ్ :
ఇందులో మైక్ స్పీకర్ ఇచ్చారు. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు చుట్టూ ఉండే.. ట్రాఫిక్ శబ్దాలను తగ్గించి, మీ వాయిస్ అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా కేవలం మీ మాటలతోనే అలారమ్‌లు, టైమర్లు సెట్ చేసుకోవచ్చు.
ఇందులో పెద్ద 470mAh బ్యాటరీ ఇచ్చారు. నార్మల్ వాడకంలో 18 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. GPS, మిగతా ఫీచర్లు ఎక్కువగా వాడినా 7 నుంచి 12 రోజుల పాటు ఛార్జింగ్ ఈజీగా వస్తుంది.
రెడ్ మీ అధికారిక ధర రూ. 3,999. ఆన్‌లైన్ సేల్స్ , బ్యాంక్ ఆఫర్లలో ఇది ఇంకా తక్కువ ధరకు (రూ. 3,299 నుంచి రూ. 3,499లకే) లభిస్తుంది. ఇది బ్లాక్ , లైట్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
Also Read: డిస్కౌంట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్.. స్టైలిష్ డిజైన్, 52 గంటల బ్యాటరీ
ప్రత్యేకతలు:
బ్రైట్‌గా ఉండే 1.96-ఇంచ్ AMOLED డిస్‌ప్లే.
స్మార్ట్‌ఫోన్ సాయం లేకుండా లొకేషన్ చూపే ఇన్-బిల్ట్ జీపీఎస్.
స్విమ్మింగ్ చేయడానికి అనువైన 5 ATM వాటర్ రెసిస్టెన్స్.
కాల్స్ మాట్లాడటానికి ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్.
దాదాపు 18 రోజుల బ్యాటరీ లైఫ్.
రూ. 4,000 బడ్జెట్‌లో సరైన GPS, సూపర్ డిస్‌ప్లే, ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఈ వాచ్ ఒక గొప్ప ఛాయిస్. రోజూ వాడటానికి, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కి ఇది ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ప్రొడక్ట్.