E-Paper
Advertisement

హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక మిస్టరీ ఇదే!

హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక మిస్టరీ ఇదే!
Advertisement

Hotel Clocks: సాధారణంగా ఎవరైనా విహారయాత్రకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా హోటల్స్ లోనే బస చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడి గదుల్లో టీవీ, ఏసీ, ఫ్రిజ్, బెడ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నప్పటికీ.. ఒక్కటి మాత్రం ఎక్కడా కనిపించదు. అదే ‘గోడ గడియారం’. కనీసం బల్ల మీద చిన్న ‘టేబుల్ క్లాక్’ సైతం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. రూమ్ ను లగ్జరీగా మెయిన్ టెన్ చేసే హోటల్స్.. రూ. 300 కూడా ఉండని గోడ గడియారాలను ఎందుకు గదిలో ఉంచవనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే దీని వెనుక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయని చెప్పవచ్చు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

మానసిక ఒత్తిడి దూరం

సాధారణంగా సెలవులపై వచ్చే పర్యాటకులు ఒత్తిడికి దూరంగా.. సమయం తెలియకుండా గడపాలని భావిస్తుంటారు. కాబట్టి రోజూవారీ బిజీ జీవితాల్లో వినిపించే టిక్ టిక్ మనే గోడ గడియారం శబ్దం.. నిరంతరం మారుతూ ఉండే సమయం వారి కంట పడకూడదన్న ఉద్దేశంతో.. హోటల్స్ ఇలా గడియారాలను అతిథులకు దూరంగా ఉంచుతాయి. గడియారం లేకపోవడం వల్ల సమయంతో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోవడానికి, ఫ్యామిలీతో గడపడానికి వారికి వీలవుతుంది.

స్మార్ట్ ఫోన్లు ఓ కారణమే

Advertisement

వాస్తవానికి కొన్నేళ్ల క్రితం వరకూ కూడా చాలా వరకూ హోటల్స్ లో క్లాక్స్ తప్పనిసరి వస్తువుగా ఉండేది. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సమయం చూడటానికి, అలారం పెట్టడానికి అందరూ తమ ఫోన్లనే వినియోగిస్తున్నారు. దీంతో గడియారాన్ని గదిలో పెట్టే కొన్ని హోటల్స్ సైతం క్లాక్ ఏర్పాటు చేయడం లేదు. అసలు హోటల్ గదిలో క్లాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం రావట్లేదని యజమానులు చెబుతున్నారు.

నిర్వహణ భారం తగ్గుదల

కొన్ని పెద్ద పెద్ద 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ లో వందలాది గదులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతీ గదిలోనూ గడియారం పెట్టడం, తరుచూ వాటి బ్యాటరీలను ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్న పని. పైగా వచ్చిన అతిథులు తాము పెట్టుకున్న అలారంను డిలీట్ చేయకుండా వదిలివేస్తే.. తర్వాత వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల అతిథుల నుంచి కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చి.. హోటల్ రేటింగ్స్ పై ప్రభావం పడొచ్చు. ఈ కారణం చేత కూడా హోటల్ గదుల్లో గడియారాలు ఉండట్లేదని చెప్పవచ్చు.

Advertisement

Also Read: రూ. 4,000 లోపు వాచ్ కొంటున్నారా? ఈ రివ్యూ చూశాకే డిసైడ్ అవ్వండి!

సమయం దాటితే లాభం..

సాధారణంగా హోటల్స్ సమయాన్ని బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. 12 గంటలు, 24 గంటలు, 48 గంటల సమయాన్ని బట్టి గదికి డబ్బులను వసూలు చేస్తుంటాయి. అయితే రూమ్ లో గడియారం ఉండటం వల్ల ఎప్పటికప్పుడు అతిథులు అప్రమత్తంగా ఉండేందుకు వీలుంటుంది. తమ సమయం అయ్యేలోపు గదిని ఖాళీ చేసేందుకు అస్కారం ఏర్పడుతుంది. అదే గడియారం లేకపోతే.. వారు సమయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కొన్ని సార్లు నిర్ణీత గంటలకు మించి.. గదిలో గడిపే ఛాన్స్ ఉంది. దాంతో అతిథుల నుంచి అదనంగా డబ్బును వసూలు చేసే అవకాశం హోటల్ నిర్వాహకులు లభిస్తుంది. కాబట్టి గడియారం లేకపోవడం వెనుక కొన్ని హోటల్స్ మైండ్ గేమ్ కూడా దాగి ఉందని అర్థం చేసుకోవచ్చు.

Also Read: చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!

Related News

రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్‌లు!

హైదరాబాద్‌లో ఏం జరిగింది? ముగ్గురు పైలట్లకు అస్వస్థత, విచారణ చేపట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్

మంచి క్వాలిటీ స్టైలిష్ జీన్స్ కేవలం రూ.200.. దేశంలోనే బడ్జెట్ షాపింగ్ మార్కెట్ ఇదే

ఫ్రీ ఫ్రీ.. దుబాయ్‌లో హోటల్ స్టే, డిన్నర్, ట్రావెల్ అన్నీ ఉచితం.. ప్రభుత్వం కొత్త ఆఫర్

కాచిగూడ స్టేషన్‌ కు మెగా మేకోవర్.. రూపు మారుతుంది.. కానీ, వారసత్వం చెక్కుచెదరదు!

12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

Big Stories

Advertisement
×