E-Paper
Advertisement

AI Tools: ఏఐ టూల్స్ వాడుతున్నారా ? ఇలా చేయకపోతే.. మీ పర్సనల్ డేటా రిస్కులో పడ్డట్లే !

AI Tools: ఏఐ టూల్స్ వాడుతున్నారా ? ఇలా చేయకపోతే.. మీ పర్సనల్ డేటా రిస్కులో పడ్డట్లే !
Advertisement

AI Tools: నేటి డిజిటల్ యుగంలో ఏఐ టూల్స్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఆఫీసు పని నుంచి హోంవర్క్ వరకు ప్రతిదానికీ చాట్ జీపీటీ(ChatGPT) లేదా జెమిని (Gemini ai) వంటి టూల్స్‌పై ఆధారపడుతున్నారు. ఇవి మన పనిని సులభతరం చేస్తున్న మాట వాస్తవమే.. కానీ వీటిని వాడేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు. అందుకే దీనిని వాడేటప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

AI టూల్స్ వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లు:
ఏఐ టూల్స్ మనకు ఎంత సహాయపడినా.. దాన్ని వాడేటప్పుడు మనం కొన్ని పరిమితులను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ కింది తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

Advertisement

1. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకండి:
చాలా మంది ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడేటప్పుడు తమ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్లు లేదా ఆఫీసుకి సంబంధించిన రహస్యాలను షేర్ చేస్తుంటారు. ఏఐ టూల్స్ మీ డేటాను తమ మోడల్స్‌ను ట్రైన్ చేయడానికి వాడుకుంటాయి. అంటే మీరు ఇచ్చే సమాచారం సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి.. మీ ప్రైవసీకి ఇబ్బంది కలిగే ఏ విషయాన్నీ ఏఐకి చెప్పకండి.

2. సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం:
ఏఐ ఇచ్చే ప్రతి సమాచారం 100 శాతం నిజం అనుకోవడం అతిపెద్ద పొరపాటు. ఒక్కోసారి ఏఐ చాలా ఆత్మవిశ్వాసంతో తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. దీన్నే ” ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హ్యాలూసినేషన్ ” అంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సలహాలు, చట్టపరమైన విషయాలు లేదా చారిత్రక అంశాల విషయంలో ఏఐ ఇచ్చే ఆన్సర్లను గూగుల్ సెర్చ్ ద్వారా లేదా నిపుణుల ద్వారా క్రాస్-చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

3. కాపీ-పేస్ట్  :
ఏఐ రాసి ఇచ్చిన ఆర్టికల్‌ను లేదా ఈమెయిల్స్‌ను ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేసి వాడకండి.ఏఐ ఇచ్చే సమాచారంలో మనుషుల సహజమైన భావోద్వేగాలు ఉండవు. అలాగే.. ప్రస్తుతం వీటి ద్వారా రాసిన కంటెంట్‌ను కనిపెట్టే.. సాఫ్ట్‌వేర్లు కూడా వచ్చాయి. కాబట్టి ఏఐ ఇచ్చే డ్రాఫ్ట్‌ను తీసుకుని.. దానికి మీ సొంత శైలిని, ఆలోచనలను కలిపి మెరుగుపరచండి.

4. నైతిక విలువలను మర్చిపోవడం:
ఇతరుల ఫోటోలను మార్చడం, తప్పుడు వార్తలను సృష్టించడం లేదా వేరొకరి క్రియేటివ్ వర్క్‌ను మీదిగా చెప్పుకోవడం వంటి పనులకు ఏఐని వాడకండి. ఇది కేవలం అనైతికం మాత్రమే కాదు. సైబర్ చట్టాల ప్రకారం నేరం కూడా. దీనిని కేవలం మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మాత్రమే వాడాలి.

Also Read: ఏఐ వీడియోలు క్షణాల్లో చేసేయండి.. కళ్లు మూసి తెరిచేలోపల రెడీ.. కొత్త టెక్నాలజీ గురూ

5. విశ్లేషణాత్మక ఆలోచనను వదిలేయడం:
ప్రతి చిన్న పనికి ఏఐ పైనే ఆధారపడితే మన మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఉదాహరణకు.. ఒక చిన్న లెక్క చేయడానికి కూడా ఏఐని అడిగితే మన గణిత సామర్థ్యం తగ్గిపోతుంది. దీనిని ఒక అసిస్టెంట్‌లా చూడాలి కానీ.. అది మన మెదడుకు ప్రత్యామ్నాయం కాకూడదు. క్రియేటివ్ ఐడియాలు మీవే అయి ఉండాలి. వాటిని మెరుగుపరచడానికి మాత్రమే ఏఐ సహాయం తీసుకోవాలి.

6. పాత సమాచారం పట్ల జాగ్రత్త:
చాలా ఏఐ మోడల్స్‌కు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే సమాచారం తెలుసు. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం ఏఐని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×